నిజాం షుగర్ జనరల్ మేనేజర్ ఆత్మహత్య
హైదరాబాద్ : నిజాం షుగర్ జనరల్ మేనేజర్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బషీర్బాగ్లోని నిజాం షుగర్ కార్యాలయంలో ఆయన ఉరి వేసుకుని మృతి చెందారు. ఈ విషయాన్ని గమనించిన కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కాగా శర్మ మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.