breaking news
FTF
-
ప్రైవేట్ బ్యాంక్స్.. టాప్ గన్స్!
రుణాల వృద్ధి, మొండిబాకీల తగ్గుదలతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ సంస్థలు మెరుగైన పనితీరు కనపర్చవచ్చంటున్నారు యూటీఐ ఏఎంసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సచిన్ త్రివేది. బ్యాంకింగ్ విభాగంలో ప్రైవేట్ బ్యాంకులు ఆశావహంగా కనిపిస్తున్నాయని, ఫార్మా కూడా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ఎన్నికలు.. మార్కెట్లపై.. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో దేశీ ఈక్విటీ మార్కెట్ల పనితీరు ఇతర దేశాల మార్కెట్లతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంది. విదేశీ సంస్ధాగత పెట్టుబడుల (ఎఫ్ఐఐ) రాకతో ప్రస్తుతం ఈ లోటు తీరగలదని అంచనాలు ఉన్నాయి. తొలి రెండు నెలల్లో ఎఫ్ఐఐలు దాదాపు 6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫలితాలు వెల్లడయ్యే దాకా స్వల్పకాలిక ఇన్వెస్టర్లు కాస్త నెర్వస్‌గానే ఉండొచ్చు. అయితే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు మాత్రం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రధానంగా కంపెనీల ఆదాయాల అంచనాలు, వాటికి తగ్గట్లుగా షేరు ధరలు ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ప్రైవేట్ రంగ బ్యాంకులు మెరుగ్గా ఉన్నట్లు భావిస్తున్నాం. మూలధనం తగినంత స్థాయిలో ఉన్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో రుణాల వృద్ధికి సంబంధించి ప్రైవేట్ బ్యాంకులు ముందంజలో ఉండే అవకాశం ఉంది. గత కొన్నాళ్లుగా ఫార్మా రంగం అంతగా రాణించలేకపోయినప్పటికీ .. ప్రస్తుతం ఎకానమీ, ఎగుమతులు పుంజుకుంటున్న నేపథ్యంలో కొంత మెరుగుపడే అవకాశం ఉంది. మధ్యకాలికంగా చూస్తే ఐటీ రంగం కూడా బాగానే కనిపిస్తోంది. డీల్స్ సంఖ్య పెరుగుతోంది. అమ్మకాలపరంగా ఆటోమొబైల్ రంగం సవాళ్లు ఎదుర్కొంటోంది. కానీ వేల్యుయేషన్స్ ప్రస్తుతం బాగా కరెక్షన్కు లోనయ్యాయి. కొన్ని షేర్లు ఆకర్షణీయంగా కూడా కనిపిస్తున్నాయి. స్థూల గణాంకాలు చూస్తుంటే ఆర్థిక కార్యకలాపాలు కాస్త తగ్గిన ట్లుగా కనిపిస్తోంది. డిమాండ్‌పరంగా మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైనా నిర్దిష్ట రంగం లేదా స్టాక్‌పైనే దృష్టి పెట్టడం శ్రేయస్కరం. ఉదాహరణకు రుణ వృద్ధి పుంజుకోవడం, మొండిబాకీలు తగ్గుతుండటం వంటివి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు మెరుగైన పనితీరు కనపర్చవచ్చు. ఇక ఐటీ కంపెనీలకు నాలుగో త్రైమాసికం సీజనల్‌గా బలహీనంగానే ఉంటుంది. కరెన్సీపరమైన ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురుకావొచ్చు. ఇక మా నిర్వహణలోని యూటీఐ టీఅండ్ఎల్ ఫండ్ ప్రధానంగా రవాణా, ఆటో, లాజిస్టిక్స్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఇటీవలి కాలంలో వాహన రంగం చాలా సవాళ్లు ఎదుర్కొంటోంది. ఫలితంగా కొనుగోలుదారులపై అధిక భారం మోపాల్సి వస్తోంది. ఇలా కొనుగోలు వ్యయాలు పెరిగిపోతుండటం వల్ల డిమాండ్ మందగించింది. పండుగల సీజన్, ఆ తర్వాత కూడా ఇదే ధోరణి నెలకొంది. వ్యయాలు పెరిగిపోవడం, డిమాండ్ తగ్గడం వంటి అంశాలతో వాహన కంపెనీల లాభాల అంచనాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో వాటి వేల్యుయేషన్స్ సైతం కరెక్షన్కు లోనయ్యాయి. అయితే, ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. భారత మార్కెట్లో వాహనాల వినియోగం ఇంకా పూర్తి స్థాయికి చేరలేదు. పెరుగుతున్న తలసరి ఆదాయాలతో డిమాండ్ కూడా మెరుగుపడవచ్చు. కొనుగోలుదారులు ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్స్ ఉన్న వాహనాలకు అప్‌గ్రేడ్ అవుతుండటంతో.. వాహన కంపెనీలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టే ఈ రంగంపై మేం ఆశావహంగా ఉన్నాం. ఆటోమొబైల్, లాజిస్టిక్స్‌లో వృద్ధి అవకాశాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. ప్రస్తుత ఈక్విటీ మార్కెట్లపై అంచనాలు.. గడిచిన కొన్ని సంవత్సరాలుగా కంపెనీల వాస్తవ ఆర్థిక పనితీరు .. ఏడాది ప్రారంభంలో వేసే అంచనాలకన్నా తక్కువగా ఉంటోంది. ఈ మధ్యకాలంలో కొన్ని త్రైమాసికాలుగా ఆదాయాల డౌన్‌గ్రేడ్స్ మరింతగా పెరిగాయి. ప్రస్తుతం ఆదాయాల వృద్ధి కొంత మెరుగుపడుతున్న ట్రెండ్ కనిపిస్తున్నప్పటికీ.. వేల్యుయేషన్స్‌పరంగా సవాళ్లు ఉన్నాయి. ఉదాహరణకు నిఫ్టీ50 తీసుకుంటే దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే సుమారు 18% ప్రీమియంతో ట్రేడవుతోంది. అలాగే మిడ్‌క్యాప్ సూచీలు దాదాపు 8% ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. మొత్తం మీద కంపెనీల ఆదాయాలు మరింతగా మెరుగుపడాలి. ఇవి కాకుండా వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానం కూడా కొంత మేర భారత మార్కెట్లకు ఊతంగా ఉండగలదని అంచనా. -
సిరీస్‌కు సమస్యేం లేదు
- షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది - విండీస్‌తో మ్యాచ్‌లపై స్పష్టత ఇచ్చిన బీసీసీఐ న్యూఢిల్లీ: భారత్‌లో వెస్టిండీస్ జట్టు పర్యటన యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. విండీస్ క్రికెటర్లకు, ఆ దేశపు బోర్డుతో ఆర్థికపరమైన సమస్యలు కొనసాగుతున్నా... దీని ప్రభావం సిరీస్‌పై ఉండదని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. ‘తాజా సిరీస్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. నేను విండీస్ బోర్డు అధికారులతో కూడా మాట్లాడాను. ఎలాంటి అంతరాయం ఉండదని వారు మాకు హామీ ఇచ్చారు. సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు జరిగేలా చూడటం మా బాధ్యత. పర్యటన ముగిసిన తర్వాత విండీస్ బోర్డుకు ఏదైనా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన చెప్పారు. భవిష్యత్తు పర్యటన కార్యక్రమాన్ని (ఎఫ్టీఎఫ్) అందరూ గౌరవించాలని, విండీస్ ఆటగాళ్లకు వారి బాధ్యతలు తెలుసని అన్నారు. అయితే తొలి వన్డేకు ముందు విండీస్ జట్టుకు తాము డబ్బులు ఇచ్చామంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. ‘ఇది పూర్తిగా అబద్ధం. బీసీసీఐ అలాంటి చెల్లింపులు చేయలేదు. ఇలాంటి ఆర్థికపరమైన అంశాల్లో కలుగజేసుకునే ఆలోచన కూడా లేదు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం విండీస్ బోర్డుకు గ్యారంటీ మనీ మాత్రం ఎలాగూ చెల్లిస్తాం’ అని పటేల్ వెల్లడించారు. ఆటగాళ్లకు విండీస్ బోర్డు కృతజ్ఞతలు సెయింట్‌జాన్స్ (ఆంటిగ్వా): తొలి వన్డే బరిలోకి దిగి ప్రొఫెషనలిజం ప్రదర్శించిన తమ జట్టు ఆటగాళ్లకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కృతజ్ఞతలు తెలియజేసింది. మ్యాచ్ కూడా గెలుచుకున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది. ‘ఆఖరి నిమిషం వరకు మా ఆటగాళ్లు మ్యాచ్ ఆడటం సందేహంగానే అనిపించింది. అయితే బ్రేవో బృందం తీసుకున్న నిర్ణయం మా అందరికీ ఆనందాన్నిచ్చింది. నంబర్‌వన్ టీమ్‌ను ఓడించడంతో సంతోషం రెట్టింపైంది’ అని విండీస్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. మరో వైపు రెండో వన్డేకు ముందు ఆటగాళ్లతో చర్చించేందుకు బోర్డు ఉన్నతాధికారులు కొందరు న్యూఢిల్లీ రానున్నట్లు సమాచారం.