వైఎస్ జగన్ను కలిసిన గన్నవరం రైతులు | gannavaram farmers met ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ను కలిసిన గన్నవరం రైతులు

May 1 2015 11:11 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం గన్నవరం ప్రాంత రైతులు కలిశారు. విమానాశ్రయం విస్తరణ పేరుతో తమ ..

విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం గన్నవరం ప్రాంత రైతులు కలిశారు. విమానాశ్రయం విస్తరణ పేరుతో తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ రైతులు ఈ సందర్భంగా వైఎస్ జగన్కు వినతి పత్రం సమర్పించారు. రైతులకు అన్నివిధాలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

కాగా గన్నవరం విమానాశ్రయాన్ని విస్తరించడానికి ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే.  ఇందుకోసం గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి, దావాజిగూడెం, అజ్జంపూడి, బుద్దవరం గ్రామాలలో భూములను సేకరించేందుకు జీవో జారీ చేసింది. అయితే రైతులు మాత్రం తమ వద్ద బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement