breaking news
gandhi babu
-
మామను చంపిన అల్లుడు
మహబూబాబాద్ రూరల్: అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన మామ, బావమరిదిపై ఓ వ్యక్తి దాడి చేయడంతో మామ మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గార్ల మండలం భోజ్య తండాకు చెందిన బానోతు లాలునాయక్ (గార్ల మాజీ ఎంపీపీ), కౌసల్య దంపతుల కుమార్తె శ్రీసాయిలహరిని కురవి మండలం పెద్ద తండాకు చెందిన గుగులోత్ గాంధీబాబుకు ఇచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.51లక్షల నగదు, 30 తులాల బంగారం, సుమారు రూ.5 లక్షల విలువగల ఇంటి సామగ్రిని కట్నంగా అందజేశారు. కొన్ని నెలల నుంచి గాంధీబాబు, అతడి తల్లిదండ్రులు సీతారాం, కవిత, అక్క బానోతు మమత కలిసి శ్రీసాయిలహరిని అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను పుట్టింటికి పంపించారు. దీంతో బాధితురాలు శ్రీసాయిలహరి ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో అత్తింటివారిపై వరకట్నం, గృహహింస వేధింపుల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఏడాది ఆగస్టులో పెద్దమనుషుల సమక్షంలో కుటుంబ తగాదాపై పంచాయితీ నిర్వహించారు. అప్పటినుంచి ఆమెను కొట్టకుండా మంచిగా చూసుకుంటానని చెప్పి గాంధీబాబు భార్యను తమ ఇంటికి తీసుకెళ్లాడు. కానీ అతని ప్రవర్తనలో మార్పురాలేదు. పైగా ఆమె పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని, అదనపు కట్నం తీసుకురాలని వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో గురువారం రాత్రి గాంధీబాబు, అతడి తల్లిదండ్రులు కలిసి శ్రీసాయిలహరిని కొట్టి హత్యచేసేందుకు యత్నించారు. ఆమె తప్పించుకుని ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపులు పెట్టుకుని తండ్రి లాలునాయక్, అన్న ప్రదీప్‌కు ఫోన్ చేసి విషయం తెలియజేసింది. వారిద్దరూ వచ్చి మాట్లాడుతుండగానే గాంధీబాబు, అతడి తల్లిదండ్రులు.. ప్రదీప్, లాలునాయక్‌పై దాడిచేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన లాలునాయక్‌ను చికిత్స నిమిత్తం కుమార్తె శ్రీసాయిలహరి, కుమారుడు ప్రదీప్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని తెలిపారు. తన తండ్రి మృతికి కారణమైన గాంధీబాబు, అతడి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని ప్రదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. -
గాంధీబాబుకు మదర్ థెరిసా పురస్కారం
గిరిజన ప్రాంతాల్లో చేసిన సేవలకు దక్కిన గౌరవం హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు వీఆర్‌పురం : పేద గిరిజనులకు విద్యా, వైద్య సేవలందిస్తున్న ఏఎస్‌డీఎస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ వి.గాంధీబాబుకు మదర్ థెరిసా పురస్కారం లభించింది. మదర్ థెరిసా జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ హెల్త్‌కేర్ ఇంటర్నేషల్ సంస్థ విద్యా, వైద్య విభాగాల్లో ఉత్తమ సేవలందించిన ప్రముఖులను గుర్తించి ఏటా ఈ పురస్కారాలు ఇస్తున్నది. ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన, వలస ఆదివాసీయుల గ్రామాల్లో పోషకాహారంతో బాధ పడుతున్న మూడు వేల మంది బాల బాలికలను పౌష్టికాహార కేంద్రాల్లో చేర్పించి మెరుగైన వైద్యం అందజేశారు. గర్భిణులకు, చిన్నారులకు తన సంస్థ సొంత మెడికల్ యూనిట్ల ద్వారా 89 వైద్య శిబిరాలు నిర్వహించి 5478 మందికి సేవలందించారు. అలాగే పలుగ్రామాల్లో చేతి పంపులు, బావులు ఏర్పాటు చేశారు. ఆయన సేవలను గుర్తించి గాంధీబాబును మదర్ థెరిసా పురస్కారానికి ఎంపికచేశారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకున్నారు. అవార్డు రావడం పట్ల మండల ప్రజలు, రాజకీయ నాయకులు, సంస్థ సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.


