GoPro camera
-
‘పహల్గాం’ దర్యాప్తు: ‘గోప్రో’లో కీలక రహస్యాలు?
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో చోటుచేసుకున్న ఘోర ఉగ్రదాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడులకు సంబంధించిన కీలక ఆధారంగా భావిస్తున్న ఒక 'గోప్రో' (GoPro) కెమెరా మూలాలను వెతుక్కుంటూ భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇప్పుడు చైనా గడప తొక్కేందుకు సిద్ధమయ్యింది. నాడు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 25 మంది పర్యాటకులతో పాటు స్థానికుడొకరు ప్రాణాలు కోల్పోయిన తెలిసిందే. ఈ దాడికి ముందు ఉగ్రవాదులు నిర్వహించిన రేక్కీ, వారి కదలికలకు సంబంధించిన దృశ్యాలు 'గోప్రో హీరో 12 బ్లాక్' కెమెరాలో నిక్షిప్తమైనట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ క్రమంలో ఆ పరికరానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు చైనా ప్రభుత్వానికి ‘లెటర్ రోగేటరీ’ పంపేందుకు జమ్ము కోర్టు ‘ఎన్ఐఏ’కు అనుమతినిచ్చింది.దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ తొలుత నెదర్లాండ్స్‌లోని గోప్రో తయారీ సంస్థను సంప్రదించగా, విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ఆ నిర్దిష్ట సీరియల్ నంబర్ గల కెమెరాను చైనాకు చెందిన ‘ఏఈ గ్రూప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్’ అనే డిస్ట్రిబ్యూటర్ సంస్థకు సరఫరా చేసినట్లు తయారీదారు తెలిపారు. అంతేకాకుండా ఈ పరికరం 2024, జనవరి 30న చైనాలోని డాంగ్‌గువాన్ ప్రాంతంలో యాక్టివేట్ అయినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా తెలిసింది. అయితే ఆ తర్వాత ఆ కెమెరా ఎవరి చేతులు మారింది? అంతిమంగా ఉగ్రవాదుల వద్దకు ఎలా చేరింది? అనే వివరాలు తమ వద్ద లేవని సదరు సంస్థ పేర్కొంది. దీంతో ఆ కెమెరాను కొనుగోలు చేసిన వ్యక్తి, దాని వినియోగదారుడు, దానికి సంబంధించిన సాంకేతిక రికార్డులను సేకరించేందుకు చైనా అధికారుల న్యాయ సహాయం తప్పనిసరని ఎన్ఐఏ భావిస్తోంది.భారత్-పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన ఈ పహల్గాం దాడి అనంతరం భారత్ అత్యంత కఠినంగా స్పందించింది. గత ఏడాది మే 7వ తేదీ తెల్లవారుజామున ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి, శత్రువుల నెట్‌వర్క్‌ను దెబ్బతీసింది. ఈ దాడులకు ప్రధాన కారకులైన సులైమాన్ షా, హమ్జా అఫ్గానీ అలియాస్ అఫ్గాన్, జిబ్రాన్ అనే ముగ్గురు ఉగ్రవాదులను దాచిగామ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు మట్టుబెట్టాయి.ఇది కూడా చదవండి: నేడు ఆకాశంలో అద్భుతం.. అంతటా ‘బ్లడ్ మూన్’ సందడి! -
కెమెరా లాక్కున్న ఆక్టోపస్..ఇచ్చేదే లే! అంటూ యుద్ధమే చేసింది
ఆక్టోపస్‌లకు సంబంధించిన విషయాలు కాస్త ఆసక్తికరంగానే ఉంటాయి. అవి ఏ వస్తువునైన వాటి కాళ్లతో గట్టిగా అదిమ పట్టేస్తాయి. అలానే ఓసారి ఒక అమ్మాయి..ఆక్టోపస్‌ని పట్టుకుని సరదాగా కామెడీ చేయబోగా ఏకంగా తన ముఖాన్నే గట్టిగా పట్టకుని..ఆ అమ్మాయిని ఏడిపించేసిన ఘటన తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు ఓ యువకుడిని ఇబ్బంది పెట్టింది. 15 ఏళ్ల జెస్సీ లోఫెల్ జెర్విస్ బోడెరీ నేషనల్ పార్క్‌లోని న్యూసౌత్ వేల్స తీరంలో స్నార్కెలింగ్(నీటి అడుగున ఈత కొట్టడం) చేస్తున్నాడు. నీటి అడుగున ఉండే అందాలను తన ప్రో కెమరాతో చక్కగా బంధిస్తున్నాడు. ఇంతలో అక్కడే సంచరిస్తున్న ఆక్టోపస్‌ని చూసి..దానికి దూరం నుంచే షూట్ చేస్తున్నాడు. ఇంతలో అది సడెన్ ఆ యువకుడి ప్రో కెమెరాను లాక్కుంది. దానికి ఉండే సెల్ఫీ స్టిక్‌ని గట్టిగా పట్టుకుని ఆ కెమారాను లాక్కుంది. దీంతో అతడికి ఏం చేయాలో తోచలేదు. కాసేపు దాని నుంచి ఆ కెమెరాను లాక్కునేందుకు చాలాసేపు ట్రై చేసి..చివరికి వదిలేశాడు. ఆ తర్వాత అక్కడే నీటి అడుగున స్నార్కెలింగ్ చేస్తూ ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ మేరీ క్లౌట్ని సంప్రదించాడు. దీంతో ఇద్దరు కలిసి అదే స్థానంలో నీటి అడుగుకి వెళ్లేటప్పటికి అదృష్టవశాత్తు ఆ ఆక్టోపస్ అక్కడే ఉంది. దీంతో క్లౌట్ కెమెరా తీసేందుకు యత్నించాడు. ఐతే ఆక్టోపస్ కెమెరాను వదిలే మూడ్‌లో లేదు. అది ఆ కెమెరాను చాలా గట్టిగా పట్టుకుంది. ఏం చేసిన వదలటం లేదు. చివరికి క్లౌట్ ఆ సెల్ఫీ స్టిక్‌తోనే ఆక్టోపస్‌ని పైకి లాగి విదిలించడంతో అది ఇక ఇవ్వక తప్పదన్నట్లు.. వదిలేసి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన అమేజింగ్ వీడియో నెట్టింట వైరల్ తెగ వైరల్ అవుతోంది. (చదవండి: చిట్టడవిలో ఓ భూత్‌బంగ్లా..లోపలికి అడుగుపెడితే..) -
వీడియో తీస్తూ.. మైనర్ పై గ్యాంగ్ రేప్..!
సిడ్నీ: మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనలో ఓ వ్యక్తికి జీవితకాల జైలుశిక్ష అనుభవించనున్నాడు. ఈ ఘటన సిడ్నీలో కొన్ని రోజుల కిందట జరిగింది. ట్రిస్టాన్ కార్లైల్ వాట్సన్ అనే యువకుడిని ఓ కేసులో భాగంగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్ రేప్ నకు గురై అపస్మారస్థితిలో బాలిక పడి ఉండగా వాట్సన్ తీసిన వీడియో స్థానికంగా హల్ చల్ చేస్తోంది. మొత్తంగా ఈ కేసులో ముగ్గురు వ్యక్తులతో పాటు ఓ మైనర్ దోషిగా ఉన్నాడు. వాట్సన్ అనే యవకుడు ప్రధానంగా వార్తల్లో నిలిచాడు. ఎందుకంటే, ఆ దారుణానికి గురైన బాలికతో ఫేస్ బుక్ లో అతడు ఫ్రెండ్ గా ఉండటమే కారణమని తెలుస్తోంది. పశ్చిమ సిడ్నీలో సెయింట్ క్లెయిర్ పార్టీ రమ్మని ఆ బాలికను వాట్సన్ ఆహ్వానించాడు. అక్కడ ఆ మైనర్ బాలిక మద్యం సేవించింది. కొద్దిసేపట్లో బాలిక అపస్మారకస్థితిలోకి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన వాట్సన్, కొందరు యువకులు మైనర్ పై అత్యాచారానికి ఒడిగట్టారు. ప్లాన్ ప్రకారమే బాలికను రప్పించి అత్యాచారం చేశారని కోర్టులో రుజువైంది. వాట్సన్ అత్యాచారం చేసినట్లు వీడియోలో కనిపించలేదని అతడి తరఫు న్యాయవాది వాదించాడు. ఆ బాలికతో కూడా మాట్లాడి పూర్తివివరాలు తెలుసుకోవాలంటూ కోర్టుకు విన్నవించారు. అయితే అత్యాచారానికి గురైన బాలికను వాట్సన్ తీసిన ఫొటోలతో పాటు అతడి ఫొటో కూడా పోలీసులకు లభ్యమైంది. శుక్రవారం రోజు ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. మైనర్ బాలిక వివరాలు వెల్లడించేందుకు కోర్టు, పోలీసు శాఖ నిరాకరించింది.


