breaking news
four kidnapped
-
ఢిల్లీ: మాజీ ఎంపీ నివాసంలో కిడ్నాప్ కలకలం
-
మాజీ ఎంపీ నివాసంలో కిడ్నాప్ కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో జరిగిన కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సౌత్ అవెన్యూలోని ఆయన నివాసం ముందు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా, మహబూబ్‌నగర్‌కు చెందిన మున్నూరు రవితో పాటు మరో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని పీఏ రాజు మంగళవారం మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: రాజ్‌భవన్‌కు కాషాయం రంగు సోమవారం రాత్రి రెండు వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వీరిని అపహరించారని ఫిర్యాదులో ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ అఫిడవిట్ దాఖలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిపై మున్నూరు రవి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. -
నలుగురు వ్యక్తుల కిడ్నాప్ కలకలం..
సికింద్రాబాద్: నగరంలోని చిలకడగూడలో నలుగురు కిడ్నాప్ అవ్వడం కలకలం సృష్టించింది. నిన్న జరిగిన కిడ్నాప్ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో కిడ్నాప్ జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. గుర్తు తెలియని దుండగులు అంజలి, లక్ష్మీ, నరసింహారావు, శ్రవణ్ అనే వ్యక్తులను కిడ్నాప్ చేశారని సమాచారం. ఈ వ్యవహారానికి నిందితులు ఓ టాటా సుమోను ఉపయోగించినట్లు తెలుస్తోంది. బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.