breaking news
Fungus attacks
-
పటిష్ఠ క్వారంటైన్‌తోనే చెక్!
చైనా తమపై ఆగ్రో టెర్రరిజానికి పాల్పడిందని ఇటీవల అమెరికా ప్రకటించింది. ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని చైనా నుంచి అక్రమంగా అమెరికాలోకి తీసుకువచ్చిన నేరానికి చైనా పౌరురాలు, మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకురాలు యుంకింగ్ జియాన్(33), ఆమె చైనా ప్రియుడు జున్యాంగ్ లియు(33)లను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా చైనా పనిగట్టుకొని చేయిస్తున్న ‘ఆగ్రో టెర్రరిస్టు’ చర్యేనని అమెరికా ఆరోపించింది. శత్రు దేశంలో జీవ భద్రతను, వ్యవసాయ– ఆహార భద్రతను విచ్ఛిన్నం చేసే ఉగ్రవాద చర్యలను ‘ఆగ్రో టెర్రరిజం’ అని వ్యవహరిస్తారు. ఈ వార్తతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో.. అసలు ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రం పంటలకు ఎంతవరకు ప్రమాదకరం? ఒక దేశం నుంచి మరో దేశానికి ఏదైనా శిలీంధ్రాలు, వైరస్లు, సూక్ష్మజీవులు, విత్తనాలను పరిశోధనల కోసం అధికారిక అనుమతులతో తీసుకెళ్లే వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుంది? దాని అవసరం ఏమిటి? వంటి విషయాలను పరిశీలిద్దాం.కొత్త వాతావరణమే సమస్యఒక దేశం మరో దేశంపై ఆయుధాలతో విరుచుకుపడితే ఆ దాడి నష్టం ఏపాటిదో అప్పటికప్పుడే తెలిసిపోతుంది. అదే గనక.. ఒక విధ్వంసక శిలీంధ్రాన్నో, సూక్ష్మజీవినో, వైరస్నో జీవాయుధంగా ప్రయోగిస్తే ఈ ఆగ్రో టెర్రరిస్టు చర్య వల్ల కలిగే నష్టం వెంటనే తెలియదు. కొన్నేళ్లు పట్టొచ్చు. ఎందుకంటే, ఒక దేశంలో ఉండే శిలీంధ్రం లేదా వైరస్ వేరు దేశపు కొత్త వాతావరణ పరిస్థితుల్లోకి ప్రవేశించినప్పుడు ఆ వాతావరణం నప్పితే చెలరేగిపోవచ్చు. అక్కడి పంట పొలాల్లో విధ్వంసం సృష్టించి ఆ దేశపు ఆహారోత్పత్తి పునాదుల్నే కదిలించి, కోలుకోలేని దెబ్బ తీయవచ్చు. లేదంటే, ఆ కొత్త వాతావరణం సరిపడకపోతే తేలిపోనూవచ్చు. ఆ కొత్త వాతావరణంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమపై ఈ శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాల ప్రవర్తన తీరు ఎంత విధ్వంసకరంగా ఉంటుందన్న విషయం ఆధారపడి ఉంటుంది. అందుకే పరిశోధనల కోసం విదేశాలకు ఇలాంటివి తీసుకెళ్లాలంటే పటిష్టమైన పరీక్షలు, నియమనిబంధనలతో కూడిన క్వారంటైన్ వ్యవస్థ ఏర్పాటైంది. అదేమీ లేకుండా ఫంగస్‌ను పంపటం ద్వారా చైనా ‘ఆగ్రో టెర్రరిస్టు (వ్యవసాయ ఉగ్రవాద)’ చర్యకు ఒడిగట్టిందని అమెరికా మండిపడింది. ‘ప్రమాదకరమైన జీవాయుధాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావటం వ్యవసాయ సంబంధమైన ఉగ్రవాద చర్య. ఇది పంటలకే కాదు మనుషులు, పశువుల ఆరోగ్యానికి కూడా గొడ్డలిపెట్టు. యావత్ జాతి భద్రతకే ప్రత్యక్ష ముప్పు’ వంటిదని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) డైరెక్టర్ కష్ పటేల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.అన్ని దేశాల్లోనూ ఉన్నదే! ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రంను ‘కిల్లర్ ఫంగస్’ అని కూడా అభివర్ణిస్తున్నారు. ‘గ్రామినే’ కుటుంబానికి చెందిన వరి, మొక్కజొన్న, గోధుమ, బార్లీ వంటి ప్రధాన ఆహార ధాన్యపు పంటలకు కంకి దశలో సోకటం ద్వారా దిగుబడిని దెబ్బతీసి తీవ్ర ఆర్థిక నష్టం కలిగిస్తుంది అయితే, ఇది ఇప్పటికే దాదాపు అన్ని దేశాల్లోనూ ఉన్న శిలీంధ్రమేనని నిపుణులు చెబుతున్నారు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, కేంద్ర ప్రభుత్వ జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్‌బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం మాజీ సంచాలకులు డాక్టర్ బలిజేపల్లి శరత్‌బాబు ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ.. ‘ఇది కొత్త శిలీంధ్రం కాదు. అమెరికా, భారత్, పాకిస్తాన్, చైనా సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఉనికిలో ఉంది. అనేక పంటల కంకులను ఆశించి, దిగుబడికి పెను నష్టం చేస్తుంటుంది. ఇది సోకిన ధాన్యం తింటే వికారం, వాతులు వంటి సమస్యలు వస్తాయి. అయితే, పంటలకు విధ్వంసకమైనదైనప్పటికీ ఇది ప్రాణహాని కలిగించినట్లు ఆధారాలు లేవు. నిజానికి పప్పులు, మిరపకాయలు, వేరుశనగలను ఆశించే అఫ్లోటాక్సిన్లు దీనికన్నా ప్రమాదకరం. ఒక్కోసారి కేన్సర్ కారకం కూడా కావచ్చు’ అన్నారు.దిగుమతి, ఎగుమతికి క్వారంటైన్ తప్పనిసరి!శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాలు, మొక్కలు వంటి జీవ పదార్థాలను ఒక దేశం పరిశోధనల కోసం, వ్యాపార రీత్యా అధికారికంగా ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా అంత సులువేమీ కాదు. అంతర్జాతీయ మొక్కల సంరక్షణ ఒడంబడిక (ఐపిపిసి)లో పేర్కొన్న విధంగా కఠినమైన క్వారంటైన్ నియమ నిబంధనలను రెండు దేశాలూ త్రికరణశుద్ధితో పాటించాల్సిందే.ఎగుమతి చేసే దేశం ప్రమాదం లేదని ఫైటో శానిటరీ సర్టిఫెకెట్ ఇవ్వాలి. దిగుమతి చేసుకునే దేశ ప్రభుత్వం దిగుమతి చేసుకునే సంస్థ/వ్యక్తికి ఇంపోర్ట్ పర్మిట్ ఇవ్వాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకున్న తర్వాత ఒక సీజన్లో క్వారంటైన్ చట్టాల ప్రకారం ప్రయోగాలు చేసి, అందులో హానికారక చీడపీడలు ఏవీ రవాణా కావటం లేదని నిర్థారించుకున్న తర్వాతే ఆ దేశపు సహజ వాతావరణంలోకి ప్రవేశపెట్టడానికి అనుమతిస్తారు. ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుంది. చదవండి: జాబ్స్ టియర్స్.. కొత్త మిల్లెట్ పంట!ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాలన్నీ సాధారణ వ్యవసాయోత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు కూడా శానిటరీ, ఫైటో శానిటరీ నియమాలు పాటించాల్సిందే. ఈ నియమాలను అమలుచేసే పటిష్ట క్వారంటైన్ వ్యవస్థ అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉంటుంది. ఎయిర్‌పోర్టులు, సీపోర్టుల్లో తనిఖీలు అతి కఠినంగా ఉంటాయి. అమెరికా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న హవాయి రాష్ట్రం నుంచి దాదాపు అన్ని రకాల పండ్లు కూరగాయలు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లడానికి నిర్దిష్టమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయన్నారు డాక్టర్ శరత్‌బాబు.మన క్వారంటైన్ వ్యవస్థ బలహీనం చైనా నుంచి ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రాన్ని అమెరికాకు తీసుకెళ్లింది పరిశోధనల కోసమైనప్పటికీ క్వారంటైన్ నిబంధనలు పాటించలేదు. అనుమతులు లేవు కాబట్టే ఈ పనిని ‘వ్యవసాయ ఉగ్రవాద’ చర్యగా అమెరికా సీరియస్‌గా పరిగణించింది. జియోపొలిటికల్ ఉద్రిక్తతలు కూడా దీనికి కారణమై ఉండొచ్చు. ఈ శిలీంధ్రం అన్ని దేశాల్లోనూ ఉన్న జాతే. అయినా, వేర్వేరు దేశాల్లో అనేక ఉపజాతులు ఉంటాయి. ఒక ఉపజాతి ఒక దేశంలో పెద్ద సమస్య కాకపోయినా, వేరే దేశంలోని విభిన్న వాతావరణంలోకి వెళ్లిన తర్వాత పెను విపత్తు సృష్టించవచ్చు లేదా నిద్రాణంగా ఉండిపోవచ్చు. అందుకే జీవపదార్థాలేవైనా దేశ సరిహద్దులు దాటించేటప్పుడు కఠినమైన క్వారంటైన్ పరీక్షలు చెయ్యటం తప్పనిసరి. మన దేశంలో ఈ క్వారంటైన్ వ్యవస్థ బలహీనంగా ఉంది. ఇకనైనా పటిష్టం చెయ్యాలి.– డాక్టర్ బలిజేపల్లి శరత్‌బాబు, అధ్యక్షులు, ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మాజీ సంచాలకులు, జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్‌బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం. -
ఒక చావు.. మరో పుట్టుక.. ఈగను చంపేసి వృద్ధి చెందిన ‘జాంబీ’ ఫంగస్
ఈ ఫొటో చూశారా? ‘బీఎంసీ ఎకాలజీ అండ్ ఎవాల్యూషన్ ఇమేజ్’ పోటీలో మొదటిస్థానం దక్కించుకుంది. అందులో ప్రత్యేకత ఏముందనేగా సందేహం? ఈగలోకి ప్రవేశించిన ‘జాంబీ’ ఫంగస్ ఈగను చంపేసి.. అది వృద్ధి చెందింది. ఈగ మరణించి... ఫంగస్ బతకడమే కాదు, మరింత విస్తరించటానికి ఉపయోగపడింది. ఒక చావు.. మరో పుట్టుక. జీవ పరిణామ క్రమమే అది కదా! సైన్స్ ఫిక్షన్‌ను తలపిస్తున్న ఈ చిత్రాన్ని పరిణామ జీవశాస్త్రవేత్త రాబర్టో గ్రాసా రో, పెరూలోని తంబోపత నేషనల్ రిజర్వ్‌లో క్యాప్చర్ చేశాడు. రిలేషన్షిప్స్ ఇన్ నేచర్, బయోడైవర్సిటీ అండర్ థ్రెట్, లైఫ్ క్లోజప్, రీసర్జ్ ఇన్ యాక్షన్ అనే నాలుగు కేటగిరీల్లో జరిగిన పోటీల్లో... జాంబీ ఫంగస్ ఫొటో టాప్ ప్రైజ్ గెలుచుకుంది. చదవండి: మిస్టరీ కేసు: ఆన్లైన్ వేలంలో కొన్న సూట్‌కేసులో ఏముందంటే... -
ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి.. కారణం తెలియట్లేదు!!
వ్యవసాయంలో చీడ పీడల నియంత్రణతోపాటు ఆయుర్వేదంలోనూ కీలక పాత్ర నిర్వహించే వేప చెట్టుకు పెను కష్టం వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో వేప చెట్లు చిగుర్ల దగ్గర నుంచి కింది వరకు క్రమంగా నిలువునా ఎండిపోతున్నాయి. అనంతపురం, కర్నూలు తదితర రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలోనూ వేపచెట్లు ఎండిపోతున్నాయని సమాచారం. మొవ్వులు, చిగుర్లు, లేత కొమ్మలు, ఆకులు ఎర్రగా మారి రాలిపోతున్నాయి. పూత, కాయలు కుళ్లిపోతున్నాయి. తీవ్రత ఎక్కువగా ఉంటే ఎంత ముదురు చెట్టయినా కొద్ది రోజుల్లోనే చనిపోతున్నది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు పది శాతం చెట్లు చనిపోయినట్లు చెబుతున్నారు. పొలాలు, బంజరు భూముల్లోనే కాకుండా.. బెంగళూరు, హైదరాబాద్, అనంతపురం వంటి నగర, పట్టణ ప్రాంతాల్లోనూ వేప చెట్లు చనిపోతున్నాయి. కారణం ఏమిటి? ‘డై బ్యాక్ డిసీజ్’ అని కొందరు, కాదు ‘టి మస్కిటో బగ్’ వల్ల అని మరికొందరు నిపుణులు చెబుతుండటంతో స్పష్టత కరువైంది. మట్టి ద్వారా వ్యాపించే తెగుళ్లు, పంటలను నష్టపరిచే పురుగులను వికర్షింపుజేయటంలో వేప పిండి, వేప నూనె కీలకపాత్ర నిర్వహిస్తాయి. ముఖ్యంగా సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించే రైతులు ఈ తెగులుతో వేప చెట్లు ఉన్నట్టుండి చనిపోతుండటం, కాయలు కుళ్లిపోతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెగులు/పురుగు బారిన పడిన వేప చెట్టు భాగాలను తొలగించి నాశనం చేయటం ద్వారా వ్యాప్తిని అరికట్ట వచ్చని అంటున్నారు. శిలీంధ్ర నాశనులైన పురుగుమందులను చెట్లపై పిచికారీ చేయాలని కొందరు చెబుతుంటే.. ఏ శాఖ వారు పిచికారీ చేయాలన్నది సమసోయ. చెట్టు మొదటు చుట్టూ మందు కలిపిన నీటిని పోయటం ద్వారా వేపచెట్లను రక్షించుకోవచ్చని మరికొందరు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జీడిమామిడి పంటకు ఎక్కువగా టీ మస్కిటో పురుగు ఆశిస్తున్నదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జామ, చింత, మిరప, ఆపిల్, కోకోకూ ముప్పు ఉందట. అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృత పరిశోధనలు అవసరం వేప చెట్లకు ఈ బెడద కొత్తది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి సమస్య ఎదురవుతూనే ఉందని చెబుతున్నారు. తెగులు/పురుగు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే చెట్టు చనిపోతున్నట్లు గుర్తించారు. ఒక మోస్తరుగా ఉంటే ఆ సీజన్‌కు ఆకులు ఎండిపోయినా, తర్వాత వర్షాకాలంలో మళ్లీ చిగురిస్తున్నట్లు చెబుతున్నారు. అటవీ శాఖ పరిధిలోని పరిశోధనా స్థానాల శాస్త్రవేత్తలు, జాతీయ పరిశోధనా సంస్థలు ఈ సమస్యపై ఇప్పటి వరకు దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం లేదు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల సమన్వయంతో విస్తృతంగా పరిశోధనలు జరిపి వేపను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు, రైతులు అభిప్రాయపడుతున్నారు. ‘టీ మస్కిటో బగ్’తోనే చెట్లు ఎండుతున్నాయి ►‘టీ మస్కిటో బగ్’ రాత్రిళ్లు వేప చెట్లపై చేరి రసం పీల్చటమే కారణం ►సుడి భాగం నుంచి క్రమంగా వేర్లతో సహా ఎండిపోతున్న చెట్లు అనంతపురం జిల్లా వ్యాప్తంగా వందలాది వేప చెట్లు ఎండుముఖం పడుతున్న పరిస్థితి నెలకొంది. అటవీ శాఖ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 10 లక్షల సంఖ్యలో వేప చెట్లు ఉన్నాయి. అందులో ఇప్పటికే 20 శాతం చెట్లు ఎండుముఖం పట్టినట్లు అంచనా వేస్తున్నారు. టీ మస్కిటో బగ్ అనే పురుగు ఆశించడం వల్ల వేపచెట్లు ఎండుతున్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఏఆర్ఎస్), కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) శాస్త్రవేత్తలు తెలిపారు. ‘టీ మస్కిటో బగ్’ అనే పురుగు ఆశించడం వల్ల సుడి భాగం క్రమంగా రెమ్మలు, కొమ్మలు, కాండం ఎండిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుందని తెలిపారు. టీ మస్కిటో బగ్ సగటు జీవిత కాలం 22 రోజులు. ఈ పురుగు ఉదయం, సాయంత్రం వేప చెట్లను ఆశించి రసం పీల్చడం వల్ల చెట్లు ఎండుతున్నదని అంటున్నారు. పగటి సమయం ఎక్కడైనా పొదల్లో దాక్కుని ఉంటుందని తెలిపారు. అధిక వర్షాలకు కూడా ఇలా జరుగుతుందన్నారు. ఇది నల్లటి తల, ఎర్రటి గోధుమ రంగులో ఉంటుందన్నారు. పూర్తి స్థాయి పరిశోధనలు జరగాలి సర్వరోగ నివారణిగా, పరమ పవిత్రంగా భావించే వేప చెట్లకు ఇలాంటి పరిస్థితి రావడం వల్ల రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మా కళాశాల ఆవరణలో ఉన్న వేప చెట్టు పూర్తిగా ఎండిపోయింది. దీనిపై పూర్తిస్థాయి పరిశోధనలు జరగాలి. నివారణ చర్యలు చేపట్టాలి. సమస్య ఉన్న చెట్లపై బావిస్టన్ మందు పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. – డాక్టర్ ఎల్.నాగిరెడ్డి (90529 36150), వృక్ష శాస్త్ర సహాయ ఆచార్యులు, మాస్టర్ మైండ్స్ డిగ్రీ కళాశాల, అనంతపురం అప్పుడప్పుడు ఇంతే.. ఆందోళన వద్దు.. ‘టీ మస్కిటో బగ్’ ఆశించడం వల్ల వేప చెట్లు ఎండుతున్నాయి. అధిక వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల అప్పుడపుడు ఇది ఆశిస్తుంది. పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే 10 శాతం లోపు చెట్లు చనిపోవచ్చు. లేదంటే, చలికాలం తగ్గిన తర్వాత చెట్లన్నీ తిరిగి కొత్త చిగుర్లు వేయడం గతంలో చూశాం. ఈ పురుగు నివారణకు 2 మి.లీ. ప్రొపినోఫాస్ లేదా 0.2 గ్రాముల థయోమిథాక్సామ్ లేదా 2 మి.లీ. డయోమిథోయేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. – డాక్టర్ పి.రాధిక (94905 40120), ప్రధాన శాస్త్రవేత్త, కీటక శాస్త్ర విభాగం, వ్యవసాయ పరిశోధనా స్థానం, రేకులకుంట, అనంతపురం జిల్లా గోరింటాకు ద్రావణం పిచికారీ చేయాలి సహజ ఔషధ గుణాలున్న వేప చెట్లు ‘వేప డై బాక్ వ్యాధి’ నాశనం అవుతున్నాయి. ఈ శిలీంధ్రపు వ్యాధిని మొదటగా డెహ్రాడూన్ అడవుల్లో 1997లో కనుగొన్నారు. ఇది ‘ఫామోఫ్సిస్ ఆజాడిరక్టే’ అనే శిలీంద్రం వల్ల వస్తుందని మైసూర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సతీష్, శంకర్ భట్, దేవకి గుర్తించారు. లేత చిగుళ్లు, కొమ్మలు నల్లగా మాడిపోవడం, పూలు వాడిపోవడం, కాయలు కుళ్ళి పోవటం దీని ముఖ్య లక్షణాలు. వర్షాకాలంలో ప్రారంభమై చలికాలం వరకు తీవ్రంగా ఉంటుంది. సంవత్సరం అంతా ఈ వ్యాధి ప్రబలుతూనే ఉంటుంది. దీని వల్ల నూటికి నూరు శాతం కాయలు కుళ్ళి పోతాయి. ఈ వ్యాధి వర్షం నీరు, కీటకాలు, గాలి ద్వారా వ్యాపిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే వేప చెట్లు చనిపోయే అవకాశం ఉంది. దీని నివారణకు గోరింటాకును ముద్దగా నూరి కొమ్మల చివర్లపై పిచికారీ చెయ్యాలి. అంతే కాక బావిస్టీన్, కాలిజిన్, మోనోక్రోటోపాస్ లాంటి శిలీంద్ర నాశక మందులు లేదా నీలగిరి నూనె, మిరియాల నూనె వంటి వాటితో కూడా తగ్గే అవకాశం వుంది. – డా. బి.సదాశివయ్య(99635 36233), వృక్ష శాస్త్ర సహాయ ఆచార్యులు, డా. బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్చర్ల సేంద్రియ పత్తిపై శిఖరాగ్రసభ అంతర్జాతీయంగా పత్తి సాగు విస్తీర్ణంలో ఒక్క శాతం మాత్రమే సేంద్రియ పద్ధతుల్లో సాగువుతోంది. పత్తి సాగును మరింత ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియం వైపు మళ్లించి, సేంద్రియ పత్తితో తయారు చేసిన వస్త్రాలను మార్కెట్లోకి తేవటం ద్వారా రైతు ఆదాయం పెంపొందించవచ్చు. భూమి ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతాయని న్యూజిలాండ్‌కు చెందిన లాభాపేక్ష లేని సంస్థ ‘ఆర్గానిక్ కాటన్ యాక్సిలరేటర్’ భావిస్తోంది. సేంద్రియ పత్తి సాగును విస్తరింపజేయడానికి ఉన్న అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు నవంబర్ 8,9 తేదీల్లో అంతర్జాతీయ శిఖరాగ్రసభను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఆసక్తి గల వారు వర్చువల్‌గా జరుగుతున్న ఈ సభలో ఉచితంగా రిజిస్టర్ చేసుకొని పాల్గొనవచ్చు.. www.organiccottonaccelerator.org ప్రకృతి వ్యవసాయంపై 6 వారాల శిక్షణ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘భూమి కాలేజి’ ప్రకృతి వ్యవసాయంపై ఔత్సాహికులకు లోతైన అవగాహన కల్పించే లక్ష్యంతో 6 వారాల పాటు ఆంగ్ల మాధ్యమంలో రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనుంది. డిసెంబర్ 6 నుంచి జనవరి 15 వరకు. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనుభవం గడించిన వారు పాఠాలు చెబుతారు. పొలాలు చూపిస్తారు. నలుగురితో కలిసి మెలసి స్వయంగా వ్యవసాయ పనులు చేయటం, ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని స్వీకరించడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. ఫీజు రూ. 40 వేలు. వివరాలకు.. www.bhoomicollege.org చదవండి: 65 ఏళ్ల ఎదురుచూపు.. మరణం వరకు.. అద్భుత ప్రేమ గాథ! -
ఫ్రంట్‌లైన్ వారియర్స్‌పై ‘ఫంగస్’ దాడి
మైసూరు: రాచనగరిలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ బెడద వేధిస్తోంది. మైసూరు పాలికె కాంట్రాక్టు ఉద్యోగులు వినోద్ (28), రవి (38) బ్లాక్ ఫంగస్‌తో చనిపోయారు. కరోనాతో మరణించిన వారి మృతదేహాలను తరలించే రవికి గత 16 రోజుల క్రితం కోవిడ్ సోకింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతనికి ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ లక్షణాలు కూడా కనిపించగా బుధవారం మరణించాడు. ఫాగింగ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వినోద్‌కు మూడు రోజుల క్రితమే కరోనాతో పాటు ఫంగస్ సోకడంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బుధవారం మరణించాడు. దీంతో పాలికె ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. చదవండి: డేంజర్ జోన్లో 6 జిల్లాలు చదవండి: టీకా రక్ష.. అందని ద్రాక్ష? -
ఆరుగురు డాక్టర్లతో బృంద వైద్యం
సాక్షి, అమరావతి: బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారిని ఆరుగురు వైద్యుల బృందం పర్యవేక్షించాల్సి ఉంటుంది. జనరల్ ఫిజీషియన్, ఈఎన్టీ సర్జన్, ఆఫ్తాల్మాలజీ, న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్, హెడ్–అండ్ నెక్ సర్జన్లతో కూడిన బృందం క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు ట్రీట్మెంట్ ప్రొటోకాల్స్‌పై ఆదేశాలు జారీచేసింది. నిపుణుల బృందం పరిశీలించిన అనంతరం వైద్యారోగ్య శాఖ ఈ మార్గదర్శకాలిచి్చంది. నాసికా మార్గం ద్వారా బ్లాక్ ఫంగస్ వేగంగా వ్యాపించి రక్త నాళాలను మూసివేస్తుంది. నియంత్రణలో లేని మధుమేహం, స్టెరాయిడ్స్, రోగ నిరోధక మందులు ఎక్కువగా వాడటం, ఎక్కువ కాలం ఆక్సిజన్ థెరపీలో, వెంటిలేటర్‌పై ఉండటం వల్ల జబ్బు సోకే అవకాశం ఉంటుంది. ఐసీయూలోని గొట్టాలను సరిగా శుభ్రపరచకపోవడం వల్ల కూడా ఫంగస్ వస్తుంది. ► నిర్ధారణ.. ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయాలి. ముక్కు ఎండోస్కొపీ ద్వారా ఈ జబ్బును గుర్తించవచ్చు. సీటీ స్కాన్ ద్వారా ముక్కులో గాలి గదుల్లో ఇన్ఫెక్షన్ తెలుసుకోవచ్చు. మెదడుకు, కంటికి సోకిందో లేదో ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ► నివారణా మార్గాలు.. స్టెరాయిడ్లను అవసరం మేరకు తగిన మోతాదులో మాత్రమే వాడాలి. ఆక్సిజన్ ఇచ్చే సమయంలో శుభ్రమైన నీటిని వాడాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ బెటడిన్‌తో నోటిని పుక్కిలించాలి. -
బ్లాక్‌ఫంగస్ కేసులపై పరిశీలన
సాక్షి, అమరావతి: కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారికి సోకే బ్లాక్‌ఫంగస్‌పై పూర్తిస్థాయిలో సమాచారం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలతో కొంతమందిలో భయాందోళనలు ఉన్నాయన్నారు. ఇలాంటి కేసులపై పరిశీలన చేయాలని అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించామని, దీనిపై నేటి సాయంత్రానికి నివేదిక ఇస్తారని చెప్పారు. ఆయన ఆదివారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. చాలా అరుదుగా వచ్చే ఈ వ్యాధిపై ఖచ్చితమైన వివరాలతో మాట్లాడాలన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి కేంద్రమే దానికి సంబంధించిన మందులు కేటాయించిందని, మన రాష్ట్రానికి 1,600 వయల్స్ కేటాయించిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు తగినంత స్టాకు ఉన్నాయని, గడిచిన 24 గంటల్లో ప్రైవేటు ఆస్పత్రులకు 18 వేలకుపైగా ఇంజక్షన్లు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే జామ్‌నగర్, దుర్గాపూర్, జంషెడ్పూర్ల నుంచి రావాల్సిన ఆక్సిజన్ చేరిందన్నారు. త్వరలోనే స్టోరేజీ కెపాసిటీకి చేరతామని చెప్పారు. 104 కాల్‌సెంటర్ ద్వారా వైద్యులు సుమారు 15 వేలమందికిపైగా హోం ఐసొలేషన్‌లో ఉన్న బాధితులకు ఫోన్‌చేసి వివరాలు తెలుసుకుని, వైద్యసాయం చేశారని తెలిపారు. -
షుగర్ నియంత్రణలో ఉంటే 'ఫంగస్' రాదు
సాక్షి, అమరావతి: ‘కరోనా బాధితుల్లో 10 నుంచి 15 శాతానికి మించి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉండరు. వారిలోనూ వెయ్యిలో ఒకరికి కూడా బ్లాక్‌ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) రాదు. బ్లాక్‌ఫంగస్‌పై భయాందోళన కలిగించేలా వెలువడుతున్న కథనాలు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. స్టెరాయిడ్స్ వాడటం వల్ల మధుమేహం నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడుతున్న వారిలో తీవ్ర భయం కలుగుతోంది. వాస్తవానికి షుగర్‌ను నియంత్రణలో ఉంచుకుంటే బ్లాక్‌ఫంగస్ గురించి భయపడాల్సిన పనే లేదు’ అని వైద్యులు చెబుతున్నారు. గ్లూకోమీటర్ తప్పనిసరి షుగర్ చెక్ చేసుకోవడానికి ఇంట్లో గ్లూకోమీటర్ ఉంచుకోవడం తప్పనిసరి అని.. రోజూ ఉదయం పరగడుపున షుగర్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆ సమయంలో షుగర్ లెవెల్ 125 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. టిఫిన్ తిన్న గంటన్నర తర్వాత చెక్ చేసుకుంటే 250 కంటే తక్కువగా ఉండాలంటున్నారు. వీలైతే ఒకసారి ల్యాబ్‌కు వెళ్లి హెచ్‌బీ ఏ1సీ (మూడు మాసాల సగటు) చూపించుకోవాలని.. గరిష్టంగా 7.2 కంటే తక్కువగా ఉంటే ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఇన్సులిన్ నిరభ్యంతరంగా వాడొచ్చు కరోనా బాధితుల్లో స్టెరాయిడ్స్ వాడిన తర్వాత షుగర్ ఎక్కువ అవుతుందని, అప్పుడు మందులతో నియంత్రణలోకి రాదని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి వాళ్లు షుగర్ నియంత్రణలోకి వచ్చేవరకూ ఇన్సులిన్ వాడుకోవచ్చని, నియంత్రణలోకి వచ్చాక ఇన్సులిన్ ఆపేసి తిరిగి మందులు వాడొచ్చని స్పష్టం చేస్తున్నారు. చాలామంది బరువు పెరుగుతామని, ఇతర ఇబ్బందులొస్తాయని ఇన్సులిన్ వాడకానికి వెనక్కు తగ్గుతున్నారని.. ఇది సరికాదని చెబుతున్నారు. కార్బొహైడ్రేట్స్‌కు దూరంగా ఉండాలి కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం షుగర్ స్థాయిలను పెంచుతుంది. ఉదాహరణకు బియ్యంతో చేసిన అన్నం, ఇడ్లీలు, దోశలు, పఫ్‌లు, బంగాళ దుంప వంటి వాటికి దూరంగా ఉండాలి. జొన్న, రాగులు, కొర్రలు, అండు కొర్రలు వంటి వాటితో చేసిన ఆహారం, పీచు పదార్థాలు కలిగిన కూరగాయలు (బీరకాయ, సొరకాయ, చిక్కుడు, గోరు చిక్కుడు వంటివి), సిట్రస్ జాతికి చెందిన పైనాపిల్, నిమ్మ వాడొచ్చు. జామ పండ్లు తినొచ్చు. ఇవి తింటే షుగర్ లెవెల్స్ పెరగవు. పైగా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. ఫంగస్ వచ్చే అవకాశమే ఉండదు. సామాజిక మాధ్యమాల్లో దీనిపై ఎక్కువ వార్తలు రావడంతో మందులు బ్లాక్‌లో అమ్ముతున్నారు. బ్లాక్ ఫంగస్‌కు భయపడాల్సిన పనిలేదు బ్లాక్ ఫంగస్ అనేది లక్షలో ఒకరికి వచ్చేది. దానికి భయపడాల్సిన పనిలేదు. అది కూడా అక్కడక్కడా షుగర్ పేషెంట్లకు మాత్రమే. మొత్తం కరోనా బాధితుల్లో 10 శాతం మంది కూడా షుగర్ బాధితులు ఉండరు. ఉన్న వాళ్లు.. షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. షుగర్ స్థాయి 250 కంటే తక్కువగా ఉంటే ఫంగస్ రాదు. ప్రాథమికంగా గుర్తిస్తే నివారించవచ్చు. – డాక్టర్ సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు, కర్నూలు రెండు లక్షల్లో నాలుగైదు కూడా లేవు బ్లాక్ ఫంగస్ దశాబ్దాల నుంచీ ఉన్నదే. ఇది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. రాష్ట్రంలో 2 లక్షల పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉంటే నాలుగైదు కూడా ఫంగస్ కేసులు రాలేదు. దీని గురించి భయాందోళన అవసరం లేదు. పరిమితికి మించి స్టెరాయిడ్స్, యాంటీ బయోటిక్స్ వాడిన.. నియంత్రణలో లేని డయాబెటిక్ వారికి మాత్రమే వస్తుంది. అది కూడా అరుదు. దీనిగురించి మధుమేహ రోగులు గానీ, సాధారణ కోవిడ్ బాధితులు గానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేనే లేదు. – డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, న్యూరో ఫిజీషియన్ (చైర్మన్–ఏపీఎంఎస్ఐడీసీ) ఎలా సోకుతుందంటే.. వాతావరణంలో సహజంగానే ఉండే మ్యుకోర్ అనే ఫంగస్ వల్ల అరుదుగా ఇది మనుషులకు సోకుతుంది. గాలి పీల్చుకున్నప్పుడు ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లో, సైనస్ వద్ద చేరుతుంది. ముఖ్యంగా కోవిడ్ సోకిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదా రోగ మితిమీరి స్పందించకుండా వ్యాధి నిరోధక శక్తిని కట్టడి చేయడానికి స్టెరాయిడ్స్ వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది. అవయవ మార్పిడి జరిగిన వారిలో, ఐసీయూలో చికిత్స పొందిన వారికి దీని ముప్పు ఎక్కువే. దీర్ఘకాలిక జబ్బులున్న వారు, శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు, ప్రస్తుతం కోవిడ్ చికిత్సలో మోతాదుకు మించి స్టెరాయిడ్లు వాడితే వారిలో రోగ నిరోధక శక్తి ఒక్కసారిగా తగ్గిపోతుంది. వారి శరీరంలో చక్కెర స్థాయిలు గాడి తప్పుతాయి. ఇలాంటి సమయంలో ఫంగస్ శరీరంలోకి ప్రవేశిస్తే.. విపరీతంగా వృద్ధి చెంది, ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కృత్రిమ ఆక్సిజన్ తీసుకుంటున్న పేషెంట్లకు సైతం బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఉండొచ్చు. లక్షణాలివీ.. ► ముఖంలో వాపు ఉన్నప్పుడు ముందుగా ఈ లక్షణాలు బయటపడతాయి. ► కంటిగుడ్డు కింద ఎర్రబడి దురదగా ఉండటం (ఆఫ్తాల్మో ప్లీజియా). ► ముక్కులో దురదగా ఉండటం, పదేపదే ముక్కును నలిపేయాలనిపించడం. ► కళ్లపైన లేదా కళ్ల కింద చిన్న ఉబ్బులు కనిపించడం. కంటిచూపు తగ్గినట్టుగా లేదా మసకగా అనిపించడం. ► దంతాల్లో నొప్పిగా ఉండటం. ముఖంపై నొప్పి, తిమ్మిరి, వాపు వంటితో పాటు మొద్దుబారడం కూడా వంటివి కూడా దీని లక్షణాలు. -
‘రొయ్యో’ మొర్రో
* వైరస్.. ఫంగస్ దాడులు * ఏటా ఇదే దుస్థితి * దిక్కుతోచని రైతులు * అందుబాటులో లేని ల్యాబ్‌లు ఆకివీడు : రొయ్య రైతులు కుయ్యోమొర్రోమంటున్నారు. ఒక పక్క వైరస్, మరోపక్క ఫంగస్ వ్యాధులు విజృంభించడంతో కలవరపడుతున్నారు. ఆక్సిజన్‌తోపాటు, చెరువులోని నీటిలోపాల వల్ల ఈ వ్యాధులు సోకుతున్నాయి. వనామి రొయ్యకు వచ్చే ఈ వ్యాధులను నిర్మూలించడం రైతులు, శాస్త్రవేత్తల తరం కావడంలేదు. వాతావరణంలో వచ్చిన మార్పులతోనే ఇవి సోకుతున్నాయని రైతులు చెబుతున్నారు. ప్రతిఏటా ఇదే దుస్థితి తలెత్తుతోందని, ఒక్కసారిగా విజృంభిస్తున్న వ్యాధులు రూ.వేల కోట్ల రూపాయలను దిగమింగేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. రొయ్య డొప్పపై బూడిద రంగు, ఆకుపచ్చని జిగురు వంటి పొర ఏర్పడడాన్ని పాకుడు వ్యాధి అని పిలుస్తారు. ఇది ప్రస్తుతం అక్కడక్కడ కనిపిస్తోంది. దేహంపై నల్లని తుప్పు రంగు ఏర్పడడాన్ని బ్రౌన్ స్పాట్ వ్యాధి అని, మోప్పలు నలుపు రంగులోకి మారడాన్ని బ్లాక్గిల్ అని, ఎరుపు రంగులోకి మారడాన్ని రెడ్ గిల్ అని, రొయ్య మీసాలు, తోక కుళ్లడాన్ని రాట్ వ్యాధి అని, బాక్టీరియా పట్టడాన్ని విబ్రోయోసిస్ అని పిలుస్తారు. ఇవన్నీ కూడా అక్కడక్కడ చెరువుల్లో కనబడుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటిని నియంత్రణకు ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నారు. అత్యంత ప్రమాదకరమైంది వైరస్ రొయ్యలకు సోకే వ్యాధిలో అత్యంత ప్రమాదకరమైంది వైరస్. ఇది సోకిన రొయ్యలు నిర్విరామంగా గట్టు వెంబడి తిరుగుతాయి. దేహంపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. నీలిరంగులోకి మారిన రొయ్యలకు పూర్తిగా వైరస్ సోకినట్టు నిర్ధారిస్తారు. ఇవి జీర్ణగ్రంధి పాడై గుట్టలుగుట్టలుగా చనిపోతాయి. ఈ వైరస్ సోకిన రొయ్యలను వెంటనే గుర్తించకపోతే రైతుకు పెట్టుబడులు కూడా దక్కవు. చెరువుల్లో ఒక్క రొయ్య కూడా కన్పించదు. ఈ వ్యాధి నివారణ కూడా కష్టమే. ఫంగస్ వ్యాధి(ఈహెచ్‌పీ) రొయ్య ఫంగస్ వ్యాధికి గురైతే ఎదుగు దల ఉండదు. ఈహెచ్‌పీ ఫంగస్ జీర్ణ గ్రంధికి వస్తోంది. చెరువుల్లో పెరిగిన రొయ్యలకు ఎంత మేత వేసినా ఎదుగుదల లేకపోవడంతో రైతు ఆర్థికంగా నష్టపోతాడు. ఈ వ్యాధి పిల్ల దశలోనే రొయ్యకు సోకుతోంది. ఆ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ఈ వ్యాధిని ప్రభుత్వం గత ఏడాది గుర్తించింది. అందుబాటులో లేని ల్యాబ్‌లు రొయ్యలు వ్యాధులకు గురైతే నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కనీసం ల్యాబ్ సౌకర్యాన్ని కూడా కల్పించడంలేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కోస్తా జిల్లాల్లో వేలాది ఎకరాల్లో రొయ్యల సాగు సాగుతోంది. రైతులే శాస్త్రవేత్తలుగా ఆయా వ్యాధులను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రైవేటు ల్యాబ్‌లు అక్కడక్కడా ఉన్నా రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. పన్ను వసూళ్లకు యత్నాలు అసలే వ్యాధులు, ప్రతికూలవాతావరణంతో సతమతమవుతున్న రైతులకు సహాయసహకారాలు అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా యత్నాలు సాగించడం లేదు. పెపైచ్చు ఆక్వా రంగంపై పన్ను విధించి కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఆక్వా జోన్లను ఏర్పాటు చేసి చేపలు, రొయ్యల చెరువుల తవ్వకానికి భారీగా అనుమతులు మంజూరు చేసేందుకు యత్నిస్తోంది. తదనంతర చర్యగా రొయ్య, చేపల అమ్మకంపై పన్ను, ఎక్సైజ్ సుంకం, ఇతరత్రా సవా లక్ష పనులు విధించే యోచనలో ఉంది. ఇంతవరకూ ఆహారోత్పత్తుల కేటగిరిలో చేపలు, రొయ్యల సాగు, అమ్మకాలు, ఎగుమతులపై పన్ను లేదు. ఈ నేపథ్యంలో పన్ను విధింపునకు సిద్ధపడుతున్న ప్రభుత్వం ఆక్వా రైతుల బాగోగులనూ పట్టించుకోవాలని రైతులు కోరుతున్నారు. సకాలంలో గుర్తించాలి ప్రస్తుతం 50శాతం చెరువుల్లో ఫంగస్, 30 శాతం చెరువుల్లో వైరస్ వ్యాధులు కనిపిస్తున్నాయి. సీడ్ దశలో ఈ వ్యాధులు సోకితే నష్టం తీవ్రంగా ఉంటుంది. రొయ్యలు ఎదిగిన తర్వాత వస్తే ప్రభావం తక్కువగా ఉంటుంది. సీడ్ దశలో సకాలంలో గుర్తిస్తేనే నివారణ సాధ్యం. - ఎ.రవికుమార్ శాస్త్రవేత్త