గ్యాంబ్లింగ్ ఆడుతున్న 13మంది అరెస్టు
అనంతపురం(హిందూపురం): మొబైల్ గ్యాంబ్లింగ్ ఆడుతున్న 13 మందిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హిందూపురం రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని కుడికొండ చెక్‌పోస్టు దగ్గర నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వీరి నుంచి రూ. 6. లక్షల నగదు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ హిందూపురం, కర్నాటకకు చెందిన వారని పోలీసులు తెలిపారు. వీళ్లు వాహనాల్లో సంచరిస్తూనే గ్యాబ్లింగ్ ఆడుతున్నారని డీఎస్పీ సుబ్బారావు వెల్లడించారు.