breaking news
Ghazni province
-
అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు
We Beat The Americans: Talibans: అమెరికా సైనిక దళాలపై తాలిబాన్లు విజయాన్ని సూచించే అనధికారిక ప్రదర్శనలు అఫ్గనిస్తాన్‌లోని ఘజ్నీ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్నాయి. అమెరికన్లు ప్రపంచంలోనే తమని తాము గొప్ప శక్తిగా చెప్పుకుంటున్నప్పటికీ, మేము అమెరికన్లను ఓడించగలమని అఫ్గన్లు, ప్రపంచం, భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా మేము దీన్ని చూపిస్తున్నామని తాలిబన్ ప్రావిన్షియల్ కల్చర్ చీఫ్ ముల్లా హబీబుల్లా ముజాహిద్ మీడియాకు తెలిపాడు. చారిత్రకంగా అమెరికా సుదీర్ఘ యుద్ధాల్లో సేవలందించిన సైనిక దళాల పేర్లను, వారు ఆక్రమించిన స్థావరాలను కాంక్రీట్ గోడపై క్రమం తప్పకుండా చెక్కడం పరిపాటి. ఐతే అమెరికా సైన్యానికి, తాలిబన్లకు మధ్య జరిగిన ఘర్షణల్లో అవి ధ్వంసమయ్యాయి. అఫ్గన్ నుంచి అమెరికా సైన్యం స్వచ్ఛంద నిష్క్రమణ తర్వాత వారికి సంబంధించిన యుద్ధసామగ్రిని రోడ్లపై ప్రదర్శనకు ఉంచి తాలిబన్లు ప్రగల్భాలు పలకడం గమనార్హం. 19వ శతాబ్దంలో బ్రిటిష్ దళాల ఓటమితో పాటు ప్రస్తుతం మూడు విదేశీ సామ్రాజ్యాలపై అఫ్గనిస్తాన్ విజయం సాధించినట్లు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ విజయం సాధించినందుకు మేము చాలా గర్వపడుతున్నామని తాలిబన్ పోరాట యోధుడు ఓజైర్ (18) తెలిపాడు. ఇక్కడ జన్మించిన అఫ్గన్లు శక్తివంతమైన అమెరికా దేశాన్ని ఓడించగలరని నిరూపించేందుకే వీటిని ప్రదర్శిస్తున్నామన్నాడు. ముల్లా హబీబుల్లా ముజాహిద్ పేలుడు గోడల ముందు నిలబడి యుద్ధాల్లో మరణించిన 20, అంతకంటే ఎక్కువ మంది ముఖ్యమైన కమాండర్లు, జనరల్స్ పేర్లు వీటిమీద ఉన్నాయని ప్రగల్భాలు పలికాడు. మరోవైపు అఫ్గనిస్తాన్ కొత్త పాలకుల సమక్షంలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని, అక్కడి జనాభాలో సగానికి పైగా ప్రజలు ఆకలి బాధను ఎదుర్కొంటున్నట్లు యూఎస్ అభిప్రాయపడింది. చదవండి: Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు.. -
భద్రత దళాలు కాల్పులు: 10 మంది తీవ్రవాదులు మృతి
ఆఫ్ఘానిస్థాన్ గజని ప్రావెన్స్లోని జిలాన్ జిల్లాలో శనివారం భద్రత దళాలు, తీవ్రవాదుల మధ్య హోరా హోరి కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో 10 మంది తీవ్రవాదులు మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రవాదులు గాయపడ్డారు. ఈ మేరకు జిలాన్ జిల్లా గవర్నర్ మహబూబ్ల్లా సబ్వాన్ వెల్లడించారు. కాబూల్‌కు దక్షిణ భాగంలో 125 కిలోమీటర్ల దూరంలో ఆ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. భద్రత దళాలు తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా భద్రత దళాలకు తీవ్రవాదులు ఎదురు పడ్డారు. ఆ క్రమంలో భద్రత దళాలుపై తీవ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దాంతో భద్రత దళాలు వెంటనే అప్రమత్తమై తీవ్రవాదులపై కాల్పులు జరిపారని తెలిపారు.