breaking news
five die
-
షాపింగ్ సెంటర్‌పై కూలిన విమానం
సిడ్నీ: ఆస్ట్రేలియాలో మంగళవారం విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మెల్బోర్న్లోని ఓ షాపింగ్ సెంటర్‌పై విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మెల్బోర్న్లోని ఎసెండన్ ఫీల్డ్స్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం కొద్ది సెకన్లలోనే ప్రమాదానికి గురైంది. ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న షాపింగ్ సెంటర్‌పై కూలిపోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి, అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ప్రజలెవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. బీచ్కాండి ఎయిర్‌క్రాఫ్ట్ మెల్బోర్న్ నుంచి కింగ్ ఐలాండ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని విక్టోరియన్ ప్రీమియర్ అధికారి డానియల్ ఆండ్రూస్ వెల్లడించారు. -
షాపింగ్ సెంటర్‌పై కూలిన విమానం
-
ఏమిటీ ఘోరం
ఐదుగురి మృతి దురదృష్టకరమని వ్యాఖ్య ప్రభుత్వానికి జాతీయ హక్కుల కమిషన్ నోటీసు రెండువారాల్లోగా బదులివ్వాలని ఆదేశం మండుటెండల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఐదుగురి అకాలమృతికి కారణమైన అన్నాడీఎంకే ప్రచారసభలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మండిపడింది. రాజకీయ ప్రయోజనాల కోసం పేదల ప్రాణాలను హరించడమా అంటూ నిలదీసింది. ఈ ఘోరాలపై రెండువారాల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కమిషన్ నోటీసు జారీచేసింది. చెన్నై : అన్నాడీఎంకే అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేయడం కోసం పార్టీ అధినేత్రి జయలలిత సేలంలో బహిరంగ సభ నిర్వహించారు. సభకు హాజరైన ఇద్దరు వ్యక్తులు ఎండవేడిమి తాళలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అలాగే విరుదాచలంలో నిర్వహించిన సభలో మరో ఇద్దరు, అరుప్పుకోట్లలో ఒకరు ఇలా మొత్తం ఐదుగురు మృతి చెందారు. బహిరంగ సభ ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ఎటువంటి ప్రాథమిక సౌకర్యాలు, జాగ్రత్తలు తీసుకోలేదు. బహిరంగ సభ కోసం పిలుచుకు వచ్చిన ప్రజలను 100 డిగ్రీలకు పైగా కాలుతున్న ఎండలో సుమారు ఐదుగంటల పాటు ఉంచడం వల్లనే ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అన్నాడీఎంకే సభ నిర్వాహకులపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా డీఎంకే, డీఎండీకే, పీఎంకే తదితర పార్టీలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమిషన్ ఈనెల 2వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వుల వివరాలు ఇలా ఉన్నాయి. ‘మండుటెండల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని అన్ని రాజకీయ పార్టీలను, అభ్యర్థులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల సభల వద్ద తాగునీరు, ప్రాథమిక చికిత్స సదుపాయాలు, భద్రతా చర్యలు తీసుకుని ఉన్నారా అని తనిఖీ చేసిన తరువాతనే అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాగం సైతం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదని తేటతెల్లమైంది. వేసవి తీవ్రతగా ఉన్న సమయంలో సభలకు అనుమతి ఇవ్వరాదనే నిబంధన ఉన్నా అధికారులు పాటించక పోవడం దురదృష్టకరం. ప్రజల సంక్షేమం కోసం, మానవ హక్కుల ఉల్లంఘన జరుగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఫిర్యాదుల్లో పేర్కొన్న ప్రకారం విరుదాచలం, సేలం, విరుదునగర్ జిల్లాల్లో జరిగిన ప్రచార సభల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఐదుగురు మృత్యువాత పడిన సంఘటనలపైనా, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా తీసుకోనున్న చర్యలపై రెండువారాల్లోగా సవివరమైన నివేదికను దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశించింది. -
తమిళనాట ప్రమాదం: అయ్యప్ప భక్తుల మృతి
తమిళనాడు రాష్ట్రంలోని పళని సమీపంలోని తెరియకులం వద్ద తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ టెంపోను లారీ ఢీకొంది. దాంతో టెంపోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా, పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులలో ముగ్గురిని చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన అయ్యప్ప భక్తులుగా గుర్తించారు. వీరి పేర్లు రాహుల్, రెడ్డి ప్రసాద్, చండ్రాయుడు. మరో ఇద్దరు రెండు వాహనాల డ్రైవర్లు. అతి వేగంగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. తమిళనాడు పళని వద్ద రోడ్డు ప్రమాదం క్షతగాత్రులను తేని జిల్లా పెరియాలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.