breaking news
Hero adi
-
అంతర్వేది స్వామివారి సన్నిధిలో హీరో ఆది..
సాక్షి, సఖినేటిపల్లి: ప్రముఖ సినీనటుడు సాయికుమార్, ఆయన తనయుడు హీరో ఆది కుటుంబ సమేతంగా అంతర్వేది శ్రీలక్ష్మి నరసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో సాయికుమార్ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
చాగల్లులో ‘చుట్టాలబ్బాయి’
చాగల్లు: చాగల్లు రైల్వేస్టేషన్ సమీపంలోని పంట పొలాల్లో బుధవారం సినీ షూటింగ్ సందడి చేసింది. ఎస్ఆర్టీ మూవీస్, ఐశ్వర్య లక్ష్మి మూవీస్ సంయుక్తంగా నిర్మాతలు రామ్, వెంకట్లు నిర్మిస్తున్న ‘చుట్టాలబ్బాయి’ చిత్రంలోని పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. హీరో ఆది, హీరోయిన్ నమితా ప్రమోద్ (తొలిపరిచయం)ల మధ్య పలు ఆసక్తికర సన్నివేశాలను తెరకెక్కించారు. అహనా పెళ్లంట, పూలరంగడు చిత్రాలకు దర్శకుడిగా పనిచేసిన వీరభద్రం ఈ చిత్రానికీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 20వ తేదీ వరకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని దర్శకుడు వీరభద్రం తెలిపారు. పల్లెటూరి బ్యాక్డ్రాప్లో ప్రేమకథ చిత్రంగా తెరకెక్కిస్తున్నామన్నారు. రఘుబాబు, సాయికుమార్, ఫృధ్వి, జీవా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారని, సంగీతం ఎస్ఎస్ థమన్ సమకూరుస్తున్నారని చెప్పారు.