breaking news
Gold Drops
-
భారీగా తగ్గిన బంగారం రూ.1.49 లక్షలకే తులం.!
-
పతనమౌతున్న పసిడి...డాలర్ జూమ్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర మరోసారి ఢమాల్ అంది. సోమవారం 1శాతం పతనమైన పుత్తడి 5 నెలల కనిష్టాన్ని తాకింది. డాలర్ విలువ బాగా పుంజుకోవడం, డిశెంబర్ నెలలో ఫెడ్ వడ్డన తప్పదన్న అంచనాలతో పసిడి భారీ పతనాన్ని నమోదుచేస్తోంది. రాయిటర్స్ టెక్నికల్ అనలిస్ట్ వాంగ్ టావో ప్రకారం స్పాట్ బంగారం ఔన్స్(31.1 గ్రాములు) 0.6 శాతం క్షీణించి 1218.90 వద్ద వుంది. జూన్ 3 తర్వాత ఇదే కనిష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్యూచర్స్ లో 0.5 శాతం క్షీణించిణ ఔన్స్ బంగారం ధర 1218 డాలర్ల వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పది గ్రా. పుత్తడి 30 వేల దిగువన ట్రేడవుతోంది. రూ. 556 పతనమై రూ.29,344 వద్ద ఉంది. పెరుగుతున్న డాలర్ విలువ బంగారం ధరలపై మరింత ఒత్తిడిని పెంచనుందని సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు జెఫ్రీ హాలే అంచనా వేశారు. అలాగే 1204-1210 డాలర్ల స్థాయివద్ద గట్టి మద్దుతులభించే అవకాశం ఉందంటున్నారు. ఇదే బాటలో వెండి కూడా క్షీణతను నమోదు చేస్తోంది. ఔన్స్ 0.0.7శాతం క్షీణించి శాతం నష్టంతో 17.22 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్లాటినం స్థిరంగా ఉండగా, పల్లాడియం 0.2 పతనమైంది. అంతర్జాతీయంగా నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో శుక్రవారం 3శాతం పతనమైన బంగారం ధరలు 10 నెలల కనిష్టాన్ని తాకాయి. అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎంపికైన రిపబ్లికన్ నేత ట్రంప్ చేపట్టనున్న వినియోగ వ్యయ ప్రణాళికలు, పన్నుల్లో కోత వంటి అంశాలు ద్రవ్యోల్బణానికి, ఆర్థికవృద్ధికి ఊతమిస్తాయని, ఇది ఫెడ్ వడ్డీ రేట్ల పెంపునకు దారితీస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో బంగారంలో అమ్మకాలు చోటుచేసుకుంటున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు సోమవారం డాలర్ విలువ బాగా పుంజుకుంది. తాజాగా తొమ్మిది నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. కాగా అమెరికా ఆర్ధిక వృద్ధి అవకాశాలు తగినంత బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో వడ్డీ రేట్టు క్రమంగా పెరిగే అవకాశం ఉందని ఫెడ్ వైస్ చైర్ స్టాన్లీ ఫిషర్ శుక్రవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.


