breaking news
Festival wishes
-
ముస్లింలకు ఈద్ ముబారక్ తెలుపుతూ సీఎం జగన్ ట్వీట్
-
బ్యాంకులంటే విజయ్ మాల్యా గుండెల్లో దడే! కావాలంటే మీరే చూడండి!
బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.9,000 కోట్లకు పైగా బకాయిల్ని ఎగ్గొట్టి విదేశాలకు పరారైన లిక్కర్‌బ్యారన్ విజయ్ మాల్యాను ఇండియాకు రప్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ కింగ్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. లిక్కర్ కంపెనీ నుంచి ఫోర్స్ ఇండియా ఫార్ములా వన్ దాకా..ఐపీఎల్ నుంచి కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దాకా..విజయ్ మాల్యా చేసిన ప్రతీ బిజినెస్‌లోనూ నష్టాలే స్వాగతం పలికాయి. ముఖ్యంగా 2005లో ప్రారంభించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వైఫల్యం అప్పుల భారాన్ని మరింత పెంచేశాయి. ఇతర వ్యాపారాలు సైతం దెబ్బతిన్నాయి. పైలట్లు, ఇంజనీర్లకు నెలల తరబడి జీతాలు చెల్లించడంలో విఫలమయ్యారు. అందుకే 2012లో నాటి భారత కేంద్ర ప్రభుత్వం మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్ లైసెన్స్‌ను రద్దు చేసింది. వెరసీ బ్యాంకుల వద్ద తీసుకున్న వేల కోట్ల రుణాల్ని తిరిగి బ్యాంకులకు చెల్లించలేక 2016లో భారత్ నుంచి పారిపోయాడు. అందుకే బ్యాంక్‌లు విజయ్ మాల్యాకు ఇచ్చిన రుణాల్ని ముక్కుపిండి వసూలు చేస్తుంటే..ఇటు కేంద్రం సైతం యూకే నుంచి భారత్‌కు తెప్పించే ప్రయత్నాల్ని కొనసాగిస్తుంది. He tweets only when the banks are closed. 😂😂😂😂😂😂 pic.twitter.com/7I1lMDrqke — Vithoba Corleone (@DonJuannabe) May 5, 2022 ఈ క్రమంలో విజయ్ మాల్యా ట్విట్లపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఎందుకంటే? విజయ్ మాల్యా నిత్యం ట్విటర్లో యాక్టీవ్‌గా ఉంటుంటారు. సమయం, సందర్భాన్ని బట్టి ఏదో ఒక ట్విట్ చేస్తుంటారు. ఇంతకీ ఆ ట్విట్లు ఎప్పుడు వేస్తుంటారో తెలుసా? బ్యాంక్‌లకు హాలిడేస్‌లో ఉన్నప్పుడు లేదంటే రెండో శనివారం, నాలుగో శనివారం మాత్రమే. కావాలంటే మీరే చూడండి అంటూ నెటిజన్లు విజయ్ మాల్యా చేసిన ట్విట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు విజయ్ మాల్యా సంక్రాంతి,హోలీ, ఉగాది, విషు, ఈస్టర్,ఈద్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్ చేశారు. గతేడాది డిసెంబర్లో క్రిస్మస్, న్యూ ఇయర్ విషెస్ చెబుతూ ఒక ట్వీట్ చేశాడని, అందుకు సంబంధించిన ట్విట్లను వైరల్ చేస్తున్నారు. He tweets on second and fourth Saturdays also. — TrOLL PLAZA (@1passdaily) May 5, 2022 దీనిపై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. బ్యాంకులంటే చిన్న చిన్న రుణాలు తీసుకున్న వారికే కాదండోయ్..వేలకోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్యా లాంటి వాళ్లకు కూడా భయమేనని కామెంట్ చేస్తున్నారు. అతను మంచి రుణగ్రహీత. హాలిడేస్‌లో తప్పా..వర్కింగ్ డేస్‌లో బ్యాంకర్లను అస్సలు డిస్ట్రబ్ చేయడు అని ఒక నెటిజన్ అంటుంటే ..రెండో శనివారం, నాలుగో శనివారం మాత్రమే ట్విట్ చేస్తాడు"అని చమత్కరించాడు. చదవండి👉అమ్మకానికి విజయ్‌మాల్యా ఇల్లు.. చివరి నిమిషంలో ట్విస్ట్ -
పప్పులో కాలేసిన ప్రియాంక గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ యువ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పప్పులో కాలేశారు. నిజమైన పప్పులో కాదండోయ్. కశ్మీరీ పండిట్లకు నూతన సంవత్సర (నవ్రే) శుభాకాంక్షలను తెలపాలనే ఉద్దేశంతో ప్రియాంక చేసిన ట్వీటు హాస్యాస్పదం అవుతోంది. కశ్మీరీల పండుగ నర్మేకు బదులు నౌరోజ్ ముబారక్ అని ప్రియాంక తప్పుగా ట్వీటారు. దీంతో ప్రియాంక ట్వీటును విమర్శిస్తూ, ఆమె మీద జోకులు పేలుస్తూ చాలా మంది నెటిజన్లు ట్రోలింగ్ చేస్తన్నారు. ‘మేడమ్ ప్రియాంక గారు, నౌరోజ్‌ను మార్చి 21న జరుపుకుంటారు. ఈ రోజు ఏప్రిల్ 5. మీరు చాలా ఆలస్యంగా విష్ చేశారు. కానీ, మీకు తెలియని విషయమేంటంటే.. ఇవాళ నవ్రే పండుగ. నవ్రే శుభాకాంక్షలు తెలిపితే బాగుండేది’ అని ఓ నెటిజన్ చురకలంటించారు. ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్ నౌరుజ్ అనేది పార్సీల కొత్త సంవత్సరం పేరు. కశ్మీరీ బ్రాహ్మణుల పండుగను నవ్రే అని పిలుస్తారు. నవ్రే అనే పదం, సంస్కృత పదమైన నవ వర్ష నుంచి పుట్టింది. క్రియాశీల రాజకీయాల్లోకి ఈ మధ్యే అడుగిడిన ప్రియాంక.. గాయాలపాలైన విలేకరులకు సహాయం చేయడం, ప్రముఖ ఆలయాల సందర్శన, లోక్‌సభ ఎన్నికల ర్యాలీల్లో జోరుగా పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకుంటున్న తరుణంలో, ఈ ట్వీట్ ఆమెను అభాసుపాలు చేస్తోంది. -
ఆ లుక్ మనసు దోచేసింది..
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ 'నాన్నకు ప్రేమతో' ఫస్ట్ లుక్ ఫ్యాన్స్‌నే కాదు హీరోయిన్స్‌ని కూడా ఫిదా చేసింది. 'ఇది తారక్ మోస్ట్ స్టైలిష్ లుక్ కాదా..' అంటూ ఆ సినిమా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది. లండన్‌లో షెడ్యూల్ ముగించుకుని ఇన్ని రోజులకు హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యానని, తిరిగి హైదరాబాద్‌కి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ.. ప్రతి ఒక్కరు ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే ఉపయోగించాలని.. అప్పుడు దేవుడు సంతోషిస్తాడని ట్వీటింది ప్రస్తుతానికి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.