breaking news
hammond
-
ఫేస్బుక్లో పోస్టు.. మూడు కోట్లు జరిమానా
న్యూయార్క్: తన పాత స్నేహితుడే తన తనయుడిని చంపాడంటూ ఆరోపిస్తూ ఫేస్బుక్లో పోస్టు పెట్టిన మహిళకు మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల జరిమానా విధిస్తూ నార్త్ కరోలినాలోని ఓ కోర్టు తీర్పు చెప్పింది. యాష్విల్లేకు చెందిన జాక్వెలిన్ హమ్మన్డ్ అనే మహిళ 2015లో మద్యం సేవించి తన తనయుడిని చంపలేదని ఫేస్బుక్లో పోస్టు చేసింది. తన పాత స్నేహితుడు డైల్ తన కొడుకుని హతమార్చాడని ఆరోపించింది. కాగా, దీనిపై డైల్ కోర్టులో పరువునష్టం దావా వేశాడు. ఈ కేసును అప్పటి నుంచి విచారిస్తున్న కోర్టు హమ్మన్డ్కు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. హమ్మన్డ్ తనపై చేసిన ఆరోపణల్లో నిజంలేదని డైల్ చెప్పారు. హమ్మన్డ్ చేసిన ఆరోపణలు తనను తీవ్రంగా కలిచివేశాయని తెలిపారు. ఇతరులపై అనవసరంగా ఆరోపణలు చేసేవారికి ఈ కేసు తీర్పు ఓ గుణపాఠమని కేసును వాదించిన లాయర్ అన్నారు. -
కిటికీ అద్దంతో సౌరశక్తి
ఫొటో చూశారుగా... ఈయ న పేరు డాక్టర్ హామండ్. న్యూ ఎనర్జీ టెక్నాలజీస్ అనే కంపెనీ శాస్త్రవేత్త. ఈయన చేతిలో ఉన్నది... సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చేయగల సోలార్ ప్యానెల్. అదేమిటి? రంగు అద్దం మాదిరిగా ఉంది కదా.. అంటున్నారా? నిజమే. కాకపోతే ఆ రంగునిచ్చేది సూర్యుడి శక్తిని తనలో దాచుకోగల పదార్థం. ఈ పదార్థాన్ని గాజుపై స్ప్రే చేయడం ద్వారా సోలార్ ప్యానెల్స్ తయారవుతాయన్నమాట. అంతేకాదు... పారదర్శకంగా ఉంటూ సూర్యుడి వెలుగును లోపలికి ప్రసరింపజేయగల ఈ కిటికీ... గది లోపల రాత్రిపూట వెలిగే దీపాల వెలుగుతోనూ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. కావాల్సిన రంగులోనూ తయారు చేసుకోవచ్చు.