breaking news
Guru poornima celebrations
-
'గురువు' అనే పదం ఎలా వచ్చింది..? అతడిని తెలుసుకునేది ఎలా..?
అంధకారాన్ని పోగొట్టి జ్ఞానోదయం కలిగించేవాడే గురువు. గురువ అనే శబ్దానికి అత్యంత మహోన్నత అర్థాన్ని వివరించారు ఎందరో మహానుభావులు. ఇవాళ(గురువారం) గురుపౌర్ణమి సందర్భంగా అలాంటి నిజమైన గురువును ఎలా గుర్తించాలి? . ఆయన మనల్ని ఎలా కనుగొంటాడు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందాం! . ‘గురు’ అనే పదం రెండు పదాల నుండి వచ్చింది: ‘గు’ అంటే అంధకారం, మరియు ‘రు’ అంటే తొలగించడం లేదా చెదరగొట్టడం. ఒక గురువు, భ్రాంతి యొక్క చీకటి సందుల నుండి బయటపడి మన నిజమైన నివాసం, అంటే జ్ఞానోదయం భద్రతలోకి అడుగుపెట్టేవరకు, జన్మజన్మాంతరాలుగా మన చేతులు పట్టుకుని నడిపిస్తాడు. మరి నిజమైన గురువును ఎలా గర్తించాలి?మనం గురువును కనుగొనం, గురువే మనల్ని కనుగొంటాడని చెబుతున్నాయి పురాణాలు. పరమ సత్యం పట్ల మన తపన తీవ్రమైనప్పుడు, ఆత్మసాక్షాత్కారం వైపు సవాలుతో కూడిన ప్రయాణంలో మనకు మార్గనిర్దేశం చేయడానికి దేవుడు ఒక దైవిక మార్గాన్ని లేదా గురువును పంపుతాడు. అటువంటి గురువు దైవ నియమితమైనవాడు. ఆయన దైవంతో ఏకమైనవాడు, అలాగే భూమిపై ఆయన ప్రతినిధిగా మాట్లాడటానికి దైవిక ఆమోదం కలిగి ఉంటాడు. గురువు నిశ్శబ్ద దైవ వాణి. గురువు నిర్దేశించిన సాధనను అనుసరించడం ద్వారా, శిష్యుడు భ్రాంతి సముద్రాన్ని దాటడానికి జ్ఞానం అనే తన సొంత ప్రాణరక్షక తెప్పను నిర్మించుకుంటాడు. గురువు, దేవుడు మన జీవితాల్లోకి అడుగిడే అనంత ద్వారం. మనం మన సంకల్పాన్ని, చైతన్యాన్ని గురువుతో అనుసంధానించుకోకపోతే, దేవుడు మనకు సహాయం చేయలేడు. ఈ రోజుల్లో, శిష్యత్వం అనేది గురువుకు లోబడి తమ స్వేచ్ఛా సంకల్పాన్ని వదులుకోవడంగా పరిగణించబడుతుంది. అయితే, గురువు యొక్క సార్వత్రిక కరుణ పట్ల విశ్వసనీయత ఏ మాత్రం బలహీనతకు సంకేతం కాదు.స్వామి శ్రీయుక్తేశ్వర్ ఇలా అన్నారు: “స్వేచ్చా సంకల్పం అనేది పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ ఏర్పడ్డ అలవాట్లు లేక మానసికోద్రేకాలకు లోబడి ప్రవర్తించడంలో లేదు.” అయితే, సాధారణ మానవులు తమ సంకల్ప శక్తిని నిర్మాణాత్మకంగా ఉపయోగించకుండానే తమ నిత్య జీవితాలను గడుపుతారు సంక్షోభంలో, దుఃఖంలో, ఆనందంలో కూడా. స్వేచ్ఛ అంటే నిజానికి మన అహం-ప్రేరిత స్వభావం నుండి విముక్తి పొందడమే. ఇది అనంత జ్ఞానం, సర్వవ్యాప్త చైతన్యం, సర్వవ్యాప్త ప్రేమపై ధ్యానం చేసినప్పుడు మాత్రమే వస్తుంది; వీటిని శిష్యులు సత్య గురువు బోధనల ద్వారా అనుభవించగలరు. పరమహంస యోగానంద అటువంటి సద్గురువులలో ఒకరు. ఆయన దివ్యమైన గురుపరంపర నుంచి వచ్చారు. క్రియాయోగ మార్గ జ్ఞానాన్ని ప్రపంచానికి విస్తరింపజేయడానికి కృషి చేశారు. క్రియాయోగం ఆత్మసాక్షాత్కారానికి అత్యున్నత మార్గాలలో ఒకటి. లక్షలాది మంది జీవితాలను ఉద్ధరించిన ఆయన ఆధ్యాత్మిక గ్రంథమైన “ ఒక యోగి ఆత్మకథ”లో, యోగానంద ఇలా వ్రాశారు: క్రియాయోగమన్నది మనిషి రక్తంలో కర్బనాన్ని హరింపజేసి ఆక్సిజన్‌తో నింపే ఒకానొక మానసిక-శారీరక ప్రక్రియ. ఈ అదనపు ఆక్సిజన్ అణువులు ప్రాణశక్తి ప్రవాహంగా మారిపోతాయి, దీనితో ఒక యోగి కణజాలాల క్షయాన్ని తగ్గించడం కానీ మొత్తానికే ఆపెయ్యడం కాని చేయగలడు. ఆధ్యాత్మిక పురోగతికి అటువంటి శక్తివంతమైన పద్ధతిని మానవాళికి పంచుకోవడం తప్పనిసరి. ఈ ఉద్దేశ్యంతోనే, యోగానంద తన గురువు స్వామి శ్రీయుక్తేశ్వర్ ప్రోద్బలంతో, 1917 లో రాంచీలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ను, 1920 లో లాస్ ఏంజిల్స్‌లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) ను స్థాపించారు.సత్య జిజ్ఞాసువులకు క్రియాయోగ బోధనలు ఎస్.ఆర్.ఎఫ్. మరియు వై.ఎస్.ఎస్. ద్వారా స్వీయ-సాక్షాత్కారంపై గృహ అధ్యయన పాఠాల రూపంలో అందుబాటులో ఉన్నాయి. విశ్వాసి యొక్క తపన లోతుగా ఉండి, దేవుడిని తెలుసుకోవాలని నిరంతర ఆకాంక్ష ఉంటే, ఒక సద్గురువు స్వయంగా తన శిష్యుడికి మార్గనిర్దేశం చేయడానికి వస్తాడని నమ్ముతారు. ఇది ఒక సద్గురువు యొక్క దివ్య వాగ్దానం. గురువు భౌతిక శరీరంలో ఉన్నా లేకున్నా, ఆయనతో అనుసంధానమైన శిష్యుడికి ఆయన ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటాడు, ఎందుకంటే సద్గురువు యొక్క చైతన్యం శాశ్వతం. సంత్ కబీర్ మాటల్లో, “సద్గురువును కనుగొన్న శిష్యుడు ఎంతో గొప్ప అదృష్టవంతుడు!” (చదవండి: వ్యాసాయ విష్ణు రూపాయ...) -
విశాఖలో గురు పౌర్ణమి ప్రత్యేక పూజలు
-
చాతుర్మాస్య దీక్ష చేపడుతున్న విశాఖ శారదా పీఠాధిపతి
-
గురువు అనుగ్రహంతోనే ఆత్మదర్శనం
-
షిర్డీసాయి సన్నిధిలో ఘనంగా గురుపౌర్ణమి
సాక్షి ముంబై: షిర్డీలో గురుపౌర్ణమి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. షిర్డీ సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా శనివారం పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంతోపాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడం తో షిర్డీ పురవిధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మందిరాన్ని కూడా రకరకాల పుష్పాలు, కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురుపౌర్ణిమను పురస్కరించుకుని సోమవారం ‘శ్రీసాయి సచ్ఛరిత్ర’ పవిత్ర గ్రంథం అఖండ పారాయణం ముగిసింది. ఈ సందర్భంగా శ్రీసాయి చిత్రపటం, పోతిని ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో సాయిబాబా సంస్థాన్ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశికాంత్ కులకర్ణి ‘పోతి’ (ధాన్యం సంచి), మందిరం ఈఓ కుందన్ కుమార్ సోనవణే, డిప్యూటి ఈఓ అప్పాసాహెబ్ షిండే సాయిచిత్రపటాన్ని చేతపట్టుకున్నారు. ఈ ఊరేగిం పులో సంస్థాన్ అధికారులు, వారి సతీమణులు, భక్తులు, స్థానికులు భారీ సంఖ్యల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఆలయానికి సమీపంలో నిర్మించిన భారీ వేదికపై రోజంతా వివిధ భక్త మండలులు భజనలు, కీర్తనలు ఆలపిస్తున్నాయి. ఉచిత ప్రసాదాలు.. తెలుగు భక్తులతోపాటు ఇతర ప్రాంతాల భక్తులు అందజేసిన విరాళాలలతో షిర్డీ వచ్చే భక్తులందరికీ ఉచితంగా ప్రసాదాలు, భోజనాలు పెడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన కరణం నారాయణ, పోత్రాపులా పార్థసారథి, సులోచనా కార్తీక్ సంజయ్, చీరాలకు చెందిన వెంకటరమణా రెడ్డితోపాటు ముంబై, జబల్పూర్ భక్తులు అందించిన సహాయంతో ప్రసాదాలు, భోజనాలు పెట్టారు. గురుపౌర్ణమి ఉత్సవాల మొదటి రోజు శుక్రవారం 70 వేల మంది భక్తులకు ఉచితంగా లడ్డూలు పంపిణీ చేశారు. ‘సాయి సన్నిధ్యాత్’ పుస్తకం అవిష్కరణ... ముంబైకి చెందిన సాయిభక్తురాలు ముగ్ధా దివాడ్కర్ రచించిన ‘సాయి సన్నిధ్యాత్’ అనే గ్రంథాన్ని గురుపౌర్ణమిని పురస్కరించుకుని అవిష్కరిచారు. ఈ పుస్తకాన్ని సంస్థాన్ ఈఓ కుందన్‌కుమార్ సోనవణే చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి ఈఓ అప్పాసాహెబ్ షిండే, పిఆర్ ఓ మోహన్ జాధవ్, రచయిత ముగ్ధ, ప్రచురణకర్త కులకర్ణి తదితరులు పాల్గొన్నారు. నేడు రుద్రాభిషేకం... గురుపౌర్ణమి ఉత్సవాల చివరి రోజు గురుస్థాన్ ఆల యంలో రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఉట్టిత్సవాలు, ప్రత్యేక కీర్తనలు తదితర కార్యక్రమాలు ఉంటాయి. గ్రాంట్‌రోడ్డులో.. గ్రాంట్ రోడ్డులోని జగనాథ్ శంకర్‌సేఠ్ సెకండరీ మున్సిపల్ పాఠశాల ఆధ్వర్యంలో శనివారం ఉదయం పాఠశాల ప్రాంగణంలో ‘గురుపూర్ణిమ’ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. గురుశిష్యుల మధ్య సఖ్యత ప్రాధాన్యాన్ని వివరిస్తూ విద్యార్థులు గేయాలు ఆలపించారు. తరువాత ప్రతి ఉపాధ్యాయుడికీ పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ రాపెల్లి సుదర్శన్ మాట్లాడుతూ గురుపూర్ణిమ చారిత్రక ప్రాధాన్యం, విశిష్టత గురించి వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.రాజు, గాల్డె సదానంద్, తాటికొండ సంగీత, వసం షేక్, అర్చన, శిల్ప, రింకీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.