ఉత్తమ హోటల్ డీల్స్... భారతీయులే సాధిస్తారు
ముంబై: ఉత్తమ హోటల్ టారిఫ్ డీల్స్ సాధించడంలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారని హోటల్ ప్రైస్ ఇండెక్స్(హెచ్పీఐ) తాజా నివేదిక పేర్కొంది. టెక్సాస్ కేంద్రంగా ఆన్లైన్ ద్వారా వసతి సౌకర్యాలు కల్పించే హోటల్స్డాట్కామ్ ఈ నివేదికను రూపొందించింది. భారత్లో పర్యటించినప్పుడు భారతీయులు చెల్లించే సగటు రూమ్ టారిఫ్ రూ.4,950గానూ, విదేశాల్లో పర్యటించేటప్పుడు రూ.8,216గా ఉందని ఈ నివేదిక తెలిపింది. దేశీయ పర్యటనలు చేసేటప్పుడు అధిక రూమ్ టారిఫ్లను(రూ.11.430) స్విట్జర్లాండ్ దేశీయులు చెల్లిస్తున్నారని వివరించింది. ఆ తర్వాతి స్థానాల్లో నార్వే(రూ.10,438), సింగపూర్(రూ.10,150), ఆస్ట్రేలియా(రూ.9,401), స్వీడన్ (రూ.9,235)లు ఉన్నాయి.