
హాకీ ఆసియా కప్- 2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం రాజ్‌గిర్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో సౌత్ కొరియాను 4-1 తేడాతో టీమిండియా చిత్తు చేసింది. దీంతో ఎనిమిదేళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఆసియాకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరగనున్న హాకీ వరల్డ్‌కప్‌కు భారత్ నేరుగా ఆర్హత సాధించింది.

ఓవరాల్‌గా భారత్‌కు ఇది నాల్గో ఆసియాకప్ టైటిల్. చివరగా 2017 బంగ్లాదేశ్‌లో జరిగిన హాకీ ఆసియాకప్‌ను ఇండియా గెలుచుకుంది. ఈ తుది పోరులో భారత్ తరపున దిల్ప్రీత్ సింగ్ రెండు గోల్స్ సాధించగా.. సుఖ్జీత్, అమిత్ రోహిదాస్ చెరో గోల్ సాధించింది. నిర్ణీత సమయంలో భారత్ నాలుగు గోల్స్ సాధించగా.. కొరియా కేవలం ఒక్క గోల్‌కే పరిమితమైంది. రెండు గోల్స్‌తో మెరిసిన దిల్ప్రీత్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
భారత హాకీ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
ఆసియాకప్‌లో అద్భుత విజయం సాధించిన భారత హాకీ జట్టుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ‘టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ‘ ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు జగన్.
Heartiest congratulations to Team India on a magnificent victory at the Asia Cup 2025 in Rajgir, Bihar!
Wishing the entire team continued success, good health, and glory in the years ahead.#HockeyIndia pic.twitter.com/80jd1hj5s3— YS Jagan Mohan Reddy (@ysjagan) September 7, 2025