వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్ | ysrcp mla y.visweswara reddy arrested for leading protest | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్

Nov 11 2016 6:11 PM | Updated on May 29 2018 2:55 PM

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్ - Sakshi

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అరెస్ట్

ఇళ్లపట్టాలు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతపురం : పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి శుక్రవారం అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలంటూ నిరసన చేపట్టారు. ఆయన సుమారు అయిదు గంటలు పాటు నిరసన చేసినా అధికారులు పట్టించుకోలేదు. దాంతో విశ్వేశ్వర్ రెడ్డి ఉరవకొండలో రాస్తారోకోకు దిగటంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, అక్కడ నుంచి తరలించారు. మరోవైపు ఎమ్మెల్యే అరెస్ట్ను పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement