breaking news
The follow-on
-
IND vs SL: ‘ఫాలో ఆన్’ ఆడి గెలిచిన జట్లు ఇవే!
కొలంబోలో టీమిండియాతో రెండో టెస్టులో శ్రీలంక గెలవాలంటే అద్భుతం జరగాలి. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌లో పూర్తిగా వెనుకబడ్డ ఆతిథ్య జట్టు.. ఫాలో ఆన్ ఆడుతోంది. శ్రీలంక ఆశలన్నీ పసిందు సూరియబండారా, సొనాల్ దినుషలపైనే ఉన్నాయి.అయితే, భారత బౌలర్లు విజృంభిస్తే మాత్రం శ్రీలంకకు భారీ ఓటమి తప్పదు. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక మెరుగైన ఆరంభం అందుకున్నప్పటికీ టీమిండియానే శాసించే స్థితిలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గిల్ సేన గెలవడం దాదాపు లాంఛనమే!.. ఇదిలా ఉంటే.. టెస్టు మ్యాచ్‌లో ఫాలో ఆడి మరీ గెలిచిన జట్లు ఏవో తెలుసా? ఈ జాబితాలో టీమిండియా కూడా ఉందండోయ్!! (శ్రీలంకను ఫాలో ఆన్ ఆడిస్తున్న టీమిండియా)ఆసీస్‌పై ఇంగ్లండ్ గెలుపుహేమాహేమీలు ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య 1894లో తొలిసారి టెస్టు మ్యాచ్ జరిగింది. సిడ్నీలో జరిగిన ఈ పోరులో ఆసీస్ 586 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. జార్జ్ జిఫేన్ సెంచరీ, సిడ్ గ్రెగరీ డబుల్ సెంచరీ కారణంగా ఈ స్కోరు సాధ్యమైంది.ఇందుకు ప్రతిగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులే చేయడంతో.. కంగారూలు ఇంగ్లిష్ జట్టును ఫాలో ఆన్ ఆడించారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. 437 పరుగులు సాధించింది. తద్వారా ఆసీస్‌కు 177 పరుగుల లక్ష్యం విధించగా.. ఆతిథ్య జట్టు చేతులెత్తేసింది. దీంతో ఇంగ్లండ్ జయభేరి మోగించింది.మరోసారి అదే ఫలితంలీడ్స్ వేదికగా 1981లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో పర్యాటక ఆసీస్ తొలుత బ్యాటింగ్‌కు దిగి.. 401-9 వద్ద మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జాన్ డైసన్ సెంచరీతో అలరించాడు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 174 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి ఇంగ్లండ్‌ను ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లో దిగ్గజ ఇయాన్ బోతమ్ సంచలన రీతిలో శతక్కొట్టడంతో ఇంగ్లండ్ 356 పరుగులు సాధించింది.ఈ క్రమంలో 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. ఛేదనలో తడబడింది. ఫలితంగా ఇంగ్లండ్ 18 పరుగుల తేడాతో కంగారూలపై విజయం సాధించింది.ఈసారీ బాధిత జట్టు ఆస్ట్రేలియానే.. గెలుపు మనదేకోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌కు భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. 2001లో జరిగిన ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 445 పరుగులు సాధించింది.అయితే, బ్యాటర్ల వైఫల్యం కారణంగా టీమిండియా 171 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారీ ఆధిక్యం సంపాదించిన ఆసీస్.. టీమిండియాను తక్కువగా అంచనా వేసి ఫాలో ఆన్ ఆడించింది.రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం భారత్ తడబడలేదు. వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ కలిసి అద్భుతం చేశారు. ద్రవిడ్ భారీ శతకం (180) సాధించగా.. లక్ష్మణ్ (281) తృటిలో ట్రిపుల్ సెంచరీ మిస్ అయ్యాడు. వీరిద్దరి విజృంభణ కారణంగా టీమిండియా ఆసీస్‌కు 384 పరుగుల లక్ష్యం విధించింది.అయితే, ఈసారి భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ 212 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 171 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.ఇంగ్లండ్‌కు షాకిచ్చిన న్యూజిలాండ్వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 435 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జో రూట్ (153 నాటౌట్), హ్యారీ బ్రూక్ (186) శతకాలతో చెలరేగారు.అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ 209 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ కివీస్‌ను ఫాలో ఆన్ ఆడించగా.. రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగులు సాధించింది. కేన్ విలియమ్సన్ సెంచరీ (132)తో ఆకట్టుకోగా.. టామ్ లాథమ్ (83), డెవాన్ కాన్వే (61), డారిల్ మిచెల్ (54), టామ్ బ్లండెల్ (90) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 256 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఒక్క పరుగు తేడాతో గెలిచిన కివీస్.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను డ్రా చేసింది. చదవండి: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఆల్‌రౌండర్ -
శ్రీలంక ఆలౌట్.. ఫాలో ఆన్ ఆడిస్తున్న టీమిండియా
టీమిండియాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 290 పరుగులకు ఆలౌట్ అయింది. పసిందు సూరియబండారా భారీ అర్ధ శతకం (80)తో రాణించగా.. సొనాల్ దినుష శతక్కొట్టాడు. ఏడో స్థానంలో వచ్చిన దినుష 162 బంతులు ఎదుర్కొని 103 పరుగులు సాధించాడు. అయితే, మిగతా వారంతా విఫలం కావడంతో శ్రీలంకకు ఫాలో ఆన్ గండం తప్పలేదు.కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య ఆదివారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దేవదత్ పడిక్కల్ (117) శతక్కొట్టగా.. ధ్రువ్ జురెల్ అజేయ శతకం (115) సాధించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (63), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (50) హాఫ్ సెంచరీలతో అలరించగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 45 పరుగులతో రాణించాడు.ఫలితంగా సోమవారం నాటి రెండో రోజు ఆటలో భారత్ 503-9 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లతో చెలరేగగా.. ప్రభాత్ జయసూరియ, కేశారా నువాంత చెరో రెండు వికెట్లు తీశారు. లాహిరు కుమారకు ఒక వికెట్ దక్కింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక రెండో ఆటలో రెండు వికెట్ల నష్టానికి కేవలం ఎనిమిది పరుగులే చేసింది. ఈ క్రమంలో 8/2 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంకకు పసిందు ఊపిరిలూదాడు. మొత్తంగా 133 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. అయితే, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది.మిగతా వారిలో కమిందు మెండిస్ (32) ఓ మోస్తరుగా రాణించగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ (8), వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా (0) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో సొనాల్ దినుష పట్టుదలగా నిలబడ్డాడు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సరికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేయగలిగింది.ఇక బుధవారం నాటి నాలుగో రోజు ఆటను 265/8తో మొదలుపెట్టగా.. సారాంశ్ జైన్ లాహిరు కుమార (12)ను వెనక్కి పంపాడు. అప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న దినుషను సైతం సారాంశ్ పెవిలియన్‌కు పంపడంతో లంక ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. సారాంశ్ జైన్‌కు రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలకు తలా ఒక వికెట్ దక్కాయి. ఫాలో ఆన్ అంటే?టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 200 లేదా అంతకంటే ఎక్కువ ఆధిక్యంలో ఉంటే.. ఫాలో ఆన్ ఆడిస్తుంది. అంటే.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు ఆలౌట్ కాగానే మళ్లీ బ్యాటింగ్ చేయమని కోరుతుంది. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC)లోని 14.1.1 నిబంధన ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టుకు ఈ హక్కు లభిస్తుంది. భారత్- శ్రీలంక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. లంకను 290 పరుగులకు ఆలౌట్ చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం సాధించింది. కాబట్టి ఫాలో ఆన్ ఆడిస్తోంది. అసలే ఈ మ్యాచ్‌కు వాన ముప్పు ఉంది. మరోవైపు ఆట ఇప్పటికే నాలుగో రోజుకు చేరుకుంది. దీంతో టీమిండియా ఫాలో ఆన్‌కు మొగ్గుచూపింది. కాగా తొలి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.చదవండి: భువీ విజృంభణ -
విండీస్ ఫాలోఆన్
గాలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమై ఫాలోఆన్‌లో పడింది. దీంతో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లలో 2 వికెట్లకు 67 పరుగులు చేసింది. డారెన్ బ్రేవో (20 బ్యా టింగ్), బిషూ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కరీబియన్ జట్టు ఇంకా 166 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 66/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన విండీస్ జట్టు లంక స్పిన్నర్ రంగన హెరాత్ (6/68) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. డారెన్ బ్రేవో (50) మినహా మిగతా వారు నిరాశపర్చారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ శామ్యూల్స్ (11) తొందరగా అవుట్‌కాగా, బ్రేవో నిలకడగా ఆడాడు. బ్లాక్‌వుడ్ (11)తో కలిసి నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే లంక బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి స్కోరును కట్టడి చేశారు.


