breaking news
FIH World Cup
-
హాకీ వరల్డ్‌కప్‌లో భారత్ చరిత్ర.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం
మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. పూల్-డీలో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 6-1 గోల్స్ తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో హాకీ వరల్డ్‌కప్ చరిత్రలో భారత మహిళల జట్టుకు ఇదే అతిపెద్ద విజయంగా నిలిచింది.కెప్టెన్ సలీమా టేటే నేతృత్వంలోని భారత జట్టు టోర్నీలో ఇప్పటివరకు ఓటమి లేకుండా కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో చైనాతో 2-2 డ్రా చేసుకున్న భారత్.. రెండో మ్యాచ్‌లో మాత్రం దక్షిణాఫ్రికాను పూర్తిగా చిత్తు చేసింది.తొలి క్వార్టర్‌లోనే ఆధిక్యంభారత్ తరఫున తొలి గోల్‌ను సునెలిత టోప్పో 11వ నిమిషంలో నమోదు చేసింది. స్ట్రైకింగ్ సర్కిల్‌లోకి వచ్చిన బంతిని అందుకున్న ఆమె దాన్ని గోల్‌గా మలిచింది. దక్షిణాఫ్రికా డిఫెన్స్ చేసిన పొరపాటును భారత్ సమర్థంగా ఉపయోగించుకుంది.రెండో క్వార్టర్లో భారత దాడులు మరింత పదునెక్కాయి. నవనీత్ కౌర్, సుశీలా చాను ఒక్కో గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 3-0కు పెరిగింది.మూడో క్వార్టర్లో భారత్ మరో మూడు గోల్స్‌తో మ్యాచ్‌ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకుంది. దీపిక, లాల్రెమ్సియామి, రానా సాక్షి ఒక్కో గోల్ సాధించారు.భారత్ వరుస దాడులతో దక్షిణాఫ్రికా డిఫెన్స్‌ను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. చివరికి మ్యాచ్‌ను 6-1తో ముగించి టోర్నీలో భారీ విజయాన్ని నమోదు చేసింది.చారిత్రక విజయంఈ విజయంతో హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు తమ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక డ్రాతో పూల్-డీలో భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. ఈ గెలుపు భారత్ నాకౌట్ దశపై ఆశలను మరింత పెంచింది. -
పాకిస్తాన్‌కు కొత్త హెడ్‌కోచ్.. ఆటగాళ్లలో తీవ్ర అసంతృప్తి
కరాచీ: పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) తమ సీనియర్ టీమ్ హెడ్ కోచ్ ఎంపికకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీమ్‌కు కోచ్‌గా ఉన్న ఆస్ట్రేలియన్ కొలిన్ బ్యాచ్ స్థానంలో స్వదేశీ కోచ్‌ను ప్రకటించింది. మాజీ ఒలింపియన్ మన్జూర్ ఉల్ హసన్ పాక్ టీమ్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. రాబోయే ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్, ప్రపంచ కప్‌లలో పాల్గొనే టీమ్ మన్జూర్ శిక్షణలోనే సన్నద్ధమవుతుంది. మాజీ ఆటగాళ్లు హసన్ సర్దార్, ఇస్లాహుద్దీన్ సిద్దిఖీలతో కూడిన పీహెచ్ఎఫ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కమిటీ సిఫారసుపై కొత్త కోచ్ ఎంపిక జరిగింది. తీవ్ర అసంతృప్తిఅయితే మన్జూర్ను కోచ్‌గా నియమించడంపై పాక్ జట్టులో ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. తాజా నిర్ణయం పట్ల వారు నిర్ఘాంతపోయారు. 70వ, 80వ దశకాల్లో డిఫెండర్‌గా మన్జూర్ పాక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అనూహ్య ప్రకటన‘ఆటగాడిగా మన్జూర్కు మంచి గుర్తింపు ఉన్న మాట వాస్తవమే. అయితే కోచ్‌గా ఆయనను ఎంపిక చేయడం అంటే తీవ్ర నిరాశాజనక ఫలితాలను కొనితెచ్చుకోవడమే. కొలిన్ బ్యాచ్ అన్ని రకాలుగా అర్హుడైన కోచ్. మేమంతా ఆయన శిక్షణతో సంతోషంగా ఉన్నాం. ఆధునిక హాకీకి సంబంధించి అన్ని అంశాలపై అవగాహన ఉంది. ప్రొ లీగ్, వరల్డ్ కప్‌లాంటి పెద్ద ఈవెంట్లలో మమ్మల్ని కొలిన్ సమర్థంగా నడిపిస్తాడని భావించిన తరుణంలో ఈ అనూహ్య ప్రకటన వచ్చింది’ అని పాక్ జాతీయ జట్టులోని ఒక ఆటగాడు వ్యాఖ్యానించాడు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత పాకిస్తాన్ ఈ ఏడాది జరిగే ప్రపంచ కప్‌నకు అర్హత సాధించింది. చదవండి: IPL 2026: బీసీసీఐ కొత్త నిబంధనలు -
ఆసియకప్ విజేతగా టీమిండియా..
హాకీ ఆసియా కప్- 2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం రాజ్‌గిర్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో సౌత్ కొరియాను 4-1 తేడాతో టీమిండియా చిత్తు చేసింది. దీంతో ఎనిమిదేళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఆసియాకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరగనున్న హాకీ వరల్డ్‌కప్‌కు భారత్ నేరుగా ఆర్హత సాధించింది.ఓవరాల్‌గా భారత్‌కు ఇది నాల్గో ఆసియాకప్ టైటిల్. చివరగా 2017 బంగ్లాదేశ్‌లో జరిగిన హాకీ ఆసియాకప్‌ను ఇండియా గెలుచుకుంది. ఈ తుది పోరులో భారత్ తరపున దిల్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ సాధించగా.. సుఖ్జీత్, అమిత్ రోహిదాస్ చెరో గోల్ సాధించింది. నిర్ణీత సమయంలో భారత్ నాలుగు గోల్స్ సాధించగా.. కొరియా కేవలం ఒక్క గోల్‌కే పరిమితమైంది. రెండు గోల్స్‌తో మెరిసిన దిల్ప్రీత్కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. భారత హాకీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలుఆసియాకప్లో అద్భుత విజయం సాధించిన భారత హాకీ జట్టుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలియజేశారు. ‘టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ‘ ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు జగన్.Heartiest congratulations to Team India on a magnificent victory at the Asia Cup 2025 in Rajgir, Bihar! Wishing the entire team continued success, good health, and glory in the years ahead.#HockeyIndia pic.twitter.com/80jd1hj5s3— YS Jagan Mohan Reddy (@ysjagan) September 7, 2025 -
Hockey World Cup 2023: భారత్ 9వ స్థానంతో ముగింపు
భువనేశ్వర్: సొంతగడ్డపై జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్ హాకీలో క్వార్టర్ ఫైనల్ కూడా చేరలేక నిరాశపరిచిన భారత జట్టు చివరకు విజయంతో మెగా టోర్నీని ముగించింది. శనివారం 9 నుంచి 12వ స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 5–2తో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. అయితే మరో మ్యాచ్‌లో అర్జెంటీనా 6–0 స్కోరు తేడాతో వేల్స్‌ను చిత్తు చేయడంతో భారత్, అర్జెంటీనాలు సంయుక్తంగా 9వ స్థానంలో నిలిచాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున అభిషేక్ (4వ ని.), హర్మన్‌ప్రీత్ సింగ్ (11వ ని.), షంషేర్ సింగ్ (44వ ని.), ఆకాశ్‌దీప్ సింగ్ (48వ ని.), సుఖ్జీత్ సింగ్ (58వ ని.) తలా ఒక గోల్ చేశారు. సఫారీ జట్టులో సంకెలొ ఎంవింబి (48వ ని.), ముస్తఫా కాసిమ్ (59వ ని.) చెరో గోల్ చేశారు. ఆట ఆరంభమైన నాలుగో నిమిషంలోనే అభిషేక్ ఫీల్డ్‌గోల్‌తో భారత్‌కు శుభారంభమిచ్చాడు. ఈ క్వార్టర్‌లోనే హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి 2–0తో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఇదే స్కోరుతో తొలి అర్ధభాగాన్ని (రెండు క్వార్టర్లు) ముగించిన భారత్ ఆఖరి క్వార్టర్లో మరో రెండు ఫీల్డ్ గోల్స్‌ను ఆకాశ్‌దీప్, సుఖ్జీత్ సాధించడంతో విజయం సులువైంది. ► నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల ఫైనల్ ► జొకోవిచ్ ( సెర్బియా) X సిట్సిపాస్ ( గ్రీస్) ► మ.గం. 2 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం -
FIH Nations Cup final: ఫైనల్లో భారత మహిళల హాకీ జట్టు
వాలెన్సియా: ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల ‘నేషన్స్ కప్’ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. కెప్టెన్ సవిత పూనియా గోల్‌పోస్ట్ ముందు అడ్డుగోడలా నిలువడంతో భారత్ షూటౌట్లో 2–1తో ఐర్లాండ్‌పై గెలుపొందింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. తొలిక్వార్టర్లో ఐర్లాండ్ స్ట్రయికర్ నవొమి క్యారొల్ (13వ ని.) గోల్ చేయడంతో ఐర్లాండ్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్లోనూ ఈ ఆధిక్యాన్ని కొనసాగించింది. అయితే మూడో క్వార్టర్ ముగిసే దశలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఉదిత (45వ ని.) గోల్‌గా మలచి స్కోరును సమం చేసింది. షూటౌట్లో భారత బృందంలో లాల్రేమ్సియామి, సోనిక గోల్స్ సాధించగా, ఐర్లాండ్ జట్టులో హన్నా మెక్‌లాలిన్ గోల్ చేసింది. ఎలెన్ కరన్ షాట్‌ను సవిత సమర్థంగా ఆడ్డుకుంది. అప్పటికి భారత్ 5 ప్రయత్నాలు ముగియగా... ఐర్లాండ్‌కు ఆఖరి షాట్ మిగిలుంది. కత్రిన్ ములన్ షాట్‌ను వైడ్‌గా కొట్టడంతో భారత్ 2–1తో విజయం సాధించింది. ఫైనల్ చేరిన భారత్... స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
భారత్ శుభారంభం
ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్ న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు... యూరోప్ పర్యటనను విజయంతో మొదలుపెట్టింది. ఎఫ్ఐహెచ్ పురుషుల ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7-0తో లీడెన్ హాకీ క్లబ్ (డచ్ నేషనల్ క్లబ్)పై విజయం సాధించింది. అక్షదీప్ (18వ ని.), నికిన్ తిమ్మయ్య (21వ ని.), రూపిందర్ పాల్ సింగ్ (38, 39వ ని.), రమన్‌దీప్ సింగ్ (43వ ని.), రఘునాథ్ (45వ ని.), యువరాజ్ వాల్మీకి (53వ ని.)లు భారత్‌కు గోల్స్ అందించారు. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరుజట్లు మెరుగైన డిఫెన్స్‌తో ఆకట్టుకున్నాయి. ఫార్వర్డ్స్ అటాకింగ్ మొదలుపెట్టడంతో తొలి అర్ధభాగంలో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. లీడెన్ క్లబ్ ఆటగాళ్లు స్కోరును సమం చేసేందుకు చేసిన ప్రయత్నాలను గోల్‌కీపర్ శ్రీజేష్ సమర్థంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగంలోనూ భారత ప్లేయర్ల హవా కొనసాగింది. లీడెన్ క్లబ్‌కు లభించిన ఒకటి, రెండు అవకాశాలనూ సబ్‌స్టిట్యూట్ గోల్‌కీపర్ హర్జ్యోత్ సింగ్ అడ్డుకోవడంతో మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. నెదర్లాండ్స్‌లో మే నెల 31 నుంచి జూన్ 15 వరకు ప్రపంచకప్ జరగనుంది.


