breaking news
Hollywood TV show
-
హాసన్‌ని కాదు శ్రుతీని!
నటిగా ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు శ్రుతీహాసన్. ఈ సెలబ్రేషన్‌ను బుడాపెస్ట్‌లో (హంగేరీ దేశం) జరుపుకుంటున్నారు. ఇంతకీ. అక్కడేం చేస్తున్నారనుకుంటున్నారా? త్వరలోనే ఓ హాలీవుడ్ టీవీ సిరీస్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం కోసం శిక్షణ తీసుకుంటున్నారామె. కొత్త సిరీస్, పదేళ్ల ప్రయాణం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘ట్రెడ్‌స్టోన్’ అనే టీవీ సిరీస్ చేస్తున్నాను. ఈ సిరీస్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయి. అందుకే ప్రతీరోజు కఠినమైన శిక్షణలో పాల్గొంటున్నాను. స్క్రిప్ట్ విన్నప్పుడు యాక్షన్ సన్నివేశాలేగా.. పదేళ్లుగా సినిమాలు చేస్తున్నాం. అంత కష్టంగా ఉంటాయా? అనుకున్నాను. కానీ చాలా కష్టంగా ఉన్నాయి. నేను దీన్ని బాధగా చెప్పడంలేదు. కానీ వర్క్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. పదేళ్లయినా కూడా నేను పని చేస్తూనే ఉండాలని కోరుకున్నాను. నేను అనుకున్నట్లుగానే జరగడం ఆనందంగా ఉంది. అలాగే ప్రస్తుతం నెపోటిజమ్ (బంధు ప్రీతి) గురించి చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి. నా ఇంటి పేరే చిత్రపరిశ్రమలో నాకు తలుపు తెరిచిందని బాగా తెలుసు. ఆ పేరే లేకపోతే కష్టాలు పడాల్సి వచ్చేది. అందుకు నేను మావాళ్లకు కృతజ్ఞురాలిగానే ఉంటాను. అయితే నేను కేవలం హాసన్గానే ఉండిపోకుండా శ్రుతీగా నిలబడ్డాను. నాకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకోగలిగాను. అది అందరికీ తెలిసిందే’’ అని అన్నారు. -
పాక్ యువతి పాత్ర బాగుంది
లంచ్‌బాక్స్ సినిమా పుణ్యమాని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న పంజాబీ భామ నిమ్రత్ కౌర్ హాలీవుడ్ టీవీ షోలో అవకాశం సంపాదించుకుంది. హోమ్‌ల్యాండ్ షో నాలుగో భాగంలో ఈమె పాకిస్థాన్ యువతిగా కనిపిస్తుంది. విశేషమేమింటే నిమ్రత్ పూర్వీకులు పాక్‌లోని లాహోర్, రావల్పిండి వాసులు. కాబట్టి ఇలాంటి అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. నిమ్రత్ ఇందులో పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఏజెంట్‌గా నటిస్తోంది. రెండో ఆలోచన లేకుండానే ఇందులో నటించేందుకు ఒప్పుకున్నానంటూ నవ్వేసింది. ‘పాక్ యువతిగా కనిపించడం అద్భుతంగా అనిపిస్తుంది. భారత్, పాకిస్థాన్ సంస్కృతుల్లో సారూప్యత కనిపిస్తుంది. ఈ దాయాదులు ఆహారప్రియులే కాదు సరదాగానూ ఉంటారు. కొన్ని పరిస్థితుల వల్ల పాకిస్థాన్ సమస్యల్లో చిక్కుకుంది’ అని వివరించిన నిమ్రత్ ప్రస్తుతం దీని షూటింగ్ కోసం కేప్‌టౌన్‌లో ఉంది. హోమ్‌ల్యాండ్ షో షూటింగ్ అంతా విదేశాల్లో జరుగుతున్నా, ఏదో ఒక రోజు పాకిస్థాన్‌కు వెళ్తానన్న నమ్మకం ఉందని చెప్పింది. నిమ్రత్ ఇది వరకే లవ్ షవ్ టే చికెన్ ఖురానా, జర్నలిస్ట్ , పెడ్లర్స్ వంటి సినిమాలు/షోల్లో కనిపించింది. హోమ్‌ల్యాండ్ షో స్టార్ వరల్డ్ ప్రీమియర్ హెచ్డీ చానెల్లో అక్టోబర్ ఆరు నుంచి ప్రసారమవుతుంది. అయితే నిమ్రత్ ఇది వరకు ఎన్నడూ హోమ్‌ల్యాండ్ షో చూడలేదట. ‘ఈ షోను ఇది వరకే చూసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నాలుగో భాగం కొంత చూశాక మిగతా మూడింటి సీడీలు కావాలని అడిగాను. ఇప్పుడు తీరిక దొరికినప్పుడల్లా ఇదే షో చూస్తున్నాను’ అని వివరించింది. విదేశాల్లో ఎలా అనిపిస్తుందన్న ప్రశ్నకు బదులిస్తూ దక్షిణాఫ్రికాలో చలి, వర్షం ఎక్కువే అయినా, వాతావరణం అద్భుతంగా ఉంటుందని చెప్పింది. మరి భారతీయ సినిమాల సంగతి ఏమిటని అడిగితే.. త్వరలోనే ఒక సినిమా