breaking news
	
		
	
  glass factory
- 
  
    
                
      గ్లాస్ పరిశ్రమలో ఘోర ప్రమాదం
 - 
      
                    
ఆయుధాలతో బెదిరించి భారీ చోరీ

 ఆగ్రా:
 నలుగురు దుండగులు కారును అడ్డగించి వారి వద్ద ఉన్న రూ.46 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటన ఫిరోజాబాద్ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నాం చోటుచేసుకుంది. ఎస్పీ ప్రీతేంద్ర సింగ్ కథనం ప్రకారం.. ఆగ్రాలోని బ్యాంకులో నగదు డ్రా చేసుకుని ఫిరోజాబాద్ లోని గ్లాస్ ఫ్యాక్టరీకి వెళ్తుండగా కొందరు సాయుధులు తమను అడ్డగించారని బాధితులు తెలిపారు. జాతీయ రహదారిపై వెళ్తుండగా మరో వాహనం తమ స్విఫ్ట్ కారును ఓవర్ టెక్ చేసిందని, అందులో నుంచి దిగిన కొందరు దుండుగులు తమ కారుని నిలిపివేశారని చెప్పారు. అనంతరం ఆయుధాలతో తమను బెదిరించి కారులో ఉన్న నగదు బ్యాగుతో అక్కడి నుంచి పరారయ్యారని బాధితులు ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ వివరించారు. 


