breaking news
hajji
-
హజ్ యాత్ర మృతుల్లో భారతీయుల లెక్క ఇది
రియాద్: సౌదీ అరేబియాలోని హజ్ యాత్ర ఈసారి విషాదాంతంగా మారుతోంది. మునుపెన్నడూ లేనంతగా ఉష్ణోగ్రత నమోదు కావడం.. దీనికి తోడు ఇతరత్ర సమస్యలతో యాత్రికులు చనిపోయారు. ఆ మృతుల సంఖ్య 600పైనే ఉందని సౌదీ హజ్ నిర్వాహకులు తాజాగా ప్రకటించారు. ఇందులో 50కి పైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం. ఈసారి దాదాపు 600 మందికి పైగా యాత్రికులు మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో అనేక దేశాలకు చెందినవారు ఉన్నారు. ఈజిప్టుకు చెందినవారే 300కు పైగా ఉన్నట్లు అంచనా. హజ్ యాత్రలో మరణించిన భారతీయుల సంఖ్య 68గా ఉందని సౌదీ దౌత్య విభాగం ప్రకటించింది.‘‘మరణించిన వాళ్లలో 68 మంది భారతీయులు ఉన్నారు. వీళ్లలో కొందరు సహజంగా.. వృద్ధాప్యరిత్యా సమస్యలతో మరణించారు. మరికొందరు ప్రతికూల వాతావరణంగా చనిపోయారు. తప్పి పోయినవాళ్ల వివరాలు తెలియాల్సి ఉంది’’ అని ప్రకటించింది.ఇక ఎడారి నగరమైన మక్కాలో ఉష్ణోగ్రతలు తారా స్దాయికి చేరుతున్నాయి. సౌదీ ప్రభుత్వం ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా.. తీవ్ర ఎండలు, ఉక్కబోత వాతావరణమే అందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. హజ్ యాత్ర చేసే వారిలో వృద్ధులు, మధ్య వయస్సు వారు ఎక్కువ మంది ఉంటుంటారు. వీరంతా ఎండ ధాటికి తట్టుకోలేక చనిపోతున్నారు. అయితే ఇది ప్రతీ ఏడాది సర్వసాధారణంగానే జరుగుతుందని.. ఈ ఏడాది అది మరింత ఎక్కువ ఉందని చెప్పలేమని ఓ దౌత్యాధికారి అంటున్నారు. ఏటా బక్రీద్ మాసంలో జరిగే ఈ యాత్రకు వివిధ దేశాల నుంచి లక్షల సంఖ్యలో యాత్రికులు తరలివస్తుంటారు. ఈసారి యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు వెల్లడించారు. భారత్ నుంచి కూడా ప్రతీ ఏటా భారీ సంఖ్యలో హజ్ యాత్రకు వెళ్తుంటారు.హజ్ యాత్రకు వెళ్లి మృత్యువాత పడిన సంఖ్యను 645గా ప్రకటించారు. వీళ్లలో 323 మంది వరకూ ఈజిప్షియన్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా అధిక ఉష్ణోగ్రతవల్లే చనిపోయినట్లు తెలుస్తోంది. అలాగే 60 మంది వరకూ జోర్డాన్ వాసులు మరణించారని దౌత్యవేత్తలు తెలిపారు. ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యూనీషియాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కూడా మృతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సౌదీ ప్రభుత్వం వర్చువల్ ఆస్పత్రులను ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తోంది. -
అప్రమత్తమైన సౌదీ అరేబియా సర్కారు
-
అప్రమత్తమైన సౌదీ అరేబియా సర్కారు
మక్కా: ఘోర ప్రమాదంతో సౌదీ అరేబియా సర్కారు అప్రమత్తమైంది. మక్కాలోని అన్ని ఆస్పత్రుల్లో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించాలని, చికిత్స విషయంలో ఎలాంటి తప్పొప్పులకు అవకాశం ఇవ్వకూడదని ఆదేశించింది. మరోవైపు ఘటనాస్థలం వద్ద సహాయకబృందాలు చర్యలు చేపట్టాయి. మృతదేహాలను తరలించడంతోపాటు గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. కాగా మక్కాలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 220కి పెరిగింది. -
మక్కాలో మరో పెను విషాదం
మక్కా : మక్కాలో గురువారం మరో పెను విషాదం చోటుచేసుకుంది. పవిత్ర హజ్ యాత్రలో తొక్కిసలాట జరిగి సుమారు 310మంది హజ్ యాత్రికులు దుర్మరణం చెందారు. మరో 500మందికి పైగా గాయపడ్డారు. సైతాన్ను రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ దుర్ఘటన జరింది. 15 రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయినవారిలో వివిధ దేశాలకు చెందినవారుగా ఉన్నారు. గతంలో మక్కాలో మసీదు మరమ్మతుల సందర్భంగా భారీ క్రేన్ కూలి 107 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాగా పవిత్ర హజ్ యాత్ర సందర్భంగా ముస్లింలు పోటెత్తారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నిన్న ఒక్కరోజే లక్షలమంది ముస్లింలు హజ్లో పాల్గొన్నారు. హజ్ యాత్రలో అయిదు రోజులను ముఖ్యమైనవిగా పేర్కొంటారు. ఇందులో భాగంగా అర్ఫా మైదాన్‌లో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దాదాపు 25 లక్షల మందికి పైగా ముస్లింలు ఇందులో పాల్గొన్నారు. లెక్కకు మించి భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.