breaking news
Gopal Krishna Reddy
-
‘కృష్ణ’ గారడి!
సహకార ఎన్నికలకు మళ్లీ బ్రేక్ మంత్రి స్టేతో ఆగిన తొమ్మిది పీఏసీఎస్‌ల ఎన్నికలు అప్పుడు మంత్రి కృష్ణారెడ్డి, ఇప్పుడు గోపాలకృష్ణారెడ్డి ఎఫెక్ట్ టీడీపీ మద్దతుదారులు ఓడిపోతారనే భయం పలమనేరు: జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలకు బ్రేక్ పడింది. రాష్ట్ర సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆదేశాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి సహకార శాఖ మంత్రి కృష్ణారెడ్డి ఈ ఎన్నికలకు స్టే ఇచ్చారు. ఈసారి టీడీపీకి చెందిన మంత్రి గోపాలకృష్ణారెడ్డి ఈ ఆదేశాలను జారీచేశారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు గెలవరనే సమాచారంతోనే ప్రభుత్వం ఈ ఎత్తుగడకు పూనుకున్నట్టు తెలుస్తోంది. తొమ్మిది పీఏసీఎస్‌లకు వాయిదా పడిన ఎన్నికలు జిల్లాలోని మదనపల్లె డివిజన్‌కు సంబంధించి పుంగనూరు, సోంపల్లె, సదుం, బెరైడ్డిపల్లె, బయప్పగారిపల్లె, చిత్తూరు డివిజన్‌కు సంబంధించి కోసలనగరం, నిండ్ర, తిరుపతి డివిజన్‌కు సంబంధించి సత్యవేడు, పులిచర్ల పీఏసీఎస్‌లకు వచ్చే నెల 10న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. జిల్లా సహకార శాఖాధికారి వనజ నుంచి సంబంధిత సీఈవోలకు గత శుక్రవారం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలందిన విషయం తెలిసిందే. ఇది రెండోసారి గత ఏడాది ఈ ఎన్నికలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉన్న పీఏసీఎస్‌లలో గెలుపు ఆ పార్టీదేనని భావించిన నాయకులు ఎన్నికలు జరగనీయకుండా ఎత్తుగడ వేశారు. జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో ఈ ఎన్నికలను వాయిదా వేయించారు. దీనికి సంబంధించి అప్పటి సహకార శాఖ మంత్రి క్రిష్ణారెడ్డి పేరు మీదుగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు నుంచి ఈ ఆదేశాలందాయి. తిరిగి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ పాలనలో ఈ తొమ్మిది పీఎస్సీఎస్లలో విజయం దక్కదనే మరోసారి వాయిదా పడింది. టీడీపీకి ఎదురుగాలి తప్పదనే గతంలో ఎన్నికలకు సంబంధించి సభ్యత్వ నమోదు ప్రక్రియ జరిగింది. ఈ తొమ్మిది సహకార సంఘాలకు సంబంధించి సుమారు 29 వేల మంది సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు కాబట్టి కొత్త సభ్యత్వాలకు తావులేనట్టేనని అధికారులు చెప్పారు. దీంతో గతంలో ఓటర్లుగా ఉన్న వారితోనే ఈ ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ భావించింది. ఈ మధ్యనే ఈ ఎన్నికలు నిర్వహించాల్సిన మండలాల్లో ఆ పార్టీ ఇన్‌చార్జ్‌ల ద్వారా కార్యకర్తల సమావేశం సైతం నిర్వహించారు. ఇందులో ఖచ్చితంగా టీడీపీ గెలవదని అర్థమైంది. ఆ మేరకు నివేదికను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకె ళ్లినట్టు సమాచారం. దీంతో పాటు రుణమాఫీ జరగక పోవడంతో రైతుల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఫలితంగానే ఎన్నికలను వాయిదా వేయించినట్టు తెలుస్తోంది. ఇక రైతన్నలకు కష్టాలే.. తొమ్మిది పీఏసీఎస్‌ల పరిధిలోని రైతులకు కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే కార్యవర్గాలు లేక సహకార సంఘాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇక పర్సన్ ఇన్‌చార్జ్‌లతోనే సొసైటీల పాలన సాగడంతో రైతులకు మేలు చేకూరదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
రచ్చరచ్చ
గందరగోళంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమావేశం ఆలయాధికారుల తీరుపై మండిపడ్డ భక్తులు నాలుగ మాడ వీధుల్లో రాజకీయ నేతల ఫ్లెక్సీలేంటి? గోడు వెల్లబోసుకున్న ‘గాలిగోపురం’ బాధితులు శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్ : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల విషయమై శ్రీకాళహస్తిలో శనివారం నిర్వహించిన సమావేశం రచ్చరచ్చగా మారింది. స్థానిక ఎమ్మెల్యే సాక్షిగా ఆలయాధికారుల తీరును స్థానికభక్తులు దుయ్యబట్టారు. ఎందరు సర్దిజెప్పినా భక్తులు శాంతించ లేదు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శ్రీకాళహస్తీశ్వరాలయంలోని ఈవో చాంబర్లో అధికారులతో శనివారం సమీక్షించారు. ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనదయాళ్ అనే భక్తుడు మాట్లాడుతూ భక్తుల సౌకర్యాలను అధికారులు పూర్తిగా వదిలి పెట్టారన్నారు. ధర్మపరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చక్రపాణి జోక్యం చేసుకుంటూ భక్తుల నుంచి దోచుకున్న డబ్బు పంపిణీ చేసుకోవడంలోనే ఆలయాధికారులు శ్రద్ధ చూపుతున్నారని ఆరోపిం చారు. 1500 రూపాయల రాహుకేతు పూజలు చేస్తున్న చోట భక్తుల నుంచి అర్చకులు దారుణంగా డబ్బులు గుంజుతున్నారన్నారు. అక్కడ ఏడాదిగా సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసినవూట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. బీజేపీ నాయకుడు కిట్టు జోక్యం చేసుకుని ఆలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపైనే తొలుత చర్చించాలన్నారు. హిందూ దేవాలయాల ధర్మపరిరక్షణ సమితి జిల్లా కార్యదర్శి అమర్ మాట్లాడుతూ ఆలయాధికారులు కమీషన్లకు కక్కుర్తిపడి భక్తులకు ఉపయోగం లేని పనులు చేస్తున్నారన్నారు. డాక్టర్ ప్రమీలమ్మ మాట్లాడుతూ నాలుగు మాడవీధుల్లోని మండపాల వద్ద దేవుళ్లు కనిపించకుండా రాజకీయ నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయుడం సిగ్గు చేటన్నారు. ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ అజయ్కిషోర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. వివాదం ఏమైనా ఉంటే తమ దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అభిషేకం పేర్కొన్నారు. డీసీసీ ముఖ్య కార్యదర్శి అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సమయం వుుంచుకొస్తున్నా ఆలయూధికారులు నివ్ముకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కండ్రిగ ఉమ మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు స్వామి, అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రత్యేక క్యూ ఏర్పాటు చేయాలని కోరారు. ఇళ్ల స్థలాలేవీ గాలిగోపురం కూలిన సమయంలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇంతవరకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని కొందరు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. నాలుగేళ్లుగా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయూధికారులు, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భక్తవత్సలనాయుుడు నచ్చజెప్పినా పరిస్థితి అదుపులోకి రాలేదు. బాధితులకు డీఎస్పీ నచ్చజెప్పి పంపారు. అన్ని ఏర్పాట్లూ చేస్తాం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల విజయవంతానికి అన్ని ఏర్పాట్లూ చేస్తామని ఈవో పూర్ణచంద్రరావు తెలిపారు. డీఎస్పీ అభిషేకం మాట్లాడుతూ ఏపీసీడ్స, ఎంపీడీవో, వ్యవసాయ మార్కెట్‌కమిటీ ఆవరణలో భక్తుల వాహనాలను పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్సవాల సమయంలో గాలిగోపురం పనులు నిలుపుదల చేస్తామని, ఆ మార్గంలో వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. స్వర్ణముఖి నదిలో తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ఈవో సుముఖత వ్యక్తం చేశారు. తహశీల్దార్ వీర స్వామి మాట్లాడుతూ బాల్య వివాహాలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో విద్యుత్, అగ్నిమాపక, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.