breaking news
gambling den
-
పేకాటడెన్గా టీడీపీ ఎంపీ ఆఫీస్
-
పేకాట డెన్‌గా ఎంపీ ఆఫీస్
సాక్షి, అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా జూదం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్‌గా మార్చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)కు చెందిన కృష్ణాజిల్లా కైకలూరు కార్యాలయంలో ఏడాదిన్నరగా పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. రూ. 5వేలు రిజిస్ట్రేషన్ చార్జిగా వసూలు చేస్తూ కనీసం రూ.5 లక్షలు తెచ్చినవారినే లోనికి అనుమతిస్తూ జూదం నిర్వహిస్తున్నారు. ఇందులో రోజుకు రూ.12 కోట్లు వరకు చేతులు మారుతున్నట్లు వినిపిస్తోంది. మూడు నెలలుగా కోత ఆట నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ పేకాట కొనసాగుతున్నా వీకెండ్ (శుక్ర,శని,ఆదివారాలు)లో పందేలు మరింత పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. పెద్ద సంఖ్యలో జూదరులు.. కోట్లలో పందేలు.. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు తదితర జిల్లాలతో పాటు హైదారాబాద్ నుంచి ప్రత్యేకంగా పేకాట రాయుళ్లను ఆహ్వానించి కోత ఆట నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజు 80 మంది నుంచి వంద మంది వరకు ఈ కోత ఆటకు వస్తుంటారు. ఎంపీ కార్యాలయంలోని పెద్ద హాలులో నిర్వహించే ఈ పేకాటలో పాల్గొనే జూదరులకు పక్క రూమ్‌లోనే మందు, విందు ఏర్పాట్లు చేయడం గమనార్హం. ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటల వరకు కోత ఆట జరుగుతూనే ఉంటుంది. రోజుకు కనీసం రూ.5 కోట్లు నుంచి 12 కోట్లకు పైగా బెట్టింగ్‌ల రూపంలో చేతులు మారుతోంది. అధికార పార్టీ ఎంపీ కార్యాలయం కావడంతో పోలీసులు అటువైపు చూసే సాహసం చేయలేకపోతున్నారు. అయినా నెలవారీ మూమూళ్లు షరా మామూలేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కైకలూరు పేకాటపై కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ కి స్పందించలేదు. అధికార పార్టీ నేతలు, క్రికెట్ బుకీలే నిర్వాహకులు... టీడీపీ ఎంపీ కార్యాలయంలో సాగుతున్న ఈ పేకాట క్లబ్‌కు పశ్చిమగోదావరి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు, హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన క్రికెట్ బుకీలు నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. కోతాట క్లబ్ నిర్వహిస్తున్నందుకు గాను వారికి కమీషన్లు ముడుతున్నాయని, గత మూడు నెలల్లో సుమారు రూ.23 కోట్ల మేర కమీషన్ల రూపంలో సంపాదించారని తెలిసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రధాన క్రికెట్ బుకీగా పోలీస్ రికార్డులకెక్కిన శ్రీకాకుళంకు చెందిన వ్యక్తి, ఇటీవల నెల్లూరులో పట్టుబడిన క్రికెట్ బుకీలు ఇచ్చిన సమాచారంతో పోలీస్ రికార్డులకెక్కిన మరో వ్యక్తి, హైదరాబాద్‌లో పేకాడుతూ పట్టుబడిన వ్యక్తి, భీమవరం తదితర ప్రాంతాల్లో భారీగా క్రికెట్ పందాలు, పేకాటల్లో ఆరితేరిన వ్యక్తులు ఈ జూద శిబిరానికి నేతృత్వం వహిస్తున్నట్టు వినిపిస్తోంది. ఈ అనధికార పేకాట క్లబ్లో టీడీపీ నేతలు, కోత ఆట నిపుణులకు ఆరు వాటాలుండగా రాష్ట్రంలోని కీలక క్రికెట్ బుకీలకు ఏడవ వాటాగా లాభాలను పంచుతున్నారని సమాచారం. జూదరులకు ఆప్పులిచ్చి మరీ ఆడిస్తున్నారు... ప్రతిరోజూ వచ్చే జూదరులకు వారి పరపతికి తగినట్లు నిర్వాహకులు అప్పులు కూడా ఇస్తున్నారు. పేకాటరాయుళ్లకు అప్పులిచ్చే వ్యక్తి కోత ఆట జరిగే హాలులో ఒక మూలన టేబులు, కుర్చీ వేసుకుని కూర్చుని ఉంటారు. ప్రతీ రోజు దాదాపు రూ.5 కోట్ల మేర అప్పుగా ఇచ్చి వారి పేర్లు నమోదు చేసుకుంటాడు. కరెన్సీకి బదులు రంగు రంగుల కాయిన్స్ ఇస్తాడు. రూ.10 లక్షలను అప్పుగా ఇచ్చినందుకు రోజుకు రూ.20 వేలు కమీషన్‌గా వసూలు చేస్తాడు. మొదటి రోజు అప్పుగా తీసుకున్న మొత్తాన్ని మరుసటి రోజు పేకాటకు వచ్చినప్పుడు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోత ఆటలో నిర్వాహకులకే ఎక్కువ ఛాన్స్‌లు ఉండటంతో పేకాట రాయుళ్ల జేబులు గుల్లవుతున్నాయి. ఇటీవల కోత ఆటలో భారీగా నష్టపోయిన వైజాగ్, ఒంగోలు, భీమవరం, విజయవాడకు చెందిన పలువురు యువకులు ఆస్తులు అమ్ముకుని అప్పులు తీర్చాల్సిన దుస్థితి వచ్చింది. అప్పులు తీర్చలేక మరికొందరు జూదరులు ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. ఏమిటి ఈ కోత ఆట..?? పేకాటలో అత్యంత ప్రమాదకరమైన గేమ్ ఇది. సహజంగా రిక్రియేషన్, కల్చరల్ క్లబ్‌ల్లో 13 పేక ముక్కలతో ఆడే రమ్మీ (కిల్ గేమ్)ని ఎటువంటి బెట్టింగ్‌లు లేకుండా అధికారులు అనుమతిస్తుంటారు. కానీ బెట్టింగ్‌లతో ఆడే పేకాట, కోత ఆట, కోసు పందేలపై మాత్రం నిషేధం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన కొన్నేళ్లకే గ్యాంబ్లింగ్ యాక్ట్ తెచ్చారు. దాని ప్రకారం స్కిల్ గేమ్ మినహా.. బెట్టింగ్ వేసే ఏ పేకాటను చట్ట ప్రకారం అనుమతి ఇవ్వరు. కోత ఆట అంటే లోనా బయటా ముక్కలు తిప్పుతూ ఎంపిక చేసిన పేక ముక్క ఎటువైపు పడితే అటువైపు పందేలు గెలిచినట్లుగా పరిగణిస్తుంటారు. ఇందులో క్షణాల్లో లక్షలాది రూపాయలు అటో ఇటో తేలిపోతాయి. దీనికంటే ప్రమాదకరమైంది కోసు పందెం. ఇందులో లోనా బయటా పేకలు తిప్పుతూ ఎక్కువ అవకాశాలు నిర్వాహకులకే ఉంచుకుంటారు. çఫలానా పేక ముక్క వస్తే పందెం డబ్బు ఇవ్వబోమని చెబుతారు. రెండో ముక్క, ఒకటో ముక్క ఇలా ఎంపిక చేసిన పేక ముక్క నిర్వాహకులు చెప్పినట్లు వస్తే ఆ మొత్తం నిర్వాహకుల జేబుల్లోకి వెళితాయి. ఒకటికి రెండు, మూడు రెట్లు అదనంగా ఇస్తామని ప్రకటిస్తూ నిర్వాహకులు మోసం చేస్తుంటారు. పేకాట డెన్‌గా ఎంపీ ఆఫీస్ -
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలంలో గుట్టుగా సాగిస్తున్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రూ. 10 వేలు నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని మల్లారం, బెల్యానాయక్ తండా పరిధిలోని తోటల్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికే ముగ్గురు పేకాట రాయుళ్లు పరారవ్వగా.. పదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
కాయ్ రాజా.. కాయ్..
* ప్రవేశం ఇలా.. *పేకాట ఆడాలనకునే వ్యక్తి ముందుగా రూ.2వేలు చెల్లించి లోపలికి వెళ్లాల్సి ఉంది. *ఎంత డబ్బుతో ఆడగలడో దానికి సంబంధించి టోకెన్‌ను తీసుకుని టేబుల్‌పై కూర్చుని ఆడాలి. *ఆటలో గెలిచిన వ్యక్తి తన వద్ద ఉన్న టోకెన్లు గుడివాడ ఆటోనగర్‌లోని 5వ నంబరు రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో ఇచ్చి ఆ మేరకు సొమ్ము తీసుకోవాల్సి ఉంటుంది. గుడివాడ అర్బన్ : గుడివాడ పరిసర ప్రాంతాల్లో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి జూదరులు తరలివస్తున్నారు. రోజూ లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. గుడివాడ రూరల్ మండలంలోని బొమ్ములూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత ఈ జూద శిబిరాలు నిర్వహిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నాడు. ఎవరైనా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. మరోవైపు కొందరు పోలీసులు కూడా ముడుపులు పుచ్చుకుని జూద శిబిరాల నిర్వహణకు సహకరిస్తున్నారని తెలుస్తోంది. ఎక్కడ ఆడుతున్నారంటే.. పట్టణ పరిసరాల్లోని 20 ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఇవన్నీ ఏకకాలంలో కాకుండా ప్రతి రోజు ప్రాంతాలు మారుస్తూ ఉంటారు. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు జూదరులకు తెలియజేస్తూ పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపాన ఓ ప్రైవేటు కార్యాలయం, మార్కెట్ యార్డుకు ఎదురుగా ఉన్న కాలువగట్టుపై ఓ బిల్డింగ్‌లో పేకాట ఆడుతున్నారు. బొమ్ములూరు గోదాముల వద్ద, పామర్రు రోడ్డులోని రైల్వేగేటు సమీపంలోని ఓ ఐరన్ దుకాణం వద్ద, రామనపూడి నుంచి నూజెళ్లకు వెళ్లే రోడ్డులో కాలువగట్టుపై పాకలో, ఇదే రోడ్డులో రొయ్యిల చెరువు వద్ద జూద శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాలన్నీ రెండు పోలీసు స్టేషన్లకు సరిహద్దులో ఉండటం వల్లే వాటిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ఫోన్ చేసి పేకాట గురించి సమాచారం ఇస్తే పోలీసులు ఆ ప్రాంతం తమది కాదంటే తమది కాదు.. అంటూ బదులిస్తున్నారు. చివరికి ఏ స్టేషన్ వారు వెళ్లాలని నిర్ణయించుకునేలోపు జూదరులు జారుకుంటున్నారు. సూత్రధారి అధికార పార్టీ నేత! గతంలో పేకాట క్లబ్బులు నడిపిన అనుభవం ఉన్న టీడీపీ నాయకుడు ఒకరు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ తన చేతికి పని చెప్పారు. కొందరు పోలీసులకు మామూళ్లు రుచిచూపి తన దందాను కొనసాగిస్తున్నాడు. దాదాపు 120మందికిపైగా ఈ ఆటలో పాల్గొంటారని తెలుస్తుంది. పేకాట ఆడే ప్రదేశాన్ని ముందుగానే ఫోన్ ద్వారా జూదరులకు సమాచారం ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. రోజూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10గంటల వరకు 13ముక్కల ఆట, రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 3గంటల వరకు లోనా-బయటా(కోసు)లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిత్యం లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. పోలీసుల్లో కోవర్టులు పేకాట ఆడుతున్నారనే సమాచారాన్ని ఇటీవల ఓ వ్యక్తి జిల్లా ఎస్పీ కార్యాలయ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి తెలియజేశాడు. ఆ సమాచారం జూద శిబిరాల నిర్వాహకుడికి అనుకూలంగా ఉన్న వ్యక్తికి అందింది. దీంతో ముందుగానే జాగ్రత్తపడ్డారు. గత శుక్రవారం గుడ్లవల్లేరు శ్మశానవాటిక, గుడివాడ మార్కెట్ యార్డుల వద్ద జూదశిబిరాలపై పోలీసుల దాడుల్లో పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుని, అతి తక్కువ లభించినట్లు వెల్లడించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వాహకుడిపై కేసులు లేకుండా చేసేందుకు గాను రూ.40వేలు తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే వ్యక్తి గతంలో జూద శిబిరాలు నిర్వహిస్తుండగా అప్పటి ఎస్పీ జయలక్ష్మి తీవ్రంగా హెచ్చరించడంతో కొంతకాలం జూదక్రీడకు తెరపడింది.