breaking news
Gollabama
-
గ్లోబల్ స్టార్ గొల్లభామ..!
సిద్ధిపేటలో పుట్టిన వందల ఏళ్ల నాటి సంప్రదాయ స్వరూపం గొల్లభామ. ఈ బొమ్మలను చీరలపై ముద్రించడం దాదాపు వందేళ్ల క్రితం ప్రారంభమైంది అంటారు. చాలా కాలం పాటు అందరూ మర్చిపోయిన గొల్లభామ చీర, తిరిగి అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌గా మారింది. పలువురు సిటీడిజైనర్లు సైతం పాత గొల్లభామకు కొత్త వైభవాన్ని అందించే పనిలో పడ్డారు. పాత డిజైన్‌కు కొత్త వెలుగులు అద్దడంలో ప్రధాన పాత్ర పోషించారు కర్ణాటకకు చెందిన సునంద. నగరంలోని కొంపల్లిలో నివసించే సునంద అలనాటి గొల్లభామకు సరికొత్త రూపును జతచేసి అందరి దృష్టీ మనవైపు మళ్లేలా చేశారు. ఆమె ‘సాక్షి’తో పంచుకున్న రివైన్డ్ గొల్లభామ అనుభవాలు ఆమె మాటల్లోనే.. దుబ్బాక క్లస్టర్ డిజైనర్‌గా పనిచేసినప్పుడు ఈ డిజైన్‌ను తొలిసారి చూశా. అనంతరం హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ విత్ నేచురల్ డైస్, అండ్ నానో టెక్నాలజీ అంశంపై పీహెచ్డీ కంప్లీట్ అయ్యాక మరోసారి సిద్ధిపేటకు వెళ్లి గొల్లభామ ఫీచర్స్ పరిశీలించాను. చాలా లోకల్ ఫీల్ ఉంది.. ఫేస్‌లో, షేప్‌లో స్పష్టత లేదని, మంచి ఫేస్ లుక్ జత చేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నా. పాతికేళ్ల క్రితం గొల్లభామను నేసి ఇప్పుడు పక్కన పెట్టేసిన సత్య, కైలాసాన్ని కలిసి నాకు కావాల్సినట్టు చీరలు నేసి ఇస్తారా అని అడిగాను.. కష్టం మేడమ్.. బాగా టైమ్ పడుతుంది అన్నారు. చీర మొత్తం అక్కర్లేదు.. క్లాత్ మీద బొమ్మ నేసి ఇస్తే చాలు అంటే.. అతి కష్టం మీద ఒప్పుకున్నారు.. అలా రివైవ్డ్ గొల్లభామ పునర్జన్మించి.. కొత్త విజయాలు అందుకుంది.జియోగ్రాఫికల్ ఇండికేషన్..అలా రివైవ్డ్ గొల్లభామ పేరిట నేను ఇచ్చిన డిజైన్స్‌కి జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచి్చంది. తద్వారా గొల్లభామకు సిద్ధిపేట వీవర్స్ మాత్రమే హక్కుదారులయ్యారు. ప్రపంచం మొత్తం మీద ఇంకెవ్వరూ దీన్ని కాపీ కొట్టలేరన్నమాట. ఆదర్శ్ సొసైటీ ఆధ్వర్యంలో నేచురల్ డై తో గొల్లభామకు ప్రాణం పోసి పలుమార్లు ఎగ్జిబిషన్స్ నిర్వహించాం. అప్పట్లో సినీనటి చేనేతల బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సమంత ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో కూడా నిర్వహించాం. అలా మన గొల్లభామకు స్వల్పకాలంలోనే దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం లభించింది. పాత కాలంలో గొల్లభామ చీరలు మాత్రమే లభించేవి. అయితే ప్రస్తుతం డ్రెస్ మెటీరియల్స్, దుపట్టా, పల్లులో సైతం గొల్లభామను జత చేయడం ప్రారంభించాం. తెలంగాణ రాష్ట్ర గొల్లభామను గ్లోబల్ మార్కెట్‌కి తీసుకెళ్లాలనే ఆశ ఫలిస్తోంది.కళాకారుల నైపుణ్యం.. సిద్ధిపేట కళాకారుల నైపుణ్యానికి అద్ధం పట్టే గొల్లభామ చీరలను డిజైనర్ అర్చన కొచ్చర్ మిస్ వరల్డ్ 2025 వేదికపై ప్రదర్శించారు. రీసెర్చ్ గేట్ నుంచి 2025 పరిశోధనా పత్రం గొల్లభామ క్రాఫ్ట్‌ను డిజిటల్‌గా సంరక్షించడం, దాని చుట్టూ ఆర్థిక వ్యవస్థ సృష్టించడానికి ఉద్దేశించింది. 2022 యునెస్కో నివేదికలో గొల్లభామ చీరలను ‘భారత దేశానికి ఐకానిక్ క్రాఫ్ట్’గా చేర్చారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వస్త్ర శాఖ ద్వారా చీరలను ప్రోత్సహిస్తోంది. స్టాల్స్ ఏర్పాటు చేయడం గోల్కొండ హస్తకళల షోరూమ్ వంటి వాటిలో అందుబాటులోకి తేవడం చేస్తోంది. గొల్లభామ చీరలకు 2012లో జీఐ ట్యాగ్ లభించింది. సిద్ధిపేట కేంద్రంగా.. కోలాటం, బతుకమ్మ డిజైన్లు కూడా అందుబాటులో ఉన్నా.. గొల్లభామ చీర తెలంగాణకే ప్రత్యేకం. ఈ చీరలు ధర కనీసం రూ.4వేల నుంచి వివిధ ధరల్లో లభిస్తున్నాయి. సిద్ధిపేటలో గొల్లభామ చీరలు నేయగలిగిన నేతన్నలు ప్రస్తుతం ఓ 20 మంది వరకూ ఉన్నారని అంచనా. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న లేపాక్షి భవన్ (ప్రస్తుతం గోల్కండ భవన్)లో అందుబాటులో ఉన్నాయిమా జీవితాలను మార్చింది.. తెలంగాణ సంప్రదాయ చేనేత కళాకారులుగా తరాల తరబడి ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం. ఆ మధ్య కాలంలో కనుమరుగైపోయిన గొల్లభామ చీరలకు గత కొంతకాలంగా డిమాండ్ పుంజుకుంది. దీనికి పాత డిజైన్‌లో మార్పు చేర్పులు కూడా కారణం. ఇటీవల కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారంతో పాటు ప్రభుత్వం నుంచి మాకు తగినంత ప్రోత్సాహం కూడా లభిస్తోంది. ఈ సంప్రదాయ కళలకు యువత ఆదరణ చూపించడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. – కైలాసం, చేనేత కళాకారుడుఉపాధికి ఊతం అందించింది.. సిద్ధిపేటలో గొల్లభామకు పూర్వవైభవం రావడంతో పాటు ఆ చేనేత కళాకారులకు పలువురు దీని ద్వారా ఉపాధి పొందడం ఆనందం కలిగిస్తోంది. చీర తయారు చేసే కైలాసానికి, దుపట్టా చేసే సత్యకు అవార్డు రావడంతో పాటు వారి ఆదాయం పెరగడం ఎంతో సంతృప్తినిస్తోంది. గత ఆగస్టులో కర్ణాటకకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు ఆదర్శ్ సొసైటీని సందర్శించారు. రివైవ్డ్ గొల్లభామ వెర్షన్‌ను చూసి ప్రశంసించారు. యువత కూడా మన సంప్రదాయ చేనేత పట్ల మరింత అవగాహన పెంచుకోవాలని కోరుతున్నా. – సునంద, ,టెక్స్టైల్స్, ఫ్యాషన్ డిజైనర్ (చదవండి: ‘రీ–స్టైల్ ఫ్యాషన్ ’ సందేశంతో కూడిన గ్లామర్..!) -
గొల్ల భామలు
తరతరాలుగా వస్తున్న ఒక అందమైన, అద్భుతమైన సంప్రదాయం గొల్లభామ చీరలు.నేసినంతసేపు చేతులు నాట్యమాడతాయితొడిగినంతనే మేను నాట్యం చేస్తుంది.సంప్రదాయం పిల్లలకు అలవర్చాలి. అప్పుడే ఇంకో వంద తరాలు ఆ నేత నిలుస్తుంది.అందుకే గొల్లభామ చీరలతో పిల్ల భామలకు సొబగులు అద్దుతున్నారు డిజైనర్లు. ►హాఫ్‌వైట్, ఆరెంజ్ .. రెండు కాంట్రాస్ట్ కలర్ గొల్లభామ చీరలతో లాంగ్ గౌన్‌గా తీర్చిదిద్దారు. లాంగ్ స్లీవ్స్‌కి పల్లూ పార్ట్‌తో డిజైన్ చేశారు. ►ఈ డ్రెస్లోనూ రెండు కాంట్రాస్ట్ చీరలను ఎంపిక చేసుకున్నారు. బెల్ ఫ్రిల్స్ లాంగ్ స్లీవ్స్‌ని ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. ►గొల్లభామ పంచెను ధోతీలా కుట్టి, దాని మీదకు కాటన్ బ్లేజర్‌ను జత చేశారు. కాంట్రాస్ట్ కలర్ దుపట్టాను వాడారు. దీంతో ఇండో వెస్ట్రన్ స్టైల్ లుక్ వచ్చింది. ► ఒకే రంగు గొల్లభామ చీరతో డిజైన్ చేసిన వెస్ట్రన్ డ్రెస్ ఇది. పల్లూభాగంతో డిజైన్ చేసిన బెల్ స్లీవ్స్‌కి , కాలర్ నెక్ ఈ డ్రెస్‌కు ప్రధాన ఆకర్షణ. ► పసుపు రంగు గొల్లభామ చీరతో రూపొందించిన పార్టీవేర్ డ్రెస్ ఇది. కొంగులో కొంత భాగం ఛాతీకి, మిగతాది చేతులకు డిజైన్ చేశారు. ► హాఫ్ వైట్, రెడ్ కలర్ రెండు చీరలను ఉపయోగించి కాంట్రాస్ట్ డిజైన్‌తో లేయర్డ్ గౌన్‌గా తీర్చిదిద్దారు. మీరే డిజైనర్ సిల్క్ థ్రెడ్ వడ్డాణం తయారీ 1. బంగారు రంగు దారాన్ని పొడవాటి స్కేల్‌కి నిలువుగా కనీసం 50–60 వరసలు చుట్టాక స్కేల్ నుంచి దారం తీసి, చివరన ప్లకర్ లేదా కత్తెరతో కట్ చేసి, గ్లూ పెట్టి దారం పోగులు విడివడకుండా గ్లూతో అతికించాలి. 2. గ్లూతో అతికించిన దారం పోగుల చివరి భాగాన్ని హెయిర్ క్లిప్‌కి సెట్ చేసి, మూడు పాయలు తీసి జడలా అల్లాలి. చివరన మళ్లీ గ్లూతో విడివడకుండా అతికించాలి. ఇలాంటివి దారాలతో జడలుగా అల్లిన నాలుగు చైన్లను సిద్ధం చేసుకోవాలి. 3. కాగితం చార్ట్ మీద గ్లూ రాసి దాని మీద పెద్ద ఎర్రటి కుందన్ పెట్టి సెట్ చేయాలి. దాని చుట్టూ గోల్డెన్ బాల్ చెయిన్ చుట్టి చివర్లను పక్కర్తో కట్ చేయాలి. తర్వాత మళ్లీ గ్లూ పెట్టి మరో వరుస రెడ్ బాల్ చెయిన్, రాళ్ల చెయిన్, గ్రీన్ బాల్చెయిన్, చివరగా ముత్యాల చెయిన్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి గ్లూ పెడుతూ, చుట్టాలి. ఇది గుండ్రటి షేప్ వస్తుంది. 4. చుట్టూ అదనంగా ఉన్న చార్ట్‌ని ప్లకర్‌తో కట్ చేయాలి. ఇలా గుండ్రటి డిజైనర్ షేప్‌ను తయారుచేసుకోవాలి. 5. సిద్ధం చేసుకున్న థ్రెడ్ చెయిన్‌ని మధ్యకు మడిచి, మార్క్ చేసుకొని, గ్లూ పెట్టి, డిజైనర్ బిళ్లను సెట్ చేయాలి. 6. దీని పక్కనే చిన్నకుందన్ని గ్లూతో అతికించి, దాని చుట్టూ గోల్డ్, స్టోన్, రెడ్ బాల్ చెయిన్స్‌ని అతికిస్తూ, చివర్లను ప్లకర్‌తో కట్ చే యాలి. 7. రెండువైపులా థ్రెడ్ చెయిన్స్‌ని గ్లూతో అతికించాలి. తర్వాత రెడ్, గ్రీన్, స్టోన్ బాల్ చెయిన్స్‌ని ఆ చెయిన్ మీద పొడవాటి లైన్‌గా అతికించాలి. 8. చివరలను కత్తిరించి, గ్లూతో అతికించాలి. 9. గోల్డ్ బాల్ చెయిన్‌ని చిన్న చిన్న పీసులుగా ప్లకర్‌తో కట్ చేసి, బెల్ట్‌కి వెనకాల తోరణం మాదిరి గ్లూతో అతికించాలి. 10. తెల్లటి పూసలు లేదా ముత్యాలు ఉన్న పిన్ బాల్స్‌ని బెల్ట్‌కి గుచ్చాలి. అవి ఊడకుండా మధ్య భాగంలో గ్లూతో అతికించాలి. 11. గోల్డ్ చెయిన్ బాల్ని తోరణంలా అతికించాలి. 12. చివరలు హుక్స్ ఉన్న చెయిన్స్‌ని అతికించాలి. నిర్వహణ: ఎన్.ఆర్. -
ఫుల్ క్లారిటీ...
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌ను కథానాయకునిగా తెరపై చూడాలని మెగా అభిమానులందరూ ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఫలించే సమయం ఆసన్నమైంది. ఇంకొన్ని రోజుల్లోనే వరుణ్ తొలి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అతని తొలి సినిమా షూటింగ్ ఆ మధ్య మొదలైన విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాత. లియో ప్రొడక్షన్స్ పతాకంపై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోంది. ఈ నెలాఖరుకి టాకీ పూర్తవుతుందని, మూడు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉంటాయని యూనిట్ సభ్యుల సమాచారం. గోదావరి జిల్లాల్లోని భీమవరం, అమలాపురం... తదితర అందమైన ప్రదేశాల్లో 35 రోజుల పాటు తీసిన సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట. కుర్రాళ్ల భావోద్వేగాలు, వాళ్లకుండాల్సిన ఫుల్ క్లారిటీ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుంటే... ఈ సినిమాకు ‘గొల్లభామ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నిజానికి ఈ సినిమాకు ఇప్పటివరకూ టైటిల్‌ని ఖరారు చేయలేదన్నది విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రావురమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: మణికందన్.


