G. haragopal
-
‘కేజీ టు పీజీ’ ఉచితం మిథ్యేనా?
విశ్లేషణ తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణగా మారడానికి పిల్లలందరికీ కామన్ స్కూల్ ద్వారా సమానమైన నాణ్యమైన విద్యను అందివ్వగలగాలి. పిల్లల చదువు ఎలా? అనే ఆందోళన ఎవరికీ కలగని పరిస్థితిని తెలంగాణలో కల్పించాలి. కానీ అది ప్రభుత్వ ప్రాధాన్యాలలో లేకపోవడాన్ని, బడ్జెట్లో విద్యకు కేటాయించిన శాతాన్ని చూస్తే తెలంగాణ ప్రభుత్వానికి విద్య అంటే ఎంత చులకన భావన ఉందో తెలుస్తుంది. రాష్ట్రాలు బడ్జెట్లో 30 శాతం విద్యకు కేటాయించాలని కొఠారీ కమిషన్ సూచిస్తే తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది 10 శాతం కంటే తక్కువే. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలు చాలా పెద్ద ఎత్తున ముందుకు వచ్చాయి. అయితే ఆ ఆకాంక్షలు సాకారం కావడానికి భౌగో ళిక తెలంగాణ మొదటి అవసరమని, తెలంగాణ రాష్ట్రమంటూ ఏర్పడితే ప్రజల అవసరాలకు స్పందించే ఒక ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడు తుందని ప్రజలు భావించారు. మాలాంటి వాళ్లం ప్రజల ఆకాంక్షలను స్పష్టంగా వ్యక్తీకరించుకోవాలని, ఆ ఆకాంక్షలు, పరిష్కార మార్గాలు కూడా ఉద్యమ క్రమంలోనే స్పష్టంగా ఏర్పడాలని, నూతన రాష్ట్ర నిర్మాణానికి పునాదిలో కావలసిన విలువల వ్యక్తీకరణ, వ్యవస్థీకరణ కూడా ఉద్యమ క్రమంలోనే రూపొందాలని ప్రస్తావించాం. అయినా భౌగోళిక తెలంగాణ కాంక్ష మొత్తం ఉద్యమాన్ని ఆక్రమించుకుంది. అది ఏర్పడి ఒక సంవత్సరం పూర్తవుతున్నది. తెలంగాణ ఉద్యమక్రమంలో తెరాస పార్టీ ‘కేజీ టు పీజీ ఉచిత విద్య’ నినాదాన్ని చేపట్టింది. ఇది ఒక విప్లవాత్మక నినాదం. ఉమ్మడి రాష్ట్రంలో విద్యారంగానికి జరిగిన హాని బహుశా మరే ఇతర రంగానికి జరగలేదు. అందుకే ఈ నినాదాన్ని అందరూ హర్షించారు. అమ్మకానికి విద్య వినూత్న వికృత విలువ విద్య 1985 దాకా అందరికీ అందుబాటులోకి రాకపోయినా, అమ్మే వస్తువుగా మారలేదు. మా తరానికి దాదాపు ఉచిత విద్యే అందింది. నా మొత్తం విద్యకు మా కుటుంబం పెట్టిన ఖర్చు కేవలం రూ. 2,500. నేను చదివిన వివేకవర్థిని కళాశాల ఎయిడెడ్ కాలేజీగా ఉండేది. అది మహారాష్ట్రీయులు ప్రారంభించిన కాలేజీ అయినా మహారాష్ట్రేతరులకు కూడా విద్య ఉచితమే. 1983లో మన దేశం ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకున్నప్పటి నుంచి మన విద్యా విధానం విపరీతమైన మార్పులకు గురైంది. విలువలు పూర్తిగా మంట కలిసి ఒక వ్యాపార సంస్కృతి విస్తృతి చెంది విద్యారంగాన్ని కూడా మింగడం ప్రారంభించింది. దాంతో విద్యారంగంలో ప్రైవేటు పెట్టుబడి ప్రవేశించి ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు స్కూళ్లు, కార్పొరేటు కళాశాలలు ఇబ్బడి ముబ్బ డిగా ప్రారంభించారు. అందరికీ ఒకే విద్య, నాణ్యమైన విద్య, ఉచిత విద్య అనే ఉదాత్త భావాలు మంటగలిసి, ఎవరు డబ్బులు పెట్టగలిగితే వాళ్లకు విద్య అనే ఒక అప్రజాస్వామిక, అమానవీయ విద్యా విధానానికి తలుపులు తెరచు కున్నాయి. దీంతో ఎంసెట్ పరీక్షలు, ఇంజనీరింగ్, మెడిసిన్ తప్ప ఇతర కోర్సులు విద్యే కాదనే ప్రచారం జరిగింది. ఫలితంగా ఒకటి, రెండు తరాల యువత మొత్తం విధ్వంసానికి గురైంది. ప్రైవేటు విద్య విస్తరిస్తూ, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తూ ప్రభుత్వ విద్యను ప్రభుత్వం ద్వారానే ధ్వంసం చేయించగలిగింది. ఉమ్మడి రాష్ట్రంలో విద్యా మంత్రులు, ముఖ్య మంత్రులు ప్రైవేటు స్కూళ్ల ప్రతినిధులుగా మాట్లాడటం పెరిగింది. ఇంటర్ విద్యలో రెండు, మూడు సంస్థలు ప్రవేశించి మరెవ్వరినీ. ఏ కాలేజీని బతకని వ్వలేదు. ఈ సంస్థల అధిపతులు కోటీశ్వరులయ్యారు. బహుశా ప్రపంచంలో ఎక్కడా విద్య ద్వారా ఇంతగా లాభాలు గడించిన వాళ్లు ఉండరు. నిజానికి పెట్టుబడిదారీ దేశాల్లో కూడా విద్యను అమ్మరు. ఇది మన దేశం ‘ప్రపంచ నాగరికత’కు ప్రసాదించిన వికృత విలువ. ప్రైవేటు విద్యా మార్కెట్లో ఆంధ్ర పెట్టుబడిదారుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో, తెలంగాణ ఉద్యమంలో కార్పొరేటు విద్యకు వ్యతిరేకంగా నినాదాలొచ్చాయి. విద్య సామాజిక రం గంలో, ప్రభుత్వ నిధులతో నడవాలన్న ఆకాంక్షకు బీజాలుపడ్డాయి. ఈ నేప థ్యంలో ‘కేజీ టు పీజీ ఉచిత విద్య’ నినాదం అందరినీ ఆకర్షించింది. బ్రహ్మపదార్థంగా మారిన ‘కేజీ టు పీజీ ఉచిత విద్య’ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతూనే విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తాయేమోనని ‘భ్రమ’పడిన వాళ్లలో నేనొకడిని. తెలంగాణ లాంటి ‘కేజీ టు పీజీ ఉచిత విద్య’ దేశవ్యాప్త చర్చగా మారింది. దీంతో దాదాపు 18 రాష్ట్రాలకు చెందిన ‘అఖిల భారత విద్యా హక్కు ఫోరం’ సభ్యులు తెలంగాణ వైపు ఆసక్తితో చూశారు. తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కాకున్నా, ఒక స్వాగ తింపవలసిన నమూనాగా ఉంటుందని భావించాం. తెలంగాణ పునర్నిర్మా ణంపై చర్చలో విద్యా రంగం ఎలా మారాలన్న అంశం మీద తెలంగాణ రాక ముందు, వస్తుందన్నప్పుడు, వచ్చినాక వ్యాసాలు రాయడం జరిగింది. వాటిని పట్టించుకున్న నాథుడెవ్వడూ లేడు. తెలంగాణలో జరిగినంతగా విద్యారంగ ప్రైవేటీకరణ దేశంలో ఏ రాష్ట్రం లో జరగలేదు. దాదాపు 80 శాతం స్కూళ్లు కాలేజీలు, వృత్తి విద్యా కోర్సులు ప్రైవేటు రంగంలో ఉన్నాయి. ఈ మధ్యే కస్తూర్బా కాలేజీలో ప్రభుత్వ డ్రిగీ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీల అధ్యా పకులు, ప్రిన్సిపాళ్ల సంఘాల సదస్సులో ప్రభుత్వ ఉన్నత విద్యారంగ దీన స్థితిని విద్యామంత్రి కడియం శ్రీహరి గారికి వివరించారు. వందల సంఖ్యలో అధ్యాపకుల పోస్టులు నింపకపోవడం, కాంట్రాక్టు లెక్చరర్ల అనిశ్చిత పరిస్థితి, కాలేజీలకు ప్రిన్సిపాల్స్ లేకపోవడం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి నిదర్శనం. ఒక ఏడాది కావస్తున్నా తెలంగాణ ప్రభుత్వం వీటి గురించి ఒక్క అడుగుముందుకు వేయలేదు. ఇక ఎయిడెడ్ కాలేజీలను ఒక పథకం ప్రకారం ఖూనీ చేశారు. సదస్సు జరిగిన కస్తూర్బా కాలేజీ మహిళా విద్యకు చేసిన సేవ చాలా గొప్పది. ఏ మాత్రం స్పృహ ఉన్న ప్రభుత్వమైనా వీటిని రక్షించుకుం టుంది. ‘కేజీ టు పీజీ ఉచిత విద్య’లో ఉన్నత విద్యాసంస్థలను కాపాడుకో వాలనే ఆకాంక్ష ఉన్నట్లు లేదు. ఈ నినాదమే బ్రహ్మపదార్థంగా మారింది. ఇక విశ్వవిద్యాలయాల స్థితి గురించి అడగవలసిన అవసరమేలేదు. ఒక రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలకు వీసీలు లేకపోవడం బహుశ దేశ చరిత్ర లోనే ఒక పెద్ద విషాదం. వేల అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లైబ్ర రీలకు, లేబొరేటరీలకు గ్రాంట్లు లేవు. భవనాలు భూత్ బంగళాలుగా మారు తున్నాయి. ఇవన్నీ పోగా విశ్వవిద్యాలయాలకు అంత భూమి ఎందుకు, అక్కడ పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.‘కేజీ టు పీజీ ఉచిత విద్య’ అన్న ముఖ్యమంత్రేనా? అనే అనుమానం కూడా వచ్చింది. కొత్త స్కూళ్లు ఎన్నో వస్తాయనుకుంటే... ఇక స్కూలు విద్యకు వస్తే వేల స్కూళ్లను మూసేస్తామంటున్నారు. ఈ స్కూళ్లల్లో పిల్లలే లేరంటున్నారు. పిల్లలంతా ఏమైపోయినట్టు? తెలంగాణ వస్తూనే కొత్త స్కూళ్లు తెరుస్తారని, పిల్లలందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తారని ఆశించాం. క్రమంగా కామన్ స్కూల్ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టి కార్పొరేటు, ప్రైవేటు స్కూళ్లను నియంత్రించి అంతిమంగా రద్దు చేస్తా రనుకున్నాం. విరుద్ధంగా స్కూళ్లు మూసే కార్యక్రమం మొదలు పెట్టారు. వేలాది మంది విద్యార్థులు ఎప్పుడు డీఎస్సీ వేస్తారా అని ఎదురుచూస్తుంటే ఈసారి ఉపాధ్యాయ నియామకాలే ఉండకపోవచ్చు అనేట్టున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అంటే, గత ఏడాది నవంబర్‌లో ‘అఖిల భారత విద్యా హక్కు ఫోరం’ పిలుపు మేరకు పది తెలంగాణ జిల్లాల్లో ‘శిక్షా సంఘర్ష్ యాత్ర’ జరిగింది. దానికి ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందన తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చింది. సాధారణ ప్రజలు, గ్రామీణ పేదలు ప్రభుత్వ పాఠశాలలను మరింత మెరుగ్గా నడపాలని, వాటికి అన్ని వసతులను కల్పించాలని కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంత బలంగా సమాజం పిల్లలకు నాణ్యమైన విద్య కావాలనే కోరికను వ్యక్తీకరిస్తున్నది. కేసీఆర్ ఇచ్చిన నినాదానికి ఈ నేపథ్యం ఉంది. తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణగా మారడానికి పిల్లలందరికీ కామన్ స్కూల్ ద్వారా సమానమైన నాణ్యమైన విద్యను అందివ్వగలగాలి. పిల్లల చదువు ఎలా? అనే ఆందోళన ఎవరికీ కలగని పరిస్థితిని తెలంగాణలో కల్పించాలి. కానీ అది ప్రభుత్వ ప్రాధాన్యాలలో లేకపోవడాన్ని, బడ్జెట్లో విద్యకు కేటాయించిన శాతాన్ని చూస్తే తెలంగాణ ప్రభుత్వానికి విద్య అంటే ఎంత చులకన భావన ఉందో తెలుస్తుంది. కొఠారీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్లో 30 శాతం విద్యకు కేటాయించాలని సూచించింది. మేం కనీసం 20 శాతమన్నా కేటాయించమని వేడుకున్నాం. కానీ ఇచ్చింది 9 శాతం. దీంతో విశ్వవిద్యాలయాల కేటాయింపులు హాస్యాస్పదంగా మారా యి. పాలమూరు విశ్వవిద్యాలయానికి ఎనిమిది కోట్ల బడ్జెట్ ఏమిటి? ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయానికైనా, అతి పేద దేశాల్లో కూడా ఇంత తక్కువ కేటాయించరు. యూనివర్సిటీ అవసరాలు తెలియక కాదు, విద్య అంటే చిన్న చూపుతో లేదా ప్రైవేటు విద్యకు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు తలుపులు తెరవడం కొరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ రెండవ సంవత్సరంలో ప్రవేశించాక విద్యారంగాన్ని కాపా డుకునే దిశలో ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆశిద్దాం. దానికి మించి నిరంతర ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే ప్రభుత్వ విధానాలు మారతాయన్న జ్ఞానం తెలంగాణ ప్రజలకున్నది. ఆ ప్రజాస్వామ్య ఎరుకే తెలంగాణకు రక్ష. జి. హరగోపాల్ (వ్యాసకర్త ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, హక్కుల నేత) మొబైల్:9989021741 -
బాబు, మోడీ దొందూదొందే.. ప్రపంచ బ్యాంకు చిలుకలు
* అమెరికా సామ్రాజ్య శక్తుల తొత్తులు * రక్త చరితులిద్దరూ చేతులు కలిపారు * నిరుపేద నోటికాడి ముద్దనూ లాక్కుంటారు జీవితంలో మళ్లీ జట్టు కట్టబోనన్న బీజేపీతోనే చంద్రబాబు మరోసారి ఎన్నికల పొత్తు పెట్టుకోవడం వెనుక దాగున్న లోతైన కారణాలను, వారికి లోక్‌సత్తా జేపీ దన్ను తాలూకు లోగుట్టును, వీరందరినీ తెర వెనక నుంచి ఇష్టానుసారం ఆడిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద శక్తుల తీరుతెన్నులను కళ్లకు కడుతూ సామాజికవేత్త ప్రొఫెసర్ జి.హరగోపాల్ వెలిబుచ్చిన అభిప్రాయాలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... - ప్రొఫెసర్ హరగోపాల్: రక్తం రుచి మరిగిన నరేంద్ర మోడీ ఒక్కసారిగా తెరమీదికి ఎందుకొచ్చారు? నెత్తుటి చారికలే తన పాలనకు ఆనవాళ్లుగా మిగిలిన చంద్రబాబు ఆయనతో ఎందుకు జోడీ కట్టారు? పేదవాడి సంక్షేమం భారమంటున్న లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ ఈ జట్టుతో చేతులు కలపడం వెనుక అర్థమేమిటి? ఆర్థిక సంస్కరణలే ఆయువుపట్టుగా చెప్పుకున్న యూపీఏపై జనం ఎందుకు కన్నెర్ర చేస్తున్నారు? నిశితంగా పరిశీలిస్తే, నిగూఢార్థం ఒక్కటే. ఈ కూటమిని అమెరికా సామ్రాజ్యవాద శక్తులు ఏరికోరి ఎంచుకున్నాయి. దేశాన్ని తమ విషపు కౌగిట్లో మరింతగా బిగించేందుకు 2014 ఎన్నికలను వేదికగా చేసుకున్నాయి. ఈ వ్యూహమే అమలైతే, ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తే పేదవాడి జీవితం అల్లకల్లోమవుతుంది. నోటి ముందు ముద్దను కూడా అమెరికా శక్తులు లాక్కెళ్లడం ఖాయం. భయం, హింసే పాలకుల అస్త్రమయ్యే ప్రమాదముంది. ముస్లింలకు, మైనారిటీలకు నిలువ నీడలేని దుస్థితి ఎదురవుతుంది. వ్యవసాయం దండగని అప్పట్లో చంద్రబాబు పలికిన ప్రపంచ బ్యాంకు పలుకులే అనునిత్యం సుప్రభాతాలవుతాయి. సన్న, చిన్న కారు రైతు తన పొలంలో ఏం పండించాలో కూడా అమెరికానే ఆదేశించే ఆస్కారముంది. కూటి కోసం అగచాట్లు, గూడు కోసం వెదుకులాట, గుడ్డ కోసం దేబిరింపు... ఇవీ ప్రపంచబాంకు ఆధిపత్యంలో కన్పించే దుష్ఫలితాలు. ఇదో కుట్ర మన దేశంలో 1983 వరకూ సంక్షేమ రంగానికి ఎంతోకొంత ప్రాధాన్యముండేది. ఆ తర్వాత అమెరికా శక్తుల ప్రమేయం పెరిగింది. అప్పు పేరుతో ప్రపంచబ్యాంకు ఆధిపత్యం మొదలైంది. అరకొరగా దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించక తప్పలేదు. ఫలితంగా ప్రజా వ్యతిరేక పెరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ సంస్కరణల వేగం పెంచింది. వాజ్‌పేయి నేతృత్వంలో అమెరికా భజన నిరాటంకంగా కొనసాగింది. భారత్ వెలిగిపోతోందన్న నినాదం తో ఓట్ల కోసం వెళ్తే దగాపడ్డ వర్గాలు ఈడ్చి తన్నాయి. 90 దశకం నుంచీ అమెరికా చేతిలో కాంగ్రెస్ పావుగా మారింది. పెట్టుబడిదారీ వర్గాలన్నీ పీవీ నరసింహారావును కీర్తించడం, ఆ తర్వాత ఆర్థికవేత్తగా మన్మోహన్‌ను ఆకాశానికెత్తడం పరిపాటైంది. పదేళ్లుగా అమెరికా పెట్టుబడిదారులు భారత్‌లో గల్లీగల్లీకీ విస్తరించారు. ఆఖరుకు రిటైల్ రంగంలోనూ చొరబడేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. మోడీని ఎందుకు ఎంచుకున్నారు? నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం వెనుక ఓ కుట్ర దాగుంది. సామ్రాజ్యవాద శక్తులు పదేళ్లుగా యూపీఏ ప్రభుత్వంతో అలవోకగా తమ విధానాలను అమలు చేయించుకున్నాయి. ఫలితంగా యూపీఏపై ప్రజాగ్రహం పెరిగింది. ఉపాధి లేని యువత తిరగబడుతోంది. గిట్టుబాటు లేని రైతన్న ఆగ్రహిస్తున్నాడు. కార్మిక, కర్షకులు సంస్కరణలపై కన్నెర్ర చేస్తున్నారు. ఈ ఎన్నికలనే తీసుకోండి. ప్రధాని మన్మోహన్సింగ్ ఎక్కడ సభ పెట్టినా జనం రావడం లేదు. దేశ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఏ మారుమూల గ్రామానికీ వెళ్లలేని పరిస్థితి. యూపీఏ మంత్రులను, ఎంపీలనూ జనం చీదరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ముఖం కావాలి. దాని వెనుక భయపెట్టో, బెదిరించో పాలన సాగించే శక్తులుండాలి. అంతిమంగా అవన్నీ తమ చెప్పుచేతుల్లో ఉండాలి. ఇదీ అమెరికా ఆలోచన. బీజేపీని సమర్థిస్తున్న శక్తులన్నీ ఇలాంటివే. సంఘ్‌పరివార్, ఆర్ఎస్ఎస్... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వీటికో అజెండా ఉంది. ఈ దేశంలో హిందూత్వ రాజ్యాన్ని స్థాపించాలి. మైనారిటీ వర్గాలను తరిమేయాలి. ముస్లిం దేశాలకు అమెరికా వ్యతిరేకం. కాబట్టి ఆ దేశం తోకపట్టుకుని వెళ్లాలని అవి భావించాయి. అమెరికాకేమో తమ పెట్టుబడులను విస్తరించుకునే వ్యూహముంది. హిందూత్వ శక్తులకు తమ రాజ్యాన్ని స్థాపించాలన్న అజెండా ఉంది. అందుకే అవన్నీ ఒకటయ్యాయి. మోడీ అంటే రక్తం; బాబు అంటే బషీర్‌బాగ్ మోడీ పేరు వింటే గుజరాత్ అల్లర్లే గుర్తుకొస్తాయి. అనేక నేరాలు కళ్లముందే కదులుతాయి. రక్తపాతం భయం పుట్టిస్తుంది. చంద్రబాబు కూడా అంతే. బషీర్‌బాగ్ కాల్పులు. కాల్దారీ సంఘటన వణికిస్తాయి. ఇలాంటి శక్తులన్నీ కలిస్తే ప్రజల్లో భయం పుట్టుకొస్తుంది. ప్రజా వ్యతిరేకత ఉన్నా, ధైర్యం చేసి ఉద్యమించలేరు. ఒకవేళ ఉద్యమించినా అణిచివేస్తారు. ఇదీ అమెరికా సామ్రాజ్య శక్తుల బలమైన నమ్మకం. వీటన్నింటికన్నా మించి, నరేంద్రమోడీ సంస్కరణలకు కేంద్ర బిందువు. గుజరాత్ తరహా అభివృద్ధిని చూపిస్తానని ఆయనే చెబుతున్నారు. నిజానికి అక్కడ జరిగిన అభివృద్ధి ఏమిటి? పెట్టుబడిదారీ వర్గ ఆలోచనల విస్తృతి కాదా? దీన్నే ప్రజలకు అందిస్తానంటే సగటు మనిషి దుస్థితి ఏమిటి? పేదరికం పెరిగిపోదా? దుర్భిక్షం తాండవించదా? వ్యవసాయం పరిస్థితేమిటి? వ్యవసాయ రాయితీలకు అమెరికా పూర్తిగా వ్యతిరేకం. ఆ దేశ జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ వాటా కేవలం 2.5 శాతమే. కానీ మన దేశంలో 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. అమెరికా ఆదేశాలనే పాటిస్తే, విదేశీ పెట్టుబడి రాయితీలే ప్రధానమైతే, రైతన్నకు చిల్లిగవ్వ కూడా మిగలదు. పురుగుమందే పరమాన్నమయ్యే దుర్గతి పడుతుంది. చంద్రబాబు ఈ విధానాన్నే భుజానికెత్తుకున్నారు కదా! వ్యవసాయం దండుగని ఆయన నోటి నుంచే చెప్పారు కదా! అప్పుడు ప్రజలు ఏ విధంగా తిరగబడ్డారో తెలియదా? ఇప్పటికీ చంద్రబాబు అధికారంలోకి రాకపోవడానికి ఆయన అనుసరించిన రైతు వ్యతిరేక విధానాలే కారణం. అణచివేతే విధానమా? దేశంలో ఇప్పుడు ఓ భయం ఉంది. అమెరికా తన అజెండాను మోడీకిచ్చి ఎన్నికలకు పంపింది. బహుళజాతి సంస్థల పెట్టుబడిదారులే బీజేపీకి ప్రధానంగా నిధులిస్తారు. కాబట్టి అధికారంలోకి వస్తే వాళ్లు చెప్పినట్టు వినాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మేయాలి. అన్ని రంగాల్లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించాలి. ఇది ఎంత ప్రమాదం! దీన్ని ఇప్పటికే భారత్‌లోని ప్రతి పల్లే వ్యతిరేకిస్తోంది కదా! మోడీ ఈ విషయంలో కేవలం నెల రోజుల్లోనే మూడు మాటలు చెప్పారు. ఎఫ్‌డీఐలను అనుమతించబోమని ఒకసారి, పాక్షికంగానేనని మరోసారి, అనుమతించకపోతే అభివృద్ధెలాగని మరోసారి అన్నారు. అమెరికా మాటలు జవదాటకుండా మోడీ పాలన సాగించే పరిస్థితి లేదనడానికి, ఈ విషయంలో ప్రపంచ స్థాయి ఒత్తిడి పెరుగుతోందని చెప్పడానికి ఇంతకన్నా ఏం ఉదాహరణ కావాలి? వాస్తవానికి ప్రజలు కనీసావసరాలు కోరుకుంటున్నారు. నీరు, విద్య, ఉద్యోగం, వైద్యం, రవాణా... ఇవీ వారు ఆశించేవి. కానీ వాటికోసం అడిగితే, ఆందోళన చేస్తే అణచేయడానికి మోడీ ఏమాత్రం వెనుకాడరనేది ఆయన పాలన చాటిచెబుతున్న సత్యం. ఆర్థికేతర సమస్యలుగా చూపే ఎత్తుగడ బీజేపీకి అనుబంధంగా ఉన్న శక్తుల వల్ల ప్రయోజనముంటుందని అమెరికా భావిస్తోంది. ఎందుకంటే ఆర్థికపరమైన సమస్యలను ఇతర అంశాల వైపు మళ్లించే చాకచక్యం ఆ పార్టీకే సొంతం. గతంలో రామజన్మభూమి అంశాన్ని చూసినా, రామసేతు వివాదం తీసుకున్నా... ఇలా రాముడో, దేముడో అని చెప్పి, మతం మత్తులో జనాగ్రహాన్ని అణచేయగల శక్తి బీజేపీకి ఉందనేది వాస్తవం. పైగా ఆ పార్టీ వెనుక ఆర్ఎస్ఎస్, సంఘ్‌పరివార్ వంటి శక్తులు ఉండనే ఉన్నాయి. రామ్‌దేవ్ బాబా రాజకీయాలు మాట్లాడుతున్నారు. సన్యాసులు అభ్యర్థులను సూచిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఆదేశాలిస్తోంది. భారత ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తే, ఇలాంటి సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. ఈ ఎన్నికల్లో అవి ఇంతగా ప్రభావం చూపిస్తున్నాయంటే బలమైన అజెండా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా అమెరికా సామ్రాజ్య శక్తుల దుష్ట పన్నాగాల నుంచి బయటకు వచ్చేందుకు తృతీయ ప్రత్యామ్నాయ శక్తి అవసరం. ఈ దిశగా ఆస్తిత్వాన్ని కాపాడుకునేందుకు సామాజిక శక్తులు ఏ మేరకు సఫలమవుతాయో వేచి చూడాల్సిందే. బాబు... ప్రపంచ బ్యాంకు పోస్టర్ బోయ్! అది 2004. మరో గంటలో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని పార్టీ గెలుస్తుంది. కానీ గాంధీభవన్‌లో ఓ యువజన నేత ‘ఆ, ఏం గెలుస్తాం... చంద్రబాబును తట్టుకోవడం సాధ్యమా?’ అని అన్నారు! అంటే బాబు కోసం ప్రపంచ బ్యాంకు అంతగా ప్రచారం చేసింది. ఆయన అంత గొప్ప నేత అంటూ బాకా ఊదింది. ఎంతగా అంటే... చివరకు గెలిచే వ్యక్తి కూడా తాము గెలుస్తామని చివరి నిమిషం దాకా నమ్మలేనంతగా! ఇంకా చెప్పాలంటే, బాబు ఓడిపోయాడనే రిజల్టు వెలువడేదాకా కూడా ‘చంద్రబాబే మళ్లీ సీఎం’ అని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆఖరుకు బాబు ఓడిపోయిన తర్వాత కూడా, ఎందుకు ఓడాడా అని ప్రపంచ బ్యాంకు సర్వే చేయింది. బహుశా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వల్లేమోనని 2009లో కూడా ప్రపంచ బ్యాంకు భావించిందట! అంటే బాబుపై దానికి అంత నమ్మకం! తమ ఆదేశాలను పొల్లుపోకుండా అమలు చేయడానికి ప్రజలను కాల్చివేయడానికి కూడా సిద్ధమైన ఆయనను ప్రధాని చేయాలని కూడా ప్రపంచ బ్యాంకు అనుకున్నదట. కానీ ప్రజలకు వ్యతిరేకంగా పని చేయడం వల్ల ఆ ఆగ్రహం ఇప్పటికీ ఆయన మీద పోలేదు! వామపక్షాల వైఫల్యమే కారణం మత శక్తులు, అమెరికా అనుకూల పార్టీలు ఇంతగా ఎదగడానికి ఒకరకంగా వామపక్షాలే కారణమని విశ్లేషించాలి. అమెరికా సామ్రాజ్య శక్తులకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టడంలో ఆ పార్టీలు విఫలమయ్యాయి. లాటిన్ అమెరికా లాంటి చోట్ల వామపక్ష శక్తులు ఎదుగుతున్నా మన దగ్గర రోజు రోజుకు దిగజారుతున్నాయి. జన సమీకరణలో అవి విఫలం కావడమే ఈ పరిస్థితికి కారణం. జగన్‌ది సాహసమే! ఒకపక్క చంద్రబాబు అమెరికా మంత్రం జపిస్తుంటే, నరేంద్రమోడీ చుట్టూ తిరుగుతుంటే, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేమో సంక్షేమ పథకాలనే ఎజెండాగా చేసుకున్నారు. ఇది సాహసోపేత నిర్ణయమే. ప్రపంచ బ్యాంకు కన్నా ప్రజల సంక్షేమమే ప్రధానమని గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారు. దాంతో ఆయనపై వచ్చిన ఒత్తిడి అంతా ఇంతా కాదు. నిజానికి అంత ధైర్యం చేయబట్టే వైఎస్ ఇప్పటికీ జనంలో ఉన్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే దారిని ఎంచుకున్నారు. అనుకున్నట్టు సంక్షేమ పథకాలను అమలు చేస్తే ప్రజలకు ప్రభుత్వం నిజంగా అండగా ఉన్నట్టే. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికీ న్యాయం జరుగుతుందని చెప్పవచ్చు. -
సోనియా ఇవ్వలేదు.. కేసీఆర్ తేలేదు: హరగోపాల్
హన్మకొండ, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రాన్ని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఇవ్వలేదు.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుకురాలేదని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు అన్నివర్గాల ప్రజలు చేసిన పోరాటాలతోనే కేంద్రం తెలంగాణను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్(ఎస్‌సీఐఈ)ఫోరం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా హన్మకొండలో ఆదివారం ‘విద్యానాణ్యత- అపోహలు, తెలంగాణ రాష్ట్రం -విద్యాస్వరూపం’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం నాయకులతో రాలేదని.. ప్రజల పోరాటాలు, విద్యార్థుల ఆత్మబలిదానాలతోనే ఏర్పడిందని తెలిపారు. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని తపరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జాయింట్ యాక్షన్ కమిటీని(జాక్)ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘విద్యావిధానం లోటుపాట్లు -ఉద్యమాలు’అంశంపై డి.రమేష్‌పట్నాయక్ మాట్లాడారు.