జీడీఎస్ కమిటీ రిపోర్టు ఇవ్వాల్సిందే
- తపాలా ఉద్యోగుల డిమాండ్
అనంతపురం: గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమలేష్ చంద్ర కమిటీ రిపోర్టును వెంటనే తపాలా ఉద్యోగ సంఘాలకు అందజేయాలని తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు క్రిష్ణయ్యయాదవ్ డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు స్థానిక తపాలా కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతనెల నవంబర్ 24న కమలేష్ కమిటీ రిపోర్టు తపాలాశాఖ కార్యదర్శికి అందజేసిందన్నారు. అయితే నెలలోగా తపాలా ఉద్యోగుల కమిటీ రిపోర్టు కాపీని అందజేయాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. కమిటీ ఏమి రిపోర్టు ఇచ్చిందో గ్రామీణ తపాలా ఉద్యోగులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు