breaking news
Geedimetla police station
-
గుడికి వెళ్తున్నానని చెప్పి...
జీడిమెట్ల: గుడికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లింగ్యా నాయక్ వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ కు చెందిన రమేష్ కుమార్తె ప్రియాంక (22) ఇంటి వద్దనే ఉంటోంది. శనివారం ఉదయం గుడికి వెళ్లొస్తానని బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది. యువతి తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సంపులో పడి బాలుడి మృతి
జీడిమెట్ల: ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని చింతల్ చంద్రానగర్లో జరిగింది. వివరాలు.. ఐదేళ్ల నిఖిల్ ఇంటి మందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంపులో పడి మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.