breaking news
final berth
-
టీమిండియా ఓడిపోవాలని కోరుకుంటున్న ఆసీస్ కోచ్
వెల్లింగ్టన్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న ఆఖరిదైన నాలుగో టెస్టులో టీమిండియా ఓటమిపాలవ్వాలని ఆసీస్ తాత్కాలిక హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కోరుకుంటున్నాడు. ఆసీస్‌కు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు దక్కాలంటే మొటేరా మైదానంలో జరిగే ఆఖరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియాను ఇంగ్లీష్ జట్టు ఓడించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే న్యూజిలాండ్ ఫైనల్ ఆశలు గల్లంతై ఆసీస్ ఫైనల్ చేరేందుకు మార్గం సుగమం అవుతుంది. అప్పుడు జూన్‌లో లార్డ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాతో తలపడే అవకాశం ఆసీస్‌కు లభిస్తుంది. ఇందుకే ఆసీస్ తాత్కాలిక కోచ్ టీమిండియా ఓటమిని కోరుకుంటున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టుతో పాటు ఉన్న మెక్‌డొనాల్డ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆసీస్ ఫైనల్ బెర్తు అవకాశాలపై ఆశాభావం వ్యక్తం చేశాడు. భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియాను ఓడించాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లండ్ జట్టుకు కష్టమే అయినప్పటికీ.. తాము మాత్రం రూట్ సేన అద్భుతాలు చేసైనా మ్యాచ్‌ను గెలవాలని కోరుకుంటున్నామన్నారు. కాగా, ఆసీస్ రెగ్యులర్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ విశ్రాంతి తీసుకోవడంతో మెక్‌డొనాల్డ్ ఆసీస్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఆతిధ్య జట్టును మట్టికరిపించిన పర్యాటక ఇంగ్లండ్ జట్టు, వరుసగా రెండు, మూడు టెస్టు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు మార్చి 4న ఉదయం 9:30కు ప్రారంభంకానుంది. -
‘ఫైనల్ బెర్త్’ సాధించేనా?
* నేడు ఆస్ట్రేలియాతో భారత్ పోరు * చాంపియన్స్ ట్రోఫీ హాకీ లండన్: మూడున్నర దశాబ్దాలుగా ఊరిస్తోన్న చాంపియన్స్ ట్రోఫీ ‘ఫైనల్ బెర్త్’ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు భారత హాకీ జట్టు నేడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ పోరుకు అర్హత సాధించాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ను డ్రా గా ముగించినా భారత్‌కు ఫైనల్లో తలపడే అవకాశాలు సజీవంగానే ఉంటాయి. ఒకవేళ భారత్ ఓడి తర్వాత జరిగే మ్యాచ్‌లో బ్రిటన్... బెల్జియంపై నెగ్గితే భారత్ మూడో స్థానంలో నిలుస్తుంది. ఈ సందర్భంలో భారత్ కాంస్య పతకం కోసం పోరాడాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో 10 పాయింట్లతో ఆసీస్ మొదటి స్థానంలో ఉండగా, 7 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. బ్రిటన్ (5పాయింట్లు), బెల్జియం (4 పాయింట్లు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
స్ఫూర్తి నింపడం కష్టమైంది
‘ఫైనల్ బెర్త్ దూరమైన తర్వాత జట్టులో స్ఫూర్తి నింపడం కష్టం. అయినా మేం మంచి ప్రదర్శన కనబర్చాం. పాక్‌పై బంగ్లాదేశ్ గెలుస్తుందని భావించాం. కానీ అది జరగలేదు. కాబట్టి మిగతా వాటితో పోలిస్తే ఈ మ్యాచ్‌లో కాస్త రిలాక్స్డ్గా ఆడాం. పాక్, లంక మ్యాచ్‌ల్లో కీలక సమయంలో తప్పులు చేశాం. క్యాచ్, స్టంప్‌లు మిస్ చేసినా జట్టు ప్రదర్శన సంతృప్తినిచ్చింది’ - కోహ్లి (భారత కెప్టెన్)