breaking news
Heavy property damage
-
ఐదు జిల్లాల్లో భారీ నష్టం !
సాక్షి, హైదరాబాద్, బూర్గంపాడు: భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయని జాతీయ విపత్తుల నివారణ సంస్థ(ఎన్డీఎంఏ) సలహాదారుడు కునాల్ సత్యార్థి వెల్లడించారు. వరి, పత్తి పంటలు పూర్తిగా ధ్వంసమైనట్టు తమ పరిశీలినలో తేలిందన్నారు. ప్రధానంగా మోరంచపల్లి, కొండాయి గ్రామాలు పూర్తిగా నీటమునగడంతో భారీ ఆస్తి నష్టం కలిగిందన్నారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కునాల్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కేంద్ర బృందం ఈ నెల 1 నుంచి 3 వరకు వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించింది. అనంతరం గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో సమావేశమై తమ పరిశీలనకు వచ్చిన విషయాలను వివరించింది. విపత్తుల నివారణకు కేంద్ర బృందం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని శాంతి కుమారి తెలిపారు. కేంద్రానికి సమగ్ర నివేదిక అందిస్తాం గురువారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం మండలాల్లో నష్టపోయిన పంటలను, ముంపు ప్రాంత ప్రజల ఇబ్బందులను కేంద్ర బృందం పరిశీలించింది. కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల దెబ్బతిన్న పంటలు, రహదారుల వివరాలను బృందం స భ్యులకు వివరించారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ.. పంట, రహదారుల నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే అన్న బీజేపీ నేతలు వాతావరణశాఖ నుంచి ముందస్తు హెచ్చరికలు జారీ అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం తగిన వేగంతో స్పందించకపోవడంతోనే తీవ్రనష్టం వాటిల్లిందని కేంద్ర వరద పరిశీలక బృందం దృష్టికి బీజేపీ ప్రతినిధి బృందం తీసుకొచ్చింది. భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం మునిగిపోవడం వెనక రాష్ట్ర ప్రభుత్వ సమన్వయలేమి స్పష్టమైన ఉదాహరణగాకనిపిస్తోందని పేర్కొంది. గురువారం ఈ మేరకు కేంద్ర హోంశాఖ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు (పీపీ) కునాల్ సత్యార్థికి బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, పార్టీనేత అశ్వథ్థామరెడ్డి వినతిపత్రం సమర్పించారు. కేంద్రం నుంచి తగిన సహాయం అందేలా చూడాలని కోరారు. -
గాలివాన బీభత్సం
♦ నాగర్‌కర్నూలు నియోజకవర్గంలో కురిసిన వర్షం ♦ కూలిన చెట్లు, ఒరిగిన స్తంభాలు, దెబ్బతిన్నతోటలు నాగర్‌కర్నూలు రూరల్/బిజినేపల్లి/వంగూరు : నియోజకవర్గంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షం రైతులకు అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. నాగర్‌కర్నూలు మండలం అంతటి, పులిజాల, మల్కాపూర్, మంతటి గ్రామాలతోపాటు పట్టణంలో గంటకుపైగా గాలితో కూడిన వర్షం కురిసింది. గగ్గలపల్లిలో పాత ఇళ్లు, రేకుల ఇళ్లు కూలిపోయాయి. అలాగే రహదారివెంట ఉన్నచెట్లు, స్తంభాలు కూలిపడ్డాయి. అదేవిధంగా బిజినేపల్లి మండలంలో కురిసిన గాలీవాన బీభత్సానికి భారీగా ఆస్తినష్టం జరిగింది. మండల కేంద్రంలో పెద్ద ఎత్తున వీచిన ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రేకుల షెడ్లు ఎగిరిపోగా, మండల కేంద్రంలోని గోవుల చంద్రయ్యకు చెందిన ఇంటి రేకులు లేచిపోయి ఇంట్లో ఉన్నవారికి గాయాలయ్యాయి. పాలెం పారిశ్రామిక వాడ వద్ద విద్యుత్‌తీగలు తెగిపడడి గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా నిరీక్షించారు. పోలేపల్లి, ఖానాపూర్, గుడ్లనర్వ తదితర గ్రామాల్లో విద్యుత్ తీగలు తెగిపోయి అంధకారం నెలకొంది. అలాగే వంగూరు మండలంలో కురిసిన వడగండ్ల వర్షానికి మామిడి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. చిరుజల్లులతో ఊరట పాలమూరు : పగలంతా ఎండవేడిమి ఉండగా గురువారం సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం కొంత ఊరట చెందారు. జిల్లా కేంద్రంతో సాయంత్ర ంవేళ కురిసిన చిరుజల్లులతో ఎండతాపం తగ్గి చల్లని గాలులు వీచాయి. జిల్లా కేంద్రంలోనే కాకుండా జడ్చర్ల, కొత్తకోట, దేవరకద్ర, వనపర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల పరిధిలో పలుచోట్ల గాలులతో కూడిన చిరుజల్లులు కురిసి వాతావరణం కొంతమేర చల్లబడింది. వెల్దండ మండల పరిధిలోని బండోనిపల్లి గ్రామంలో అలిట్టి చెన్నయ్య అనే రైతుకు చెందిన పాడిఆవును పొలంలో కట్టేసి ఉంచగా పిడుగు పాటుకు మృతి చెందింది. అదేవిధంగా ఆయా గ్రామాల్లో విద్యుత్‌స్తంభాలు కూలిపోయి అంధకారం నెలకొంది.