breaking news
ghmc labour venkataih
-
నగరంలో ఓవర్ నైట్ సెలబ్రిటీ వెంకటయ్య
రాజేంద్రనగర్: జాతీయ స్థాయిలో ఉత్తమ పారిశుద్ధ్య కార్మికుడిగా ఎంపికైన రాజేంద్రనగర్ గగన్‌పహాడ్‌కు చెందిన వెంకటయ్యకు రాష్ట్ర పురపాలక, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.1,11,116 చెక్కును అందజేశారు. దక్షిణ మండల జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి రూ.లక్ష, ఖర్చులకు మరో రూ.10 వేల చెక్కులను గురువారం అందించారు. శుక్రవారం సాయంత్రం వెంకటయ్య ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు రాజేంద్రనగర్ సర్కిల్ శానిటరీ సూపర్వైజర్ ఆంజనేయులు వెళ్తున్నారు. విమాన టిక్కెట్లను గురువారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి వారికి అందజేశారు. తాను విమానంలో ప్రయాణిస్తానని కలలో కూడా అనుకోలేదని వెంకటయ్య అన్నారు. అభినందనలు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ సర్కిల్ కార్యాలయంలో గురువారం వెంకటయ్యను సత్కరించారు. ఢిల్లీ వెళ్లేందుకు ప్రయాణ ఖర్చుల కోసం రూ.25 వేలు అందజేశారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆయనను అభినందించారు. అంతా కలగా ఉంది.. గత మూడు రోజులుగా తనకు అంతా కలగా ఉందని వెంకటయ్య ‘సాక్షి’తో చెప్పారు. అందరూ తనను అభినందిస్తున్నారని... టీవీలు, పేపర్లలో తన ఫొటో కనిపిస్తోందని..కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వారు, బంధువులు అభినందిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. -
నగరంలో ఓవర్ నైట్ సెలబ్రిటీ వెంకటయ్య
-
నగరానికే హీరో ఈ వెంకటయ్య
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుడు వెంకటయ్యకు జాతీయస్థాయిలో లభించిన అత్యున్నత పురస్కారం జీహెచ్ఎంసీ కార్మికులందరికీ వర్తిస్తుందని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్లో పనిచేస్తున్న వెంకటయ్యను బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వెంకటయ్యను ఆదర్శంగా తీసుకుని అంకితభావంతో విధుల్ని నిర్వహించాలని కోరారు. పారిశుధ్య కార్మికులు,సిబ్బందిని ప్రోత్సహించేందుకు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా అవార్డులు అందజేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ పురస్కారం హైదరాబాద్ నగరానికి లభించిన పురస్కారంగా పరిగణిస్తున్నామన్నారు. వెంకటయ్యకు డ్యూక్ బిస్కెట్ కంపెనీ యాజమాన్యం రూ. 25వేల నగదును అందజేయగా, అవార్డు అందుకునేందుకు న్యూఢిల్లీ వెళ్లేందుకు మైలార్దేవులపల్లి కార్పొరేటర్ విమాన ప్రయాణ చార్జీలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వెంకటయ్యను శాలువ, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు రామకృష్ణారావు, కెనెడి, శంకరయ్య, భాస్కరాచారి, సౌత్‌జోన్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ కార్మికులను సన్మానించండి ప్రతినెల మొదటి శనివారం నిర్వహిస్తున్న గుడ్ ప్రాక్టీసెస్డేలో భాగంగా క్షేత్రస్థాయిలో బాగా పనిచేసే పారిశుధ్య కార్మికులు, ఎస్ఎఫ్ఏలు, ఇతర ఉద్యోగులను గుర్తించి సన్మానించడం ద్వారా వారిని ప్రోత్సహించాలని కమిషనర్ జనార్దన్‌రెడ్డి జోనల్, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. పారిశుధ్య కార్యక్రమాల అమలుపై బుధవారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆగస్టు 15 లోగా సర్కిళ్లలో గరిష్ట స్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు.