మమతా బెనర్జీపై సిలిగురిలో కేసు | FIR Filed Against Mamata Banerjee Over Alleged Hate Remarks | Sakshi
Sakshi News home page

మమతా బెనర్జీపై సిలిగురిలో కేసు

May 28 2026 1:18 AM | Updated on May 28 2026 1:18 AM

FIR Filed Against Mamata Banerjee Over Alleged Hate Remarks

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సిలిగురిలో కేసు నమోదైంది. తన వ్యాఖ్యలతో ఒక మతానికి చెందిన మనోభావాలను దెబ్బతీశారంటూ న్యాయవాది రింకీ చటోపాధ్యాయ్‌ సింగ్‌ ఫిర్యాదు ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేసినట్లు సిలిగురి పోలీసులు బుధవారం తెలిపారు. 

2025లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ధర్మతలా నిరసనలో రాజ్యాంగ విరుద్ధమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మమతా బెనర్జీ.. దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది సనాతన హిందువుల మనోభావాలను, నమ్మకాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆమె ఆరోపించారు. 

మొదట పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారని, పదేపదే కోరిన తరువాత ఫిర్యాదును స్వీకరించారని తెలిపారు. తాను తలుచుకుంటే ఒక నిర్దిష్ట వర్గాన్ని ఐదు నిమిషాల్లోనే తుదముట్టించగలదని ఆమె వ్యాఖ్యానించారని, అప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు సరైనది కాదని ఆమె ఆరోపించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement