graduated
-
యాక్టర్ కమ్ డాక్టర్.. వైద్య పట్టా అందుకున్న శ్రీలీల
ప్రముఖ తెలుగు నటి శ్రీలీల తన వైద్య విద్యను పూర్తి చేశారు. ఎంబీబీఎస్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసుకుని తాజాగా డాక్టర్‌గా అర్హత సాధించారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆమె తన చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. తల్లి గైనకాలజిస్ట్‌గా ఉండటం వల్ల చిన్నప్పటి నుంచే వైద్య రంగంపై ఆసక్తి కలిగిన శ్రీలీల, సినిమా షూటింగ్‌ల మధ్యలోనూ చదువుపై దృష్టి పెట్టి ఈ గొప్ప విజయాన్ని సాధించింది. 2023లో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్‌ను పూర్తి చేసుకొని.. తాజాగా కాన్వోకేషన్ వేడుకలో డిగ్రీ పట్టాను అందుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. #SreeLeela has officially graduated, completing her medical degree ❤️Acting + academics - win win! pic.twitter.com/sisosEPRTZ— Siddarth Srinivas (@sidhuwrites) February 11, 2026‘డాక్టర్’ శ్రీలీల వెనుక పెద్ద కథే ఉందిశ్రీలీల వైద్య విద్యను అభ్యసించడానికి గల కారణాన్ని ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది. అమ్మమ్మ విషయంలో జరిగిన ఓ సంఘటననే తనను మెడిసిన్ చదివేలా చేసిందని చెప్పారు. ‘నేను డాక్టర్ అవ్వాలని నిర్ణయం తీసుకోవడానికి వెనక ఓ స్టోరీ ఉంది. మా ఇంట్లో అమ్మతో పాటు అన్నయ్య కూడా డాక్టరే. ఓ సారి నేను అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లాను. అది మారుమూల గ్రామం. ఓ రోజు అమ్మమ్మ సడెన్‌గా కిందపడిపోయింది. ఏం చేయాలో తెలియదు. అందరితో పాటు నేను కూడా అక్కడే నిల్చోని చూస్తున్నా. కానీ అన్నయ్య వెంటనే వచ్చి అమ్మమ్మను పైకిఎత్తి వీపు భాగాన్ని పుష్ చేశాడు.దీంతో అమ్మమ్మ ప్రమాదం నుంచి బయటపడింది. అన్నయ్య మెడిసిన్ చదవుతున్నాడు కాబట్టి.. ఆ సమయంలో ఏం చేయాలో అది చేశాడు. కానీ నాకు సహాయం చేయాలని అనిపించినప్పటికీ ఎలా చేయాలో తెలియదు. ఆ రోజే ఫిక్సయ్యా.. నేను ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని. అందుకే మెడిసిన్ కోర్సు తీసుకున్నాను’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. Actress #SreeLeela has officially graduated and completed her medical degree ❤️Balancing academics and cinema at such a young age 👏🏻👏🏻 pic.twitter.com/hGrMKv7iir— Ayyappan (@Ayyappan_1504) February 11, 2026 -
జలీల్ ఖాన్‌ను తలదన్నే ఫీట్!
బీకామ్‌లో ఫిజిక్స్ ఉంటుందని ఆ మధ్య ఉవాచించిన ఒక ప్రజాప్రతినిధి ‘అపార’ పరిజ్ఞానంపై ప్రసార,సామాజిక మాధ్యమాల్లో కొన్నాళ్లపాటు ఏకధాటిగా సెటైర్లే.. సెటైర్లు.. కానీ.. ఆయనగారి కంటే ముందు ఒక విద్యాసంస్థ ఆయన్ను తలదన్నే ఫీట్ ప్రదర్శించింది. సదరు ప్రజాప్రతినిధి ఒక్క సబ్జెక్టు విషయంలోనే తన అతి తెలివి ప్రదర్శిస్తే.. ఈ విద్యాసంస్థ మాత్రం ‘కుడి ఎడమైతే పొరపాటు లేదని..’ అనుకుందో ఏమో.. ఏకంగా బీఎస్సీ విద్యార్థికి బీకామ్ పట్టా ఇచ్చేసింది. అలా ఇచ్చిన సంస్థ ఊరూ పేరు లేనిదా.. అంటే.. ఎంతో విశిష్టత, ఉన్నత చరిత్ర కలిగిన మన ఆంధ్ర విశ్వవిద్యాలయమే ఆ ఘనతను సొంతం చేసుకుంది.. పోనీ.. ఏదో పొరపాటు జరిగిపోయింది.. దాన్ని వెంటనే సరిదిద్దారా అంటే.. పట్టా మార్చకుండా మూడేళ్లుగా బాధిత విద్యార్థిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏయూ అధికారుల నిర్వాకంతో ఉద్యోగావకాశాలు కూడా పోగొట్టుకుంటున్న ఆ కుర్రాడు చివరికి ‘సాక్షి’ని ఆశ్రయించాడు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం.. చెప్పుకోవడానికి దేశంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం.. కానీ తీరులో అంతా గందరగోళం అనడానికి ప్రత్యక్ష ఉదాహరణే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అట్టాడ శ్రీహరి ఉదంతం. ఆ జి ల్లాలోని నందిగాం మండలం పెంటూరు గ్రామానికి చెందిన శ్రీహరి టెక్కలి బీఎస్ అండ్ జేఆర్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సీబీజెడ్ కోర్సు చేశాడు. 2015లో డిగ్రీ పట్టా కూడా చేతికొచ్చింది. దాన్ని చూసి ఆనందంతో మెరిసిన అతని కళ్లు.. అందులోని వివరాలు చూసి అంతలోనే బైర్లుకమ్మాయి. మార్కుల వివరాల వద్ద సైన్సు సబ్జెక్టులుగానే పేర్కొన్నా.. పైన మాత్రం బ్యాచిలర్ ఇన్ కామర్స్ అని ఉంది. పొరపాటు జరిగిందని గ్రహించిన శ్రీ హరి వెంటనే కళాశాల యాజమాన్యాన్ని సంప్రది స్తే.. తమకేం సంబంధం లేదని, విశాఖ వెళ్లి ఆం ధ్రా యూనివర్సిటీ అధికారులను సంప్రదించా లని సూచించారు. దీంతో ఆ యువకుడు వర్సిటీ అధికారులను కలిసి.. జరిగిన పొరపాటు గురించి వివరించారు. ‘ఆహా అలా జరిగిందా.. ఏముంది మార్చేద్దాం లే’.. అని చాలా తేలిగ్గా మాట్లాడిన పరీక్షల విభాగం అధికారులు మూడేళ్లయినా తమ తప్పును సరిదిద్దుకోలేదు. బాధిత విద్యార్థిని అది గో.. ఇదిగో.. అంటూ తిప్పుతూనే ఉన్నారు. ఉద్యోగావకాశమూ పోయె.. సర్టిఫికెట్లో తప్పు కారణంగా శ్రీహరికి ఉద్యానవనశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేజారింది. ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఇతని డిగ్రీ పట్టా తిరస్కరణకు గురైంది. బీఎస్సీ అని చెప్పి బీకామ్ సర్టిఫికెట్ ఎలా పెట్టావని సంబంధిత అధికారులు శ్రీహరిని మందలించారు. ‘సార్.. పొరపాటున అలా వచ్చింది.. నేను బీఎస్సీ సీబీజెడ్ చదివానని మొత్తుకున్నా.. సర్టిఫికెట్టే ప్రధానమంటూ అధి కారులు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. పోనీ బీకామ్ సర్టిఫికెట్తో ఏదైనా ఉద్యోగం చేద్దామంటే కామర్స్‌లో అవగాహన లేదు. దీంతో రెం టికీ చెడ్డ రేవడిలా తన పరిస్థితి తయారైందని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ విద్యార్ధి వేదన మాత్రం వర్సిటీ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. అలా ఎలా జరిగిందో? వాస్తవానికి వర్సిటీలో బీఎస్సీ, బీకామ్లకు విడివిడిగా విభాగాలున్నాయి. ఒక విభాగానికి సం బంధించిన సర్టిఫికెట్ మరో విభాగంలో కలిసే అవకాశం లేదు. క్లర్క్, సూపరింటెండెంట్ పరిశీలించిన తర్వాతే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకం పెడతారు. ఒకవేళ ముద్రణ సమయంలో పొరపాటు జరిగినా సంబంధిత శాఖ ఉద్యోగులు గమనించాలి. కనీసం తప్పిదం జరిగిన తర్వాతైనా సరిదిద్దకుండా ఏయూ అధికారులు నిర్లక్ష్యం వహించడం విమర్శలపాలవుతోంది. నా వద్దకు వస్తే వెంటనే మార్పిస్తా ఎలా జరిగిందో తెలియదు.. ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది.. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మాదే.. ఆ యువకుడు నేరుగానన్ను కలిస్తే సర్టిఫికెట్ మార్పించి ఇస్తాను. – సుధాకర్‌రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ -
అమెరికా అధ్యక్షుడినవుతా
లాస్ ఏంజెల్స్: భారతీయ సంతతికి చెందిన అమెరికా బాలుడు 11 ఏళ్లకే డిగ్రీ పట్టా పుచ్చుకుని పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కాలిఫోర్నియాలోని అమెరికన్ రివర్ కాలేజీలో మూడు వరుస డిగ్రీలతో సంలచనం సృష్టించాడు. అమెరికాలో అతి చిన్న వయసులో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థిగా తనిష్క్ అబ్రహాం రికార్డు కొట్టేశాడు. ఏకంగా మూడు విభాగాల్లో.. మాథ్స్, సైన్స్, విదేశీ భాషల్లో డిగ్రీలు సాధించాడు. 1800 విద్యార్థుల్లో హాజరైన ఈ సంవత్సరం పరీక్షల్లో తనిష్క్ ఈ ఘనతను సాధించాడు. తనిష్క్ ఏడేళ్ల వయిసులో హైస్కూలు డిప్లొమా సాధించి అమెరికా అధ్యక్షుడు ఒబామా నుంచి ప్రశంసలందుకున్నాడు. తనిష్క్‌ను అభినందిస్తూ ఆయన ఒక లేఖ కూడా రాశారు. తనిష్క్ చాలా తెలివైనవాడు... క్లాస్‌లో ఎప్పుడూ తనే ఫస్ట్...ఇది ఏమంత పెద్ద విజయం కాదు..తను సాధించాల్సింది ఇంకా ఉంది అంటున్నారు తల్లి తాజి అబ్రహాం. అన్నట్టు ఈ బుడతడు డాక్టర్ కావాలనుకుంటున్నాడట... వైద్యరంగంలో పరిశోధనలు చేయాలనుకుంటున్నాడట.. అంతేనా.. అమెరికా అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడట. నాకు నేర్చుకోవడం అంటే ఇష్టం. ఆ అలవాటే నన్ను ఇక్కడ నిలబెట్టిందని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు తనిష్క్. దీంతో.. హార్నీ.. పిడుగా. ఏకంగా ఒబామాకే ఎసరు పెట్టేశాడుగా అని చమత్కరిస్తున్నారు కొంతమంది పెద్దలు!


