girl student suicide
-
ఐ విల్ మిస్ యూ.. మై బ్యాడ్‌లక్
నారాయణ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య ఏపీలోని రాజమండ్రిలో ఘటన చెట్టుకు ఉరివేసుకొని మృతి కాలేజీలో ఒత్తిడే కారణమంటున్న తల్లి రాజమండ్రి క్రైం: ఆంధ్రప్రదేశ్‌లో నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న దాసరి నందిని(17) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నందిని స్వస్థలం ఒంగోలు. తండ్రి ప్రసాద్ గతంలోనే మృతి చెందాడు. దీంతో నందినిని, ఆమె చెల్లెలిని తీసుకొని వారి తల్లి నిర్మల తన పుట్టిల్లయిన రాజమండ్రికి వచ్చేసింది. నిర్మల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. నందిని స్థానికంగా ఓ బాలికల హాస్టల్లో ఉంటూ దానవాయిపేటలోని నారాయణ కాలేజీలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇటీవల జరిగిన త్రైమాసిక పరీక్షలు బాగా రాయలేదని స్నేహితుల వద్ద బాధపడింది. సోమవారం రాత్రి హాస్టల్ ఎదుట ఉన్న రావిచెట్టుకు చున్నీతో ఉరి వేసుకొంది. మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించా రు. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాలేజీలో ఒత్తిడి తాళలేక ఆత్మహత్య: తల్లి నిర్మల ఆదివారం నందినిని బయటకు తీసుకెళ్లింది. ఆ సందర్భంగా నందిని తన గోడు వెళ్లబోసుకుంది. నారాయణ కాలేజీలో ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని, ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకూ 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తల్లికి చెప్పింది. కాలేజీలో ఒత్తిడికి తాళలేక తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని నిర్మల రోదించింది. ఐ మిస్ యూ.. నందినికి సహ విద్యార్థినులు వనం దుర్గాభవాని, పోలిపల్లి దేవిక ప్రాణ స్నేహితులు. వారితో నాలుగు రోజుల క్రితం చిన్నపాటి స్పర్థ ఏర్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు వారినుద్దేశించి నందిని తన నోట్‌బుక్‌లో ఒక లేఖ రాసింది. ‘నాతో మాట్లాడరనుకున్నాను. మాట్లాడుతున్నందుకు సంతోషం. వచ్చే జన్మలో కూడా మీరే నా స్నేహితులుగా పుట్టాలి. ఐ విల్ మిస్ యూ.. మై బ్యాడ్‌లక్’ అని అందులో రాసింది. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
చెట్టుకు ఉరేసుకుని నారాయణ విద్యార్థిని ఆత్మహత్య
-
తక్కువ మార్కులు వచ్చాయని... ఆత్మహత్య
గన్నవరం (హైదరాబాద్) : గణితంలో తక్కువ మార్కులు వచ్చాయని మనస్థాపానికి గురైన ఓ పదో తరగతి విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కృష్ణాజిల్లా గన్నవరం మండలంలోని దావాజిగూడెం సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం జరిగింది. ఆగిరిపల్లి మండలం కౌతవరప్పాడు గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికుడు మట్టా కృష్ణారావు, కృష్ణవేణి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆర్థికలేమి కారణంగా పెద్ద కుమార్తె సురేఖ (15), రెండో కుమార్తె ప్రియాంక(13)లను దావాజిగూడెంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో చేర్చారు. హాస్టల్ సమీపంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సురేఖ పదో తరగతి, ప్రియాంక తొమ్మిదో తరగతి చదువుతున్నారు. పాఠశాలలో జరిగిన ప్రీ-పబ్లిక్ పరీక్షల్లో గణితంలో సురేఖకు 50 మార్కులకు గాను ఏడు మార్కులు మాత్రమే వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చిన మిగిలిన విద్యార్థులతో పాటు సురేఖను కూడా ఉపాధ్యాయులు మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన సురేఖ మధ్యాహ్నం స్నేహితురాలితో పాటు హాస్టల్‌కు వెళ్లి అనారోగ్యంగా ఉందనే కారణంతో తిరిగి పాఠశాలకు వెళ్లలేదు. కొద్దిసేపటి తర్వాత గణితం-2 పరీక్షకు రాకపోవడంతో ఉపాధ్యాయులు సురేఖను తీసుకువచ్చేందుకు ఆమె సోదరి ప్రియాంకను హాస్టల్‌కు పంపించారు. ఆమె గది తలుపు వేసి ఉండడంతో అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది స్థానికుల సహకారంతో తలుపులు బలవంతంగా తెరిచి చూడగా సురేఖ గదిలోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఉంది. కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకున్న సీఐ అహ్మద్ అలీ, ఎసై్స సత్యశ్రీనివాస్ అక్కడికి చేరుకుని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.