breaking news
formers account
-
కొత్త తరహాలో ఎరువుల సబ్సిడీ బదిలీ
న్యూఢిల్లీ: ఎరువులకు సంబంధించి రూ.70 వేల కోట్ల సబ్సిడీని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసేందుకు కేంద్రం 3 కొత్త సాంకేతికతలను ప్రవేశపెట్టింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎరువుల సరఫరా, లభ్యత, అవసరం తదితర వివరాలతో కూడిన ప్లాట్‌ఫాం, అభివృద్ధిపరిచిన పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) సాఫ్ట్వేర్, డెస్క్‌టాప్ పీవోఎస్ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి (డీబీటీ) ఎరువుల సబ్సిడీ బదిలీ చేసే పథకం రెండో విడతలో భాగంగా ఈ మేరకు ఈ సాంకేతికతలను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఎరువుల సబ్సిడీ డీబీటీ మొదటి విడతను కేంద్రం 2017 అక్టోబర్‌లో ప్రవేశపెట్టింది. ఈ విడతలో పీవోఎస్ మెషీన్లలో నిక్షిప్తమైన డేటాను సరిచూసి సబ్సిడీ మొత్తాన్ని కంపెనీలకు బదిలీ చేసేవారు. ‘తాజా సాంకేతికతతో నేరుగా రైతులకు చేరువయ్యేందుకు ఎంతో దోహదపడుతుంది. ఎరువుల రంగంలో పారదర్శకత పెరుగుతుంది’అని ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ పేర్కొన్నారు. ఇప్పటివరకు 13 వెర్షన్ల పీవోఎస్ సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చామని, దేశంలోని 2.24 లక్షల రిటెయిల్ ఎరువుల దుకాణాల్లో పీవోఎస్ సాఫ్ట్‌వేర్‌ను తెచ్చామన్నారు. ల్యాప్టాప్స్, కంప్యూటర్లలో ఎరువుల విక్రయాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ను వినియోగించొచ్చని చెప్పారు. -
రుణమాఫీ ఖాతాల్లో భారీ కోత
రుణమాఫీపై సీఎం కోతలు కోసిన కొద్దిసేపటికే రైతుల ఖాతాల కుదింపు ఉగాది వేళ ప్రజలకు సంతోషాన్ని దూరం చేసిన బాబు సర్కార్ గుంటూరు: నూతన తెలుగు సంవత్సరాది కోతలతో ప్రారంభమైంది. శనివారం తుళ్లురు మండలం అనంతవరంలో జరిగిన ఉగాది వేడుకల్లో పట్టిసీమ, రాజధాని నిర్మాణం, బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటల కోతలు కోసిన కొద్దిసేపటికే.. రుణమాఫీలో భారీ కోతను విధించేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమైంది. అందుకు వీలుగా నిబంధనల పేరుతో దాదాపు 30 లక్షల రైతుల ఖాతాలను కుదించింది. ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.18,500 కోట్లు రుణమాఫీ, వడ్డీకింద రూ.2500 కోట్లు వడ్డీ కింద.. మొత్తం కలిపి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చెల్లింపులు చేశామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పండ్ల తోటల రుణ మాఫీకి మూడు వేల కోట్లతోపాటు డ్వాక్రా సంఘాల్లోని ఒక్కో మహిళకు రూ.10 వేలు చెల్లించేందుకు అవసరమయ్యే రూ10 వేల కోట్లను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. అయితే చంద్రబాబు సీఎం అయ్యేనాటికి వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు ఉండగా, శనివారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం రైతులకు చెల్లించింది కేవలం రూ.18,500 కోట్లేనని తేలింది. మరో విషయమేంమంటే 2015-16 బడ్జెట్ లో బాబు సర్కార్ రుణమాఫీకి కేటాయించింది కేవలం 4,300 కోట్లు మాత్రమే. మరోవైపు రుణమాఫీలో భారీ కోత విధించే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 83.28 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లోనుంచి దాదాపు 30 లక్షల ఖాతాలను కుదించారు. ఆధార్ కార్డు అనుసంధానం, ఇతర నిబంధనలను బూచిగా చూపి మొత్తం ఖాతాల సంఖ్యను 51.45 లక్షలకు తగ్గించివేశారు. రైతులకు చెందిన బంగారం, పాసు పుస్తకాలు కూడా నాలుగేళ్ల వరకు బ్యాంకుల్లో ఉండవలసిందేననీ అంశాన్ని కూడా నిబంధనల్లో చేర్చారు. దీంతో అప్పుల కోసం రైతులు ప్రైవేటు వడ్డీవ్యాపారుల్ని ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది.