breaking news
Great Wall damage
-
షార్ట్‌కట్ అని 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా'నే కూల్చేశారు
బీజింగ్: ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' ఆ దేశానికి ప్రహారి గోడ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా వారికి తొట్టతొలి గుర్తింపు సాధించిన చారిత్రాత్మక కట్టడం కూడా. అలాంటిది రాకపోకలకు అడ్డంగా ఉందని ఈ గోడకు ఏర్పడ్డ చిన్న సందుని పెద్దది చేసే ప్రయత్నంలో భారీగా తవ్వేశారు ఇద్దరు ఆగంతకులు. గ్రేట్ వాల్ అయితే ఏంటి? చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లో, యూయు కౌంటీ సమీపంలోని యాంగ్‌క్యాన్హె టౌన్షిప్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ 38 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ ఇక్కడికి సమీపంలో ఒక నిర్మాణ కాంట్రాక్టును తీసుకున్నారు. అయితే వారి రాకపోకలకు అడ్డంకిగా నిలవడంతో పాటు యంత్ర సామాగ్రిని నిర్మాణ స్థలానికి తరలించడానికి గ్రేట్ వాల్ అడ్డుగా ఉంది. దీనివలన వారు పని చేసుకునే చోటికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. దీంతో వారిద్దరు కలిసి యంత్రాల సాయంతో గ్రేట్‌వాల్‌ను కొంతవరకు కూల్చేశారు. షార్ట్‌కట్ అని.. ఆగస్టు 24న స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కూల్చేసిన గోడను చూసి విభ్రాంతికి గురయ్యారు. కేవలం షార్ట్‌కట్‌గా ఉపయోగపడుతుందన్న ఒకేఒక్క కారణంతో నిందితులు చైనా ప్రతిష్టకు ప్రతీకగా నిలిచిన భారీ గోడ సమగ్రతకు సుస్థిరతకు తీవ్రనష్టం కలిగించారన్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. చారిత్రాత్మకం.. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం క్రీస్తుపూర్వం 200లోనే ప్రారంభమైనప్పటికీ ఇప్పుడున్న కట్టడాన్ని నిర్మించింది మాత్రం మింగ్ వంశీయులే. క్రీస్తుశకం 1368-1644 సమయంలో దీని నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక కట్టడమైన ఈ గోడను యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. ఈ చారిత్రక కట్టడాన్ని చూసేందుకు నేటికీ ప్రపంచ దేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి తరలివస్తుంటారు. 🚜 In the Chinese province of Shanxi, locals destroyed a section of the Great Wall of China with an excavator, — Sohu During interrogation, the man and woman admitted that they worked at a construction site nearby, and thus wanted to shorten the way to work. The ruined section… pic.twitter.com/2enLL69y7H — UNEWS (@UNEWSworld) September 4, 2023 ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుని భార్యకు కరోనా.. బైడెన్ జీ20 పర్యటనపై సందిగ్ధత.. -
'గ్రేట్ వాల్' దెబ్బతింటున్నా..
-
'గ్రేట్ వాల్' దెబ్బతింటున్నా..
బీజింగ్ః ఆధునిక మానవుని ఇంజనీరింగ్ నైపుణ్యానికి, శతాబ్దాల చరిత్రకు మారుపేరైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనా.. రోజురోజుకూ అంతరించిపోతోంది. ప్రకృతి బీభత్సాలకు, వాతావరణ మార్పులకు ఈ చరిత్రాత్మక కట్టడంలోని వినియోగంలో ఉన్న మార్గం.. చాలాభాగాల్లో పాడైపోయింది. గోడ పొడవునా చాలాప్రాంతాల్లో మొక్కలు మొలిచి, రంధ్రాలు ఏర్పడటంతో దాదాపు 2 వేల కిలోమీటర్ల మేర ఇప్పటికే నిరుపయోగంగా మారిపోయింది. ప్రస్తుతం షాంగ్జీ ప్రాంతంలో హైవేల నిర్మాణంతో గ్రేట్ వాల్ లో మూడు విభాగాలు దెబ్బతిన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన చైనా గ్రేట్ వాల్ దెబ్బతింటున్నా పట్టించుకునేవారే కనిపించడం లేదు. సాంస్కృతిక వారసత్వ సంపదైన గోడను తిరిగి నిర్మించడమంటే మాటలు కాదు. మరమ్మతులు చేయడమూ కష్టమైన పనేనంటూ నిపుణులు చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాచీన సంపదను... కాపాడుకోవడం ఒక్కటే.. మార్గంగా కనిపిస్తుంది. అయితే స్థానికంగా నిర్మిస్తున్న హైవేలు గ్రేట్ వాల్ కు సంకటంగా మారాయి. యూలిన్, జింగ్బైన్ నగరాలను కలుపుతూ 94 కిలోమీటర్ల మేర చేపట్టిన రహదారి నిర్మాణం.. రాష్ట్రస్థాయి రక్షణలో ఉన్న క్వీన్ డినాస్టీ (క్రీస్తు పూర్వం 206-221) మింగ్ డినాస్టీ (1368-1644) ల మీదుగా జరుగుతుండటం చారిత్రక కట్టడానికి తీరని విఘాతం కలిగించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆరు గ్రేట్ వాల్ అవశేషాలు కలిగిన, 48 చరిత్రపూర్వ ప్రదేశాల్లో ప్రాజెక్టును నిలిపివేయాలని అధికారులను కోరుతూ జూలైలో సాంస్కృతిక వారసత్వ యూలిన్ బ్యూరో ఓ పత్రాన్ని జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర సాంస్కృతిక వారసత్వ శాఖ అనుమతి లేకుండా రహదారుల నిర్మాణం జరుగుతోందని, ఇప్పటికైనా ఈ ప్రాజెక్టును నిలిపివేయని పక్షంలో మూడు చరిత్రాత్మక ప్రదేశాలు దెబ్బతినే అవకాశం ఉందని బ్యూరో సిబ్బంది చెప్తున్నారు. అవశేషాలను రక్షించడంకోసం తాము ప్రత్యేక ప్రణాళికలు అభివృద్ధి చేస్తున్నామని, బిల్లర్ల సహాయంతో దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తిస్తామని బ్యూరో సిబ్బంది అంటున్నారు. మింగ్ రాజవంశం నిర్మించిన 6,200 కిలోమీటర్ల గోడలో సుమారు 30 శాతం ఇప్పటికే కనుమరుగైనట్లు అధికారులు చెప్తున్నారు.