breaking news
gold stocks
-
ఇళ్లలోని బంగారాన్ని బయటకు తీయించాలి!!
దేశంలోని ఇళ్లు, దేవాలయాల్లో నిరుపయోగంగా పడి ఉన్న భారీ బంగారు నిల్వలను ఆర్థిక సాధనాలుగా (Financial Assets) మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు పి.పి. చౌదరి పేర్కొన్నారు. అసోచామ్ (ASSOCHAM) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బంగారం 'ఆర్థికీకరణ' (Financialization) ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, తద్వారా కరెంట్ ఖాతా లోటు (CAD)పై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రరత్నాలు, ఆభరణాల రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉందని చౌదరి గుర్తుచేశారు. దేశ మొత్తం సరుకుల ఎగుమతుల్లో ఈ రంగం వాటా 15 శాతం ఉందన్నారు. దాదాపు 50 లక్షల మందికిపైగా ఈ రంగం ఉపాధి కల్పిస్తోందన్నారు.50 వేల టన్నుల బంగారం నిల్వలునేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ మాట్లాడుతూ, భారతీయ ఇళ్లు, దేవాలయాల్లో కలిపి సుమారు 25,000 నుండి 50,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా అని తెలిపారు. "మన దగ్గర పటిష్టమైన ప్లాట్ఫాం, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయి. అయితే ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదుల (EGR) వినియోగాన్ని పెంచడానికి ఉన్న అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉంది" అని ఆయన పేర్కొన్నారు.అడ్డంకిగా 3% జీఎస్టీభౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, షేర్ల మాదిరిగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో వర్తకం చేసేందుకు ఈజీఆర్ విధానాన్ని సెబీ (SEBI) అందుబాటులోకి తెచ్చింది. అయితే, బంగారాన్ని సరెండర్ చేసే సమయంలో విధిస్తున్న 3 శాతం జీఎస్టీ (GST) దీని విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారిందని కృష్ణన్ వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి ఎన్ఎస్ఈ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక శ్వేతపత్రాన్ని సమర్పించిందని వెల్లడించారు.పెరుగుతున్న డిమాండ్.. పుంజుకుంటున్న గోల్డ్ లోన్స్గత రెండేళ్లలో బంగారం ధరలు 30 శాతం పెరిగినప్పటికీ, ఆభరణాలకు డిమాండ్ తగ్గలేదని ఇక్రా (ICRA) ప్రతినిధి జితిన్ మక్కర్ తెలిపారు. ప్రధాన జ్యువెలరీ రిటైలర్లు 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో తమ స్టోర్ నెట్ వర్క్ ను 20 శాతం మేర పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో గతంలో రూ. 1 లక్ష కోట్లు ఉండగా, ఇప్పుడు రూ. 4 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.తప్పనిసరి హాల్మార్కింగ్, 'ఇండియన్ గుడ్ డెలివరీ స్టాండర్డ్స్' వంటి నిబంధనలు దేశీయ బంగారంపై నమ్మకాన్ని పెంచాయని, ఇది దిగుమతుల నియంత్రణకు దోహదపడుతుందని నిపుణులు విశ్లేషించారు. -
ఇంతకు మించి బంగారం ఇంట్లో ఉంటే చిక్కులు తప్పవు
-
బంగార నిల్వల వివరాలివ్వండి:ఆర్ బీఐ
తిరువేండ్రం: రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ఆర్ బీఐ తన చర్యలను ముమ్మరం చేస్తోంది. గతంలో బంగారంపై పన్ను శాతాన్ని పెంచి బంగారు కొనుగోళ్లకు కొంత వరకూ అడ్డుకట్టవేయ కల్గిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా బంగార నిల్వలపై ఆరాలు తీస్తోంది. దేవస్థానాల్లో ఏ మేరకు నిల్వలున్నాయన్నవివరాలను సేకరిస్తూ తమ కార్యచరణను ముమ్మరం చేసింది. ఈ మేరకు కేరళ రాష్ట్రంలోని గురవాయర్ దేవస్థానం బోర్డుకు ఓ లేఖను రాసింది. గురువాయర్ ఆలయంలో ఎంత వరకూ బంగారం ఉందన్న వివరాలను తమకు తెలియజేయాలని ఓ లేఖను సంధించింది. దేవస్థాన బంగార నిల్వలపై వివరాలను తమకు అందజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరిన విషయాన్ని ఆ దేవస్థాన బోర్డు ఉన్నతాధికారి ఐఎన్ఎస్ కు వెల్లడించారు. ఈ అంశంపై దేవస్థాన కమిటీ మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటుందని, అందుచేత ఆ లేఖను కమిటీకి అందజేశామన్నారు.


