breaking news
hate remarks
-
మమతా బెనర్జీపై సిలిగురిలో కేసు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సిలిగురిలో కేసు నమోదైంది. తన వ్యాఖ్యలతో ఒక మతానికి చెందిన మనోభావాలను దెబ్బతీశారంటూ న్యాయవాది రింకీ చటోపాధ్యాయ్ సింగ్ ఫిర్యాదు ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేసినట్లు సిలిగురి పోలీసులు బుధవారం తెలిపారు. 2025లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ధర్మతలా నిరసనలో రాజ్యాంగ విరుద్ధమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మమతా బెనర్జీ.. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది సనాతన హిందువుల మనోభావాలను, నమ్మకాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆమె ఆరోపించారు. మొదట పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారని, పదేపదే కోరిన తరువాత ఫిర్యాదును స్వీకరించారని తెలిపారు. తాను తలుచుకుంటే ఒక నిర్దిష్ట వర్గాన్ని ఐదు నిమిషాల్లోనే తుదముట్టించగలదని ఆమె వ్యాఖ్యానించారని, అప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు సరైనది కాదని ఆమె ఆరోపించారు. -
ఆఫ్ ద రికార్డ్ గా అంటే...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు సోనియా, రాహుల్ ను బాధపెట్టివుంటే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. సోనియా గాంధీని కాకుండా రాజీవ్ గాంధీ నైజీరియా మహిళను వివాహం చేసుకునివుంటే.. నలుపు రంగు మహిళ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అంగీకరించేదా? అని గిరిరాజ్ సింగ్ అన్నారు. అయితే తాను ఆఫ్ ద రికార్డ్ గా అన్నమాటలపై వివాదం చేయడం తగదని ఆయన అన్నారు. గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలు దురదృష్టకరమని నైజీరియా రాయబారి పేర్కొన్నారు.


