breaking news
Harsha Bhargavi
-
ఢిల్లీలో రేవంత్ ఇంట్లోకి మహిళా అధికారికి నో ఎంట్రీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని శనివారం ఆయన నివాసంలో కలిసేందుకు వచ్చిన ఓ మహిళా అధికారికి చేదు అనుభవం ఎదురైంది. ఐ అండ్ పీఆర్ ఢిల్లీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన హర్ష భార్గవి ఇటీవల తెలంగాణ సీపీఆర్వోగా బాధ్యతలు చేపట్టారు. సీఎం ఢిల్లీ రావడంతో మర్యాదపూర్వకంగా ఆయన్ను కలిసేందుకు సీఎం నివాసానికి చేరుకున్నారు. కానీ అక్కడి భద్రతా సిబ్బంది ఐడీ కార్డు చూపించినా ఆమెను లోపలకు పంపేందుకు నిరాకరించారు. ‘మీరెవరో తెలియదు. ఇక్కడ ఉండటానికి వీల్లేదు’ అన్నారు. దీంతో ఆమె వెనుదిరిగేందుకు సిద్ధమై క్యాబ్ కోసం నిరీక్షిస్తుండగా ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అక్కడున్న మీడియా సిబ్బంది గమనించడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఐ అండ్ పీఆర్ ఉన్నతాధికారులకు ఆమె ఫోన్లో వివరించి కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో వారు ఈ విషయాన్ని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై విచారణ చేపడతానని శశాంక్ గోయల్ ‘సాక్షి’కి చెప్పారు. -
Delhi: సీఎం రేవంత్ నివాసంలోకి అధికారిణికి అనుమతి నిరాకరణ
ఢిల్లీ: హర్ష భార్గవి.. తెలంగాణ ప్రభుత్వ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ(I&PR)లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఇటీవల న్యూఢిల్లీకి బదిలీ అయి, రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO)గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమెకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు(శనివారం, అక్టోబర్ 25వ తేదీ) ఢిల్లీలోని సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లారు. అయితే అక్కడ పోలీస్ సిబ్బంది ఆమెను గేట్ వద్దే నిలిపేశారు. ఆమెను సీఎం నివాసం లోపలికి వెళ్లేందుకు అనుమంతిచలేదు. ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా తనను పరిచయం చేసినప్పటికీ, పర్మిషన్ ఇవ్వలేదు. ఆమె ప్రశ్నించగా, అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు. దాంతో ఆమె కంటతడి పెట్టుకున్నారు. ఇదీ చదవండి:ఓటర్ల జాబితాపై సమీక్ష.. తెలంగాణలో SIR


