breaking news
Former Student
-
గురువుకు ఖరీదైన కారు బహుమానం
కరీంనగర్ : పూర్వ విద్యార్థులు గురుభక్తి చాటుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయుడికి ఉద్యోగ విరమణ సందర్భంగా ఖరీదైన కారు బహూకరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ డైట్ లెక్చరర్ గుర్రాల మహేశ్వర్‌రెడ్డి గతనెల 30న ఉద్యోగ విరమణ చేశారు. గురువారం తోటి అధ్యాపకులు, విద్యార్థులు వీడ్కోలు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా శిషు్యలు, పూర్వవిద్యార్థులు మహేశ్వర్‌రెడ్డికి టాటా టియాగో ఈవీ కారును అందజేశారు. కార్యక్రమానికి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేశ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, ఎంతటి ఉన్నత స్థానానికి ఎదిగాలన్నా గురువు ఉండాలని, ఉపాధ్యాయుడే తరగతి గది సైనికుడని అన్నారు. నిరంతరం విద్యార్థుల గురించి ఆలోచిస్తూ గొప్పగొప్ప ఆలోచనలు చేస్తూ వాళ్ల పురోగతికి కృషి చేస్తాడో ఆ ఉపాధ్యాయుడు విద్యార్థుల మనసుల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంటాడన్నారు. వేలాది మంది శిష్యప్రశిషు్యలను సంపాదించుకున్న గొప్పగురువు మహేశ్వర్‌రెడ్డి అని కొనియాడారు. మహేశ్వర్ రెడ్డి సేవలను స్మరిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరామ్ మొండయ్య ఆటవెలదులలో గురుమహేశ్వరం పేరుతో ఒక శతకాన్ని వెలువరించడం గొప్ప విషయమన్నారు. డైట్ ను చూస్తే నందనవనం గుర్తుకు వస్తుందని పిల్లల క్రమశిక్షణ నడవడిక తెలంగాణలోని అన్ని డైట్లకు ఆదర్శంగా ఉందని తెలంగాణలో ఉన్న పది డైట్లలో కరీంనగర్ డైట్ ప్రథమ స్థానంలో ఉందని, ఇది ఒక సంస్కార కేంద్రమని, వివిధ కళాప్రదర్శనల నిలయమని కొనియాడారు. కవి, అవధాని డాక్టర్ గండ్ర లక్ష్మణ్‌రావు మాట్లాడారు. డైట్ ప్రిన్సిపాల్ శ్రీరామ్ మొండయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ ప్రిన్సిపాల్ జయధీర్ రెడ్డి, నిజామాబాద్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, వరంగల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ సంపత్ కుమార్ హాజరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: Samantha: సమంతకు బిగ్ రిలీఫ్.. బాంబే హైకోర్టు కీలక ఉత్తర్వులు -
వీసీ ఆఫీసుకు నిప్పు పెట్టిన తెలంగాణ విద్యార్థి
వడోదర: గుజరాత్‌లోని వడోదరలో ఉన్న మహరాజ్ శాయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా(ఎంఎస్‌యూ) వైస్ చాన్స్‌లర్ కార్యాలయానికి ఓ పూర్వవిద్యార్థి నిప్పు పెట్టాడు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన మోహన్ అనే యువకుడు 2007లో ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. అప్పటి నుంచి డిగ్రీ పట్టా ఇవ్వకుండా వర్సిటీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీసీ కార్యాలయంలోని సోఫాపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో రెండు గదులు, కొన్ని ఫైల్స్ దగ్ధమయ్యాయి. డిగ్రీ ఫైనలియర్లో ఉండగా మోహన్ వేసిన పెయింటింగ్స్ హిందూ దేవతలను కించపర్చేవిధంగా ఉన్నాయని, వాటిని ఎగ్జిబిషన్లో ప్రదర్శించాడని విశ్వహిందూ పరిషత్ గతంలో ఆరోపించింది. -
'భవానీగా ఉంటే.. అదోలా ఉండేది'
- పాఠశాలకు వచ్చిన భానుతో స్నేహితుల ముచ్చట్లు - పూర్వ విద్యార్థికి ఆసరా అందించిన ఉపాధ్యాయులు చిన్నశంకరంపేట: 'అమ్మాయిలా పెరిగినప్పటికీ వారితో స్నేహంగా ఉండాలంటే ఇబ్బం దిగా ఉండేది.. అదే అబ్బాయిలతో చనువుగా ఉండేందుకు ఇష్టపడేవాడిని'అని చిన్నశంకరంపేటకు చెందిన భవాని అలియాస్ భానుప్రసాద్ తెలిపాడు. ఇన్నాళ్లు అమ్మాయిగా పె రిగి.. ఇప్పుడు అబ్బాయిగా మారిన సందర్భంగా భానుప్రసాద్ బుధవారం చిన్నశంకరంపేటలో 'సాక్షి'తో తన అంతరంగాన్ని పం చుకున్నాడు. ఆమె అతడుగా మారిన వైనం వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మదిర గ్రామం భాగిర్తిపల్లికి చెందిన నాగులు, భాగ్యమ్మ దంపతులకు 17 ఏళ్ల క్రి తం బిడ్డపుట్టగా.. శరీరతీరును చూసి పాప గా నిర్ధారించుకున్నారు. భవాని అని పేరు పెట్టి బడికి పంపించారు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఆడపిల్ల లక్షణాలు కరువయ్యాయి. అయితే, నెల రోజుల క్రితం కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. భవానీ అమ్మాయి కాదు అబ్బాయి అని డాక్టర్లు తేల్చారు. జన్యుపరమైన లోపాల కారణంగా అంగం కడుపులోనే ఉండిపోవడంతో ఇన్నాళ్లు అందరూ అమ్మాయిగా భావించారని, శస్త్రచికిత్స చేసి అబ్బాయిగా మార్చాలని చెప్పడంతో భవానీతో పాటు.. బంధువులం తా నిర్ఘాంతపోయారు. దీంతో హైదరాబాద్‌లోని వాసవీ ఆస్పత్రిలో నెల రోజుల క్రితం శస్త్ర చికిత్స చేశారు. తర్వాత భవాని కాస్త భానుప్రసాద్‌గా మారాడు. బుధవారం భానుప్రసాద్ మాట్లాడుతూ ‘అమ్మాయిగా పెరిగినప్పటికీ నా ఇష్టాలన్నీ అబ్బాయిలాగే ఉండేవి. జడ వేసుకున్నా పూలు పెట్టుకునేందుకు ఇష్టపడేవాడిని కాదు. బొట్టు కూడా అంతంత మాత్రమే పెట్టుకునేవాడిని. పదోతరగతికి వచ్చేసరికి అమ్మాయిల కన్నా అబ్బాయిలతోనే స్నేహం చేయాలనిపించేది. తరగతి గదిలో అమ్మాయిల పక్కన కూర్చున్నప్పటికీ వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించేవాడిని. వారితో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నాలో అలజడి రేగేది’ అని వివరించాడు. అ బ్బాయిలతో స్నేహం చేయడాన్ని ఉపాధ్యాయురాళ్లు తప్పుపడుతూ చీవాట్లు పెట్టేవారన్నాడు. మరిన్ని శస్త్ర చికిత్సలు అవసరమని డాక్టర్లు చెప్పారని, అవసరమైన వైద్య చేయించుకునేందుకు దాతల సాయం కోసం చూస్తున్నానని, దాతలు సహాయం చేయాల ని ఈ సందర్భంగా భవానీప్రసాద్ కోరుతున్నాడు. చీవాట్లు పెట్టేదాన్ని.. అబ్బాయిలతో స్నేహం అంత మంచిదికాదని భవానీని చీవాట్లు పెట్టేదాన్ని. పదోతరగతిలోకి వచ్చేసరికి భవాని అబ్బాయిల డ్రెస్‌లు వేసుకోవడం, వారితో కలసి డ్యాన్స్ చేయడాన్ని నేను తట్టుకోలేకపోయా. చీవాట్లు పెడితే నన్ను కోపంగా చూసేది. ఇప్పుడు చూస్తే అప్పుడు భవాని (భానుప్రసాద్) చేసింది కరెక్టేనని అనిపిస్తుంది. - ఏసుమణి, ఉపాధ్యాయురాలు, జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుల ఆర్థికసాయం భానుప్రసాద్ తాను చదువుకున్న చిన్నశంకరంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు బుధవారం వెళ్లాడు. అక్కడి ఉపాధ్యాయులతో తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతని ప రిస్థితిని చూసి చలించిపోయిన ప్రధానోపాధ్యాయురాలు స్వరూపరాణి రూ.3,000, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రూ.1,100 ఆర్థిక సహాయం అందించారు.


