breaking news
home documents
-
పత్రాలు ఇవ్వడానికి రూ.3 లక్షలు లంచం
అన్నానగర్ : ఇంటి పత్రాలను ఇవ్వడానికి రూ.3 లక్షలు లంచం అడిగిన తంజావూర్ సీఐపై శుక్రవారం సీబీఐ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఉంటున్న హాస్టల్ గదికి సీల్ వేశారు. వివరాలు.. తంజావూర్ పల్లియక్కిరకారకి చెందిన జోసఫ్ కుమారుడు అంథోనిస్వామి. జేసీబీ యంత్రాన్ని బాడుగకు ఇచ్చే వ్యాపారం చేస్తున్నాడు. ఇతను తంజావూర్ మేలవీధిలో ఫైనాన్స్ సంస్థ నడుపుతున్న చంద్ర వద్ద 2016లో మూడు కంతుల వారీగా రూ.10.50 లక్షలు తీసుకున్నాడు. తన స్నేహితుల స్థలాలకు సంబంధమైన 4 దస్తావేజులను చంద్ర వద్ద అంథోనిస్వామి కుదువ పెట్టాడు. తరువాత అతను, అప్పుని కొద్ది కొద్దిగా వడ్డీతో చెల్లించాడు. వడ్డీతో కలిపి రూ.12.5 లక్షలు చెల్లించగానే తన దస్తావేజులను ఇవ్వమని అంథోనిస్వామి అడిగాడు. ఇంకా నగదు ఇస్తేనే దస్తావేజులను తిరిగి ఇస్తానని చంద్ర తెలిపాడు. దీంతో అంథోని స్వామి కొన్ని నెలల ముందు తంజావూర్ జిల్లా ఎస్పీ సెంథిల్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేయాలని తంజావూర్ నగర జాయింట్ పోలీసు సూపరింటెండెంట్‌కు పంపారు. అనంతరం పోలీసు సీఐ జ్యోతి మహాలింగం ఇరువర్గాల వారిని పోలీసు స్టేషన్‌కి పిలిపించి విచారణ చేశారు. రూ.1 లక్షతో ఇంకొక దస్తావేజుని చంద్ర వద్ద ఇవ్వాలని అంథోని వద్ద పలికాడు. చంద్ర వద్ద కుదువపెట్టిన 4 దస్తావేజులను సీఐ తీసుకున్నాడు. ఈ పత్రాలను తీసుకున్నట్లు అంథోని స్వామి వద్ద ఓ పేపర్‌పై సంతకం తీసుకున్నాడు. కానీ ఆ పత్రాలను అతనికి అప్పగించలేదు. పత్రాలు అడిగిన ఆంథోని స్వామిని తంజావూర్ పాత బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు హాస్టల్(రూం నంబర్105)కి వచ్చి తీసుకొమ్మని సీఐ చెప్పాడు. దీంతో అక్కడికి వెళ్లిన అంథోని స్వామి సీఐని కలిశాడు. అప్పుడు అతను, పత్రాలను ఇవ్వడానికి లంచం కోరాడు. అంథోని స్వామి తన వద్ద ఉన్న రూ.50 వేల నగదు ఇచ్చాడు. దాన్ని తీసుకున్న సీఐ ఒక పత్రం మాత్రం ఇచ్చాడు. ఇంకా 3 పత్రాలు కావాలంటే రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని అడిగాడు. లంచం ఇవ్వటానికి ఇష్టపడని అంథోని స్వామి తంజావూర్ సీబీఐ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీబీఐ పోలీసులు అతని కదలికలు పర్యవేక్షించారు. శుక్రవారం తంజావూర్ పోలీసుస్టేషన్‌కి లంచం నిషేధ పోలీసులు వెళ్లి అక్కడ పనుల్లో ఉన్న పోలీసుల వద్ద విచారణ చేశారు. అప్పడు అంథోని స్వామి కుదువ పెట్టిన పత్రాలను సీఐ జ్యోతి మహాలింగం తీసుకున్నట్లు, దాన్ని అతనికి అప్పగించకుండానే సంతకం తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం సీఐ నివసించిన గదికి సీల్ వేశారు. సీఐ జ్యోతి మహాలింగంపై సీబీఐ పోలీసులు కేసు నమోదు చేశారు. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్
-
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్
-
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్
అనంతపురం : పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి శుక్రవారం అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలంటూ నిరసన చేపట్టారు. ఆయన సుమారు అయిదు గంటలు పాటు నిరసన చేసినా అధికారులు పట్టించుకోలేదు. దాంతో విశ్వేశ్వర్ రెడ్డి ఉరవకొండలో రాస్తారోకోకు దిగటంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, అక్కడ నుంచి తరలించారు. మరోవైపు ఎమ్మెల్యే అరెస్ట్‌ను పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. -
ఇళ్ల పట్టాల సమస్య తీరేనా..?
దశాబ్దాలు గడిచినా పరిష్కారం కాలేదు పేదలకు పట్టా ఇవ్వడంలో జాప్యం సింగరేణి లీజు భూమిలో నిర్మించుకున్న ఇంటిపై హక్కు లేదు బెల్లంపల్లి : బెల్లంపల్లిలో ఇళ్ల పట్టాల సమస్య తీవ్రంగా ఉంది. బొగ్గు గనుల తవ్వకాలతో ఉత్పన్నమైన ఆ సమస్య 9 దశాబ్దాలు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు. సింగరేణి లీజు భూమిలో శాశ్వత కట్టడాలు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇవ్వడంలో అసాధారణ జాప్యం జరుగుతోంది. ఎన్నోఏళ్ల నుంచి భూమిపై యాజమాన్యపు హక్కును కల్పించడం లేదు. పట్టాలు లేకపోవడంతో నిర్మించుకున్న ఇంటిపై నిరుపేదలు ఎలాంటి హక్కుకు నోచుకోలేకపోతున్నారు. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకున్న పాపానపోలేదు. ఏళ్లు గడుస్తున్నా ఇళ్ల పట్టాల సమస్య అపరిష్కతంగానే ఉంటోంది. కొత్తగా ఏర్పాౖటెనా మంచిర్యాల జిల్లా , బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్‌పై పుర ప్రజలు పుట్టెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికైన ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారమవుతుందనే ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. బొగ్గు గనుల ప్రస్థానంత స్వాతంత్య్రానికి పూర్వం 1926 ప్రాంతంలో బెల్లంపల్లిలో బొగ్గు గనుల ప్రస్థానం ఆరంభమైంది. బ్రిటీష్ పాలనలో ఆంగ్లేయ భూగర్భ శాస్త్రవేత్త సర్ విలియం కింగ్ సర్వే చేయడంతో ఈ ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. “తాండూర్ కోల్‌మైన్స్’ పేరుతో బొగ్గు గనుల తవ్వకాలు ఆరంభమయ్యాయి. 1927లో మార్గన్స్‌ఫిట్ గనితో బొగ్గు గనుల ప్రస్థానం మొదలైంది. ఆ రోజుల్లో గ్రామీణులను బలవంతంగా తీసుకొచ్చి మృత్యు గుహల్లాంటి బొగ్గు గనుల్లో దింపి పనులు చేయించేవారు. ఆ తీరుగా సింగరేణి కొలువుచేస్తున్న కార్మికులు, బతుకు దెరువు కోసం కాలరీ ఏరియాకు వలస వచ్చిన కార్మికేతరులు ప్రభుత్వం నుంచి కంపెనీ తీసుకున్న లీజు (ఖాళీ) భూముల్లో పక్కా కట్టడాలు నిర్మించుకున్నారు. ఇప్పటికి 90 ఏళ్లు గడుస్తున్నా నివేశన స్థలాలకు పట్టాలు లేకుండా పోయాయి. భూమిపై హక్కు లేక లీజు భూమిలో నిర్మించుకున్న కట్టడాలకు పట్టాలు ఇవ్వకపోవడంతో పేదలకు భూమిపై ఏ మాత్రం హక్కు లేకుండా పోతోంది. కంపెనీలో రెక్కలు, ముక్కలు చేసుకున్న కార్మికులకు స్థిరాస్తి గుంటెడు భూమి లేకుండా పోయింది. కట్టుకున్న ఇంటి స్థలంపై కూడా హక్కు లేకపోవడంతో ఎన్నో ప్రయోజనాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదు. రుణ సదుపాయానికి అర్హులు కాలేకపోతున్నారు. ఎన్నో ఏళ్లు నుంచి ఇక్కడే నివసిస్తున్న ఎలాంటి హక్కు లేక నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. చట్టబద్ధమైన హక్కు లేకపోయిన కొందరు మాత్రం భూ క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఎన్నికల హామీగా ఇళ్ల పట్టాల సమస్య ప్రతి ఎన్నికల్లో హామీగా ఉపయోగపడుతోంది. ఏ ఎన్నికలు వచ్చిన పురప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు హామీలు ఇవ్వడం, గెలిచాక విస్మరించడం పరిపాటిగా మారుతోంది. పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో దశాబ్దాల నుంచి హామీలు ఇస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, మణుగూరు, ఎల్లందు, కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సింగరేణి లీజు భూమిలో నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలను జారీ చేశారు. ఇందు కోసం ప్రత్యేక జీవోను తెచ్చారు. బెల్లంపల్లిలో మాత్రం ఆ సమస్య అపరిష్కతంగానే ఉండిపోయింది. మంచిర్యాల కొత్త జిల్లాలో రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడిన బెల్లంపల్లిలో ఇళ్ల పట్టాల సమస్య కొలిక్కి వస్తుందనే ఆశతో ప్రజలు ఉన్నారు. బెల్లంపల్లి : బి గ్రేడ్ మున్సిపాలిటీ మున్సిపల్ వార్డుల సంఖ్య : 34 జనాభా : 56,369 మున్సిపాలిటీలోని ఇళ్ల సంఖ్య : 15,250