breaking news
hanmanth
-
మనుమరాలి పుట్టిన రోజునాడే.. ఇలా..
మెదక్: మనవరాలు పుట్టిన రోజుకు వచ్చిన ఒక తాత రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన పాపన్నపేట శివారులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.. మిన్పూర్ గ్రామానికి చెందిన హన్మంతు రాములు(50) హైద్రాబాద్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మనవరాలు పుట్టిన రోజు వేడుక కోసం రెండు రోజుల క్రితం మిన్పూర్కు వచ్చాడు. గ్రామానికి చెందిన జంగం కిషన్‌తో కలసి టీవీఎస్ మోపెడ్‌పై పాపన్నపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా వాకింగ్ చేస్తున్న లక్ష్మణ్‌ను ఢీ కొట్టడంతో హన్మంతు, లక్ష్మణ్ గాయపడ్డారు. వారిని పాపన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుండి మెదక్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హన్మంతు రాములు మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపారు. -
హన్మంతు సంచలన బౌలింగ్
ఎ- డివిజన్ వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: కె. హన్మంతు (6/6) సంచలన బౌలింగ్‌తో గన్‌రాక్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. దీంతో ఎ- డివిజన్ వన్డే లీగ్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో యంగ్ సిటిజన్ జట్టు 9 వికెట్ల తేడాతో గన్‌రాక్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గన్‌రాక్ 17.4 ఓవర్లలో 64 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం యంగ్ సిటిజన్ బ్యాట్స్‌మెన్ 8.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 65 పరుగులు చేసి గెలిచింది. మరో మ్యాచ్‌లో భారతీయ సీసీ బౌలర్ అశోక్ కుమార్ (5/45) రాణించడంతో ఆ జట్టు యూత్ సీసీపై 6 వికెట్ల తేడాతో గెలిచింది. యూత్ సీసీ జట్టు 36.3 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం భారతీయ సీసీ 24.4 ఓవర్లలోనే 4 వికెట్లకు 177 పరుగులు చేసి గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు టీమ్ కున్: 150/9 (సహస్ర 89; పవన్ 4/32); విక్టరీ సీసీ: 153/6 (సయ్యద్ 41, బోర్డే 34; అనిరుధ్ 3/51). ఎలెవన్ మాస్టర్స్: 130 (అల్తాఫ్ 30, సలీమ్ 53; విజయ్ 6/20); కాకతీయ: 131/5. యాదవ్ డెయిరీ: 248/4 (సాకేత్ 54, ఇల్యాన్ 77); ఎల్‌ఎన్‌సీసీ: 249/7 (విఘ్నేశ్ రెడ్డి 103 నాటౌట్, ప్రతాప్ గౌడ్ 33; సాహిల్ 3/67, ప్రణవ్ 3/76). అంబర్పేట్ సీసీ: 282/9 (జితేందర్ 50, కృష్ణకాంత్ 30, శ్రీకాంత్ 54; వరుణ్ 4/50); ఎంపీ బ్లూస్: 198 (రాజు 53, ఉదయ్ గౌడ్ 42; భరత్3/38, జితేందర్ 3/27). పికెట్ సీసీ:158 (శాశ్వత్ 39; రాహుల్ 5/35); శాంతి ఎలెవన్: 108 (సందీప్ గౌడ్ 5/25). ఎంపీ స్పోర్టింగ్: 177 (వీరేన్ 34, కిరణ్ 37;పాషా 3/2); రుషిరాజ్: 81 (గోపి 4/17). ఏకలవ్య: 101 (కిరణ్ 4/10); మయూర్ సీసీ: 105/3 (శ్రీకాంత్ 30, గోవర్ధన్ 33 నాటౌట్). సన్‌షైన్ సీసీ: 138 (నిషద్ 45, నీల్ వ్యాస 3/25, రయీఫ్ 3/ 27, కపిల్ 3/20); సట్టన్ సీసీ: 139/8 (కపిల్ 38; అభీక్ 3/29). ఎస్కే బ్లూస్: 226/8 (ప్రదీప్ 45; రాఘవేందర్ 3/61); అమీర్‌పేట్ సీసీ: 226/9 (ఆశిష్ 62; అశ్విన్ 3/35). రెడ్ హిల్స్: 232 (హీరేన్ సోలంకి 90; దుర్గేశ్ 3/35, మాజిద్ 4/31); ఆడమ్స్ ఎలెవన్: 163 (దుర్గేశ్ 45;హీరేన్ 3/8, అబ్రార్ 3/ 42). తారకరామ: 339/7 (విక్రమ్ 67, అభినవ్ 56, కిరణ్ 92; సురేశ్ 4/87); స్టార్లెట్స్: 42 (నవీన్ 5/15). హెచ్‌సీఎస్: 141 (రిషిక్ రెడ్డి 33; హర్ష్ 3/35, రుత్విక్ యాదవ్ 3/14); సఫిల్‌గూడ: 141 (జయవర్ధన్ 75; పవన్ సాయి 3/42). కాస్మోస్: 141 (వరుణ్ కుమార్ 4/19; విష్ణు 4/28); నటరాజ్ సీసీ: 97 (కరణ్ 4/22). లాల్‌బహదూర్: 197 (రజా 43; అభిషేక్ 3/46, భరత్ రెడ్డి 4/49); సెయింట్ సాయి: 153 (జితేశ్ రెడ్డి 61, పరమేశ్వర్ 4/30). హెచ్‌సీఏ అకాడమీ: 319 (సిరి రెడ్డి 46, ఎస్. రెడ్డి 85, శివ ప్రసాద్ 62; రాహుల్ 3/62); కన్సల్టెంట్ సీసీ: 167/9 (భరత్ 33, జై 67; ఎస్కే రెడ్డి 3/35).