హాసన్‌ని కాదు శ్రుతీని! | shruti haasan completes 10 years in film industry | Sakshi
Sakshi News home page

హాసన్‌ని కాదు శ్రుతీని!

Jul 28 2019 6:10 AM | Updated on Jul 28 2019 6:10 AM

shruti haasan completes 10 years in film industry - Sakshi

నటిగా ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు శ్రుతీహాసన్‌. ఈ సెలబ్రేషన్‌ను బుడాపెస్ట్‌లో (హంగేరీ దేశం) జరుపుకుంటున్నారు. ఇంతకీ. అక్కడేం చేస్తున్నారనుకుంటున్నారా? త్వరలోనే ఓ హాలీవుడ్‌ టీవీ సిరీస్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొనడం కోసం శిక్షణ తీసుకుంటున్నారామె. కొత్త సిరీస్, పదేళ్ల ప్రయాణం గురించి శ్రుతీహాసన్‌ మాట్లాడుతూ – ‘‘ట్రెడ్‌స్టోన్‌’ అనే టీవీ సిరీస్‌ చేస్తున్నాను. ఈ సిరీస్‌లో భారీ యాక్షన్‌ సన్నివేశాలున్నాయి. అందుకే ప్రతీరోజు కఠినమైన శిక్షణలో పాల్గొంటున్నాను.

స్క్రిప్ట్‌ విన్నప్పుడు యాక్షన్‌ సన్నివేశాలేగా.. పదేళ్లుగా సినిమాలు చేస్తున్నాం. అంత కష్టంగా ఉంటాయా? అనుకున్నాను. కానీ చాలా కష్టంగా ఉన్నాయి. నేను దీన్ని బాధగా చెప్పడంలేదు. కానీ వర్క్‌ని చాలా ఎంజాయ్‌ చేస్తున్నాను. పదేళ్లయినా కూడా నేను పని చేస్తూనే ఉండాలని కోరుకున్నాను. నేను అనుకున్నట్లుగానే జరగడం ఆనందంగా ఉంది. అలాగే ప్రస్తుతం నెపోటిజమ్‌ (బంధు ప్రీతి) గురించి చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి. నా ఇంటి పేరే చిత్రపరిశ్రమలో నాకు తలుపు తెరిచిందని బాగా తెలుసు. ఆ పేరే లేకపోతే కష్టాలు పడాల్సి వచ్చేది. అందుకు నేను మావాళ్లకు కృతజ్ఞురాలిగానే ఉంటాను. అయితే నేను కేవలం హాసన్‌గానే ఉండిపోకుండా శ్రుతీగా నిలబడ్డాను. నాకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకోగలిగాను. అది అందరికీ తెలిసిందే’’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement