breaking news
Gannavaram farmers
-
'టీడీపీ నేతల పొలాల్లోనే సర్వేలు చేస్తున్నారు'
కృష్ణా : పంట నష్టపరిహారంలో అధికారులు వివక్ష చూపుతున్నారని కృష్ణా జిల్లా రైతులు వైఎస్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను బాపులపాడు, గన్నవరం మండలాల రైతులు కలిశారు. మినుము పంటకు తెగుళ్లు సోకి తీవ్రంగా నష్టపోయామని రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. పరిహారం కోసం చేసిన సర్వేలో అధికారులు వివక్ష చూపుతున్నారని...కేవలం అధికార పార్టీ నేతల పొలాల్లోనే సర్వే చేస్తున్నారన్నారు. ఏలూరు కాల్వ కింద శివారు భూములకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు జగన్కు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కారించేందుకు కృషి చేస్తామని వైఎస్ జగన్ రైతులకు హామీ ఇచ్చారు. -
వైఎస్ జగన్ను కలిసిన గన్నవరం రైతులు
విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం గన్నవరం ప్రాంత రైతులు కలిశారు. విమానాశ్రయం విస్తరణ పేరుతో తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ రైతులు ఈ సందర్భంగా వైఎస్ జగన్కు వినతి పత్రం సమర్పించారు. రైతులకు అన్నివిధాలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. కాగా గన్నవరం విమానాశ్రయాన్ని విస్తరించడానికి ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందుకోసం గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి, దావాజిగూడెం, అజ్జంపూడి, బుద్దవరం గ్రామాలలో భూములను సేకరించేందుకు జీవో జారీ చేసింది. అయితే రైతులు మాత్రం తమ వద్ద బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.