breaking news
historical match
-
1-600: టీమిండియా టెస్టు ప్రయాణంలో విజయాలు ఎన్ని?
భారత టెస్టు క్రికెట్లో చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో ఏకంగా 165 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా తమ 600వ టెస్టును భారత్ భారీ గెలుపుతో చిరస్మరణీయం చేసుకుంది.బౌలర్ల విజృంభణకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంకకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం మొదలైన తొలి టెస్టు.. బుధవారం ఆఖరి రోజు ఆటతో ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ విధించిన 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక లంక చతికిలపడింది.భారత బౌలర్ల విజృంభణ కారణంగా లక్ష్య ఛేదనలో కేవలం 206 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ మొత్తంగా పది వికెట్లు కూల్చి లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేయగా.. సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.సెంచరీ హీరో పడిక్కల్భారత తొలి ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ శతకం (167) బాదాడు. ఫలితంగా టీమిండియా 462 పరుగులు చేయగలిగింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే చాపచుట్టేసినా.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని లంకకు 372 పరుగుల మేర భారీ టార్గెట్ నిర్దేశించగలిగింది.ఇదిలా ఉంటే.. 1932లో టీమిండియా తన టెస్టు ప్రయాణం మొదలుపెట్టింది. మొట్టమొదట ఇంగ్లండ్‌తో ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మ్యాచ్ ఆడింది. ప్రస్తుతం 600 మైలురాయికి చేరుకుంది. మరి ఈ టీమిండియా ప్రయాణంలో వర్షం లేదా ఇతర కారణాల వల్ల రద్దైన మ్యాచ్‌లు పోనూ మొత్తం గెలుపులు, ఓటములు ఎన్నో తెలుసా?.. ప్రతి వంద మ్యాచ్‌ల మధ్య భారత జట్టు జర్నీ ఎలా సాగిందంటే..1-600 జర్నీ సాగిందిలా..1-100: 10 విజయాలు, 40 ఓటములు, 50 డ్రా101-200: 25 విజయాలు, 32 ఓటములు, 43 డ్రా201-300: 21 విజయాలు, 26 ఓటములు, ఒకటి టై, 52 డ్రా301-400: 32 విజయాలు, 31 ఓటములు, 37 డ్రా401-500: 42 విజయాలు, 28 ఓటములు. 30 డ్రా501-600: 57 విజయాలు, 31 ఓటములు, 2 డ్రా.మొత్తం: 187 విజయాలు, 188 ఓటములు, 1 టై, 214 డ్రా.చదవండి: నిన్ను ఐపీఎల్‌కు తీసుకెళ్తా: జైస్వాల్ -
ఒక మ్యాచ్.. పది హాఫ్ సెంచరీలు
కాన్పూర్: భారత క్రికెట్ జట్టు ఆడిన 500వ చారిత్రక మ్యాచ్ లో అరుదైన చరిత్ర లిఖించబడింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్యజరిగిన తొలి టెస్టులో పది హాఫ్ సెంచరీలు నమోదు కావడం సరికొత్త రికార్డుకు దోహదం చేసింది. ఒక మ్యాచ్‌లో కనీసం ఒక్క సెంచరీ కూడా లేకుండా పది హాఫ్ సెంచరీలు నమోదు కావడం టెస్టు చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. ఈ మ్యాచ్ భారత తొలి ఇన్నింగ్స్‌లో మురళీ విజయ(65), చటేశ్వర పూజారా(62)లు హాఫ్ సెంచరీలు చేయగా, న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో లాథమ్(58), విలియమ్సన్(75)లు అర్థ శతకాలు నమోదు చేశారు. కాగా, ఇరు జట్ల రెండో ఇన్నింగ్స్ లో మురళీ విజయ్(76),పూజారా(78), రోహిత్ శర్మ(68 నాటౌట్), రవీంద్ర జడేజా(50 నాటౌట్), ల్యూక్ రోంచీ(80), సాంట్నార్(71)లు హాఫ్ సెంచరీలు సాధించారు. దాంతో మొత్తం సెంచరీ లేకుండా పది హాఫ్ సెంచరీలు నమోదు కావడం కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ మ్యాచ్‌లోభారత్ 197 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన తెలిసిందే. తన టెస్టు కెరీర్లో 500వ మ్యాచ్ ఆడిన భారత్ చారిత్రక గెలుపును సొంతం చేసుకుంది. చివరి రోజు ఆటలో అశ్విన్, షమీలు విజృంభించడంతో కివీస్ ఘోర పరాజయం చవిచూసింది. మ్యాచ్ విశేషాలు.. భారత్ లో జరిగిన టెస్టు మ్యాచ్ ల్లో ఒక న్యూజిలాండ్ ఆటగాడు ఐదు వికెట్లు, 50కు పైగా పరుగులు చేయడం 1988 తరువాత ఇదే తొలిసారి. సాంట్నార్ ఈ ఘనతను సాధించాడు. అంతకుముందు 1988-89 సీజన్లో జాన్ బ్రాస్ వెల్ ఐదు వికెట్లు, 50కి పైగా పరుగుల ఘనతను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చివరి ఐదు వికెట్లను ఏడు పరుగుల వ్యవధిలో కోల్పోవడం ఆ జట్టుకు రెండో అత్యల్పం. 1992-93 సీజన్లో న్యూజిలాండ్ చివరిసారి ఐదు పరుగులకు ఐదు వికెట్లను నష్టపోయింది. తన కెరీర్ లో రెండో టెస్టు ఆడుతున్న ల్యూక్ రోంచీ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో రోంచీ హాఫ్ సెంచరీ చేయగా, అంతకుముందు అరంగేట్రం మ్యాచ్‌లో అర్థ శతకం నమోదు చేశాడు.


