Delhi: సీఎం రేవంత్‌ నివాసంలోకి అధికారిణికి అనుమతి నిరాకరణ | I And PR officer alleges police threat outside CM Revanths Delhi house | Sakshi
Sakshi News home page

Delhi: సీఎం రేవంత్‌ నివాసంలోకి అధికారిణికి అనుమతి నిరాకరణ

Oct 25 2025 7:12 PM | Updated on Oct 25 2025 7:44 PM

I And PR officer alleges police threat outside CM Revanths Delhi house

ఢిల్లీ:  హర్ష భార్గవి.. తెలంగాణ ప్రభుత్వ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ(I&PR)లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఇటీవల న్యూఢిల్లీకి బదిలీ అయి, రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO)గా బాధ్యతలు చేపట్టారు. అయితే  ఆమెకు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. 

ఈరోజు(శనివారం, అక్టోబర్‌ 25వ తేదీ) ఢిల్లీలోని సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లారు. అయితే అక్కడ పోలీస్‌ సిబ్బంది ఆమెను గేట్‌ వద్దే నిలిపేశారు. ఆమెను సీఎం నివాసం లోపలికి వెళ్లేందుకు అనుమంతిచలేదు. ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా తనను పరిచయం చేసినప్పటికీ, పర్మిషన్‌ ఇవ్వలేదు. ఆమె ప్రశ్నించగా, అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు.  దాంతో ఆమె కంటతడి పెట్టుకున్నారు. 

ఇదీ చదవండి:

ఓటర్ల జాబితాపై సమీక్ష.. తెలంగాణలో SIR

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement