breaking news
gurukul girls school
-
అన్నంలో పురుగులు.. కూరగాయల్లో ఎలుకలు
గోరంట్ల: నాసిరకం కూరగాయలు, పురుగుల బియ్యం, తిరుగుతూ పారాడుతున్న ఎలుకలు, వాలుతున్న ఈగలు... చంద్రబాబు సర్కార్ పర్యవేక్షణ లోపం.. గిరిజన సంక్షేమ అధికారుల నిర్లక్ష్యం... బీసీ సంక్షేమ శాఖ మంత్రి సొంత ఇలాకాలో గిరిజన గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినుల ప్రాణాల మీదకు తెస్తోంది. నాణ్యత లేని సరుకులతో వండిన భోజనం తిని మంగళవారం రాత్రి శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక్కడ పదో తరగతి వరకు 400 మంది చదువుతున్నారు. ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ ఇటీవల బదిలీ కాగా, హిందూపురం ప్రిన్సిపాల్ తులసికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. కొంతకాలంగా రెగ్యులర్ వంట మనిషి లేరు. నైట్ వాచ్ ఉమెన్ వంట చేస్తున్నారు. నిర్వహణ సరిగా లేక శిథిలావస్థలోని వంట గది దుర్వాసన వస్తోంది. అపరిశుభ్రత తాండవిస్తోంది. అయినా, నాసిరకం పదార్థాలతోనే వంట వండి విద్యార్థులకు పెడుతున్నారు. మంగళవారం రాత్రి భోజనం చేసిన అనంతరం వైష్ణవి (9వ తరగతి), వైష్ణవి (10వ తరగతి), భానుప్రియ (6వ తరగతి), జాహ్నవి (8వ తరగతి) వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వైస్ ప్రిన్సిపాల్ చంద్రకళ సమాచారం ఇవ్వడంతో ఏఎన్ఎం వచ్చి ప్రాథమిక చికిత్స చేశారు. అయినా తగ్గకపోవడంతో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పురుగుల అన్నం.. కుళ్లిన కూరగాయాలతో వండుతున్న ఆహారంపై గతంలోనే తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా అధికారుల్లో చలనం రాలేదు. పదుల సంఖ్యలో విద్యార్థినులు విషజ్వరాల బారిన పడ్డారు.హాస్టల్ అన్నంలో పురుగులుప్రత్తిపాడు: ‘‘అన్నంలో పురుగులు వస్తున్నాయి. తింటే వాంతులవుతున్నాయి. అదేమని అడిగితే మమ్మల్ని హాస్టల్ నుంచి వెళ్లమంటున్నారు’’ అంటూ హాస్టల్ విద్యార్థినులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు చెందిన కుంచాల నాగమణి మూడేళ్లుగా ఫిరంగిపురంలో నివాసం ఉంటుంది. ఆమె తన కుమార్తెలు కుంచాల అఖిల (6వ తరగతి), కుంచాల అక్షయ (5వ తరగతి)లను ఈ ఏడాది ప్రత్తిపాడు ఎస్సీ బాలికల వసతి గృహంలో చేరి్పంచింది. కొద్దిరోజుల కిందట హాస్టల్లో పెట్టిన భోజనంలో పురుగులు రావడంతో అఖిల వాంతులు చేసుకుంది. దీంతో ఆమె తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది. తోటి పిల్లలు కూడా కొడుతున్నారని, వచ్చి తీసుకుని వెళ్లాలని ఫోన్లో రోదించింది. దీంతో ఆదివారం తల్లి నాగమణి హాస్టల్‌కు వచ్చి అఖిలను ఇంటికి తీసుకువెళ్ళింది. తిరిగి మంగళవారం హాస్టల్‌కు వచ్చింది. ‘‘మీ పాపను హాస్టల్లో చేర్చుకోం.. మీతో తీసుకువెళ్లిపోండి. మీ పిల్ల వల్ల మిగిలిన వారు ఇబ్బంది పడుతున్నారు. మీ పాప ఆరోగ్యం సరిగా లేదు. మెడికల్ సర్టిఫికెట్ తీసుకుని వస్తేనే చేర్చుకుంటా.’ అంటూ వార్డెన్ నాగమణికి చెప్పింది. స్టేషన్ మెట్లు ఎక్కిన హాస్టల్ విద్యార్థినులు దీంతో ఏమి చేయాలో పాలుపోని నాగమణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ఎస్ఐ నరహరి ఎదుట వాపోయింది. మిగిలిన పిల్లలు మమ్మల్ని కొడుతున్నారని, మా పుస్తకాలను లాక్కుని బయట పడేస్తున్నారని ఎస్ఐకి పిల్లలు వివరించారు. హాస్టల్లో డీడీ విచారణ.. హాస్టల్ విద్యార్థినులు స్టేషన్ మెట్లు ఎక్కిన ఘటన జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ యు.చెన్నయ్య దృష్టికి వెళ్లడంతో ఆయన రాత్రి హాస్టల్‌కు చేరుకున్నారు. భోజనం, సదుపాయాలను పరిశీలించారు. బాధిత విద్యార్థినులతోపాటు మిగిలిన విద్యార్థినులతో మాట్లాడారు. బాధిత విద్యార్థినులు డీడీ చెన్నయ్య ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం డీడీ మీడియాతో మాట్లాడుతూ.. హాస్టల్లో ఉన్న బియ్యాన్ని మారుస్తామన్నారు. -
ఫుడ్ పాయిజన్‌తో గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
ఘట్కేసర్: ఫుడ్ పాయిజన్‌తో మైనారిటీ గురుకులానికి చెందిన విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా నాగారంలోని మైనారిటీ గురుకులంలో 450 మంది విద్యార్థినులు ఉన్నారు. గురువారం ఉదయం అల్పాహారం బోండా, మధ్యాహ్నం చికెన్‌తో భోజనం చేశారు. తిరిగి సాయంత్రం అల్పాహారంలో బొప్పాయి తిన్నట్టు విద్యార్థినులు తెలిపారు. కొద్ది సేపటి తర్వాత కొంతమంది విద్యార్థినులకు కడుపు నొప్పి, వికారంగా అనిపించడంతో ప్రిన్సిపాల్ స్వప్నకు తెలి పారు. ఆమె ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి విద్యార్థినులను వెంటనే తీసుకెళ్లారు. 33 మంది విద్యార్థినులను పరీక్షించి 9 మందిని అడ్మిట్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు ఆస్పత్రికి వెళ్లగా వార్డెన్, ఇతర సిబ్బందితో కలిసి దుర్భాషలాడింది. ఆస్పత్రికి మీరెందుకు వచ్చారంటూ ఫొటోలు తీ యకుండా అడ్డుకున్నారు. ప్రిన్సిపాల్ స్వప్న ను వివరణ కోరగా కడుపునొప్పి ఉందంటే విద్యార్థినులను ముందస్తుగా ఆస్పత్రికి తీసు కొచ్చామన్నారు. డాక్టర్ యాదయ్యను వివ రణ కోరగా 33 మందిని పరీక్షించామని అందులో 9 మందిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నామన్నారు. ఫుడ్ పాయిజన్‌తోనే ఇలా అయ్యిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. -
బనవాసి గురుకులంలో దారుణం
కర్నూలు ,ఆదోని: ఎమ్మిగనూరు సమీపంలోని బనవాసి బాలికల గురుకుల పాఠశాల హాస్టల్లో సోమవారం దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థిని మల్లేశ్వరి నిద్రిస్తున్న మంచానికివిద్యుత్ సరఫరా కావడంతో ఆమె షాక్‌కు గురైంది. చెయ్యి, వీపు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే విషయం బయటకు పొక్కకుండా పాఠశాల నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. ఘటన జరిగిన వెంటనే ప్రిన్సిపాల్ సజిదాబేగం అదే గ్రామంలో ఉండే విద్యార్థిని తల్లిదండ్రులు జయలక్ష్మి, నాగేంద్రప్పలకు సమాచారం అందించి.. ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆదోనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స తరువాత మెరుగైన వైద్యం కోసం కర్నూలు పెద్దాసుపత్రికి రెఫర్ చేశారు. హాస్టలులో పర్యవేక్షణ కొరవడడం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు విమర్శలున్నాయి. ఈ విషయమై ప్రిన్సిపాల్ వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా.. ఆమె స్పందించలేదు. -
మీ పిల్లలైతే ఇలాంటి అన్నమే పెడతారా?
- ప్రిన్సిపాల్ పనితీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం - పనితీరు మార్చుకోవాలని ప్రిన్సిపాల్‌కు వసంతరావు హెచ్చరిక మెదక్ టౌన్ : మీ పిల్లలైతే ఇలాంటి అన్నం, కూరలే వండి పెడతారా? ఇలాంటి అన్నం పెడితే పిల్లలు ఎలా తింటారు? అంటూ స్థానిక గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ రమణ తీరుపై మంగళవారం పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన డిప్యూటీ సెక్రటరీ వసంతరావు ప్రిన్సిపల్‌పై మండిపడి పనితీరు మార్చుకోవాలని, లేకుంటే శాఖపర చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. తెలంగాణ గురుకుల పాఠశాలల డిప్యూటీ సెక్రటరీ వసంతరావు మెదక్ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పర్యటించి భోజన వసతి గృహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, స్నానాలు సైతం సరిగా చేయలేక పోతున్నామని విద్యార్థులు ఆయనతో మొర పెట్టుకున్నారు. పాఠశాలలో ఫ్యాన్లు పనిచేయడం లేదని విద్యార్థులు డిప్యూటీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఫ్యాన్లను మరమ్మతులు చేయించాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు గురుకులంలో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, తాము ప్రశ్నిస్తే కాంట్రాక్టర్‌కు గిట్టుబాటు కాకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ ప్రిన్సిపల్ నిర్లక్ష ్యపు సమాధానం చెబుతున్నారని, వాటర్ ట్యాంకుల్లో పూర్తిగా నాచు పేరుకు పోయింది, భోజన గది పరిసరాలన్ని పూర్తిగా దుర్గంధ భరింతంగా ఉన్నాయని, విద్యార్థులతో టిఫెన్ క్యారియర్లు మోయిస్తున్నారని సెక్రటరీ దృష్టికి తెచ్చారు. ఆరోపణల్లో నిజం ఉంది : వసంతరావు పాఠశాలలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, విద్యార్థులకు సరిగా భోజనం పెట్టడం లేదని, గుడ్లు ఇవ్వడం లేదన్న ఆరోపణలు రావడంతో తనిఖీకి వచ్చినట్లు డిప్యూటీ సెక్రటరీ వసంతరావు విలేకరులతో తెలిపారు. ఇక్కడి పరిస్థితి చూశాక అదే నిజమేనని తేలిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 49 పాఠశాలల్లో 23,520 మంది విద్యార్థులు చదువుతున్నారని, అన్ని పాఠశాలల్లో మెదక్ పాఠశాలనే చాలా పెద్దదని తెలిపారు. ఇందులో మంచి ఫలితాలు వస్తాయన్నారు. పాఠశాలలో నీటి సమస్య, కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఇకనుండైన పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ రమణమ్మను హెచ్చరించారు. అనంతరం పేరెంట్స్ కమిటీ సభ్యులతో మాట్లాడారు. ఎలాంటి సమస్యలున్నా తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకురావాలన్నారు.


