breaking news
high-rise building
-
బాల్కనీకి వేలాడింది..
అది చైనాలోని ఒక నగరం. అందులో ఓ హై–రైజ్ అపార్ట్మెంట్లోని 10వ అంతస్తు.. అకస్మాత్తుగా ఓ మహిళ బాల్కనీ నుంచి వేలాడటం కనిపించింది. అది చూసినవారంతా హడలిపోయారు. చెమటలు పట్టించిన ఈ దృశ్యం వెనుక కథ తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఒక వ్యక్తి భార్య లేని సమయంలో.. అతని ఇంటికి ప్రియురాలు వెళ్లింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో.. భార్య హఠాత్తుగా ఇంటికి తిరిగి వచ్చేసింది. దీంతో భయపడిన ఆ వ్యక్తి.. తన ప్రియురాలిని దాచిపెట్టే ప్రయత్నంలో ఆమెను బాల్కనీలోకి నెట్టేశాడు. పది అంతస్తుల ఎత్తులో ఆ మహిళ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వేలాడటం మొదలుపెట్టింది. అది చుట్టుపక్కల వారు గమనించారు, పట్టు కోల్పోకుండా నిలబడటానికి ఆమె విఫలయత్నం చేసింది. ఇది గమనించిన వారు అరుపులతో, ఆందోళనతో గంటల తరబడి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంట్లో ప్రియుడు.. బయట ప్రియురాలు ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో, ఫ్లాట్ లోపల ఉన్న ప్రియుడు.. కిటికీలోంచి ప్రియురాలితో ఏదో మాట్లాడటం కనిపించింది. ఇంతకీ ఆమె వేలాడటానికి కారణం ఏంటంటే... ఆ మహిళ ప్రియుడి భార్యకు దొరక్కుండా దాక్కోవడానికి ప్రయతి్నంచడమే.. తన భార్య రాగానే ప్రియుడు ఆ మహిళను హడావిడిగా బాల్కనీ వైపు నెట్టేశాడని, దాక్కోవాలని సూచించాడని స్థానిక మీడియా పేర్కొంది. పరువు పోతుందనే భయం.. ఆమెను చావు అంచుల్లోకి నెట్టింది. ప్రాణభయంతో వణికిపోతున్న ఆ మహిళ చేతిలో ఫోన్ పట్టుకునే ఉంది. ఏం చేయాలో తోచక, చివరికి బలం తెచ్చుకుని.. డ్రైన్పైప్లను, కిటికీ అంచులను పట్టుకుని ధైర్యంగా కిందకు దిగడం ప్రారంభించింది. పక్కింట్లో ఆపద్బంధువు!భవనం పక్క గోడకు వేలాడుతూ, అతి కష్టం మీద ఓ వాటర్ పైప్ పట్టుకుని పక్క ఫ్లాట్ కిటికీ వైపు ఆమె జారింది. పక్క ఫ్లాట్ యజమాని కిటికీ తట్టగా.. చివరకు ఆ ఆపద్బాంధవుడు ఆమెను లోపలికి సురక్షితంగా లాగాడు. ఎట్టకేలకు ప్రాణాలను దక్కించుకున్నా.. ఈ సంఘటన మాత్రం ఆమె పరువును, ప్రియుడి పరువును నిలువునా బజారున పడేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పన్ను ఎవరు కట్టాలి?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతుంది. మెరుగైన మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి కారణంగా కొత్త ప్రాంతాలలో అభివృద్ధి పరుగులు పెడుతుంది. మరోవైపు ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా గృహ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత ఇళ్లను కూలి్చవేసి వాటి స్థానంలో కొత్తవి నిర్మించడం మినహా నిర్మాణదారులకు ప్రత్యామ్నాయం లేదు. ఖైరతాబాద్, అబిడ్స్, బేగంపేట, సనత్‌నగర్, ఈఎస్ఐ, బంజారాహిల్స్ వంటి ప్రాంతాలలో ఇలాంటి రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్‌లు, నాలుగైదు అంతస్తుల అపార్ట్మెంట్లను కూల్చేసి ఆ స్థలంలో హైరైజ్ భవనాలను నిర్మిస్తున్నారు. ఇందుకోసం భూ యజమానులు, ఫ్లాట్ ఓనర్లతో బిల్డర్లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఖాళీ స్థలాలను అభివృద్ధికి తీసుకుంటే 50 నుంచి 40 శాతం, ప్రాంతాన్ని బట్టి 60 శాతం ఫ్లాట్లను భూ యజమానికి ఇస్తామని ఒప్పందం చేసుకుంటారు. మిగిలిన వాటినే డెవలపర్ అమ్ముకుంటాడు. కూల్చి కట్టినా, ఖాళీ ప్రదేశంలో కొత్త భవనాలు కట్టినా పూర్తయిన ఇళ్లకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. భూ యజమాని వాటా కింద వచ్చిన జీఎస్టీ ఎవరు చెల్లించాలనే అంశంపై ల్యాండ్ ఓనర్లకు, బిల్డర్లు మధ్య వాగ్వాదం నెలకొంటుంది. డెవలపరే చెల్లించాలని భూ యజమాని, ల్యాండ్ ఓనరే కట్టాలని బిల్డర్ల మధ్య సందిగ్ధం నెలకొంది. భవనం కట్టడంతో స్థలం విలువ పెరిగిందని, దీంతో 5 శాతం జీఎస్టీ చెల్లించాలని ప్రభుత్వం బిల్డర్‌కు నోటీసులు పంపిస్తుంది. వాస్తవానికి కొత్తవైనా, పాతవైనా భవనానికి జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యత బిల్డర్‌దే. కాకపోతే భూ యజమాని, కస్టమర్ల నుంచి బిల్డర్ జీఎస్టీ వసూలు చేసి కట్టాల్సింది డెవలపరే. -
భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
-
భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: మియాపూర్‌లోని జనప్రియ ఫోర్త్ ఫేస్ బ్లాక్ బి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్లకు చెందిన జగదీశ్(26)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


