breaking news
FB Live
-
రైల్వే స్టేషన్లో వికృత చర్య.. ఫేస్బుక్లోలైవ్!
బందెల్ : రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి వికృత చర్యను ఓ మహిళా ఫేస్బుక్లో లైవ్ పెట్టింది. ఈఘటన పశ్చిమబెంగాల్లోని బందెల్ రైల్వే స్టేషన్లో ఆదివారం చోటు చేసుకుంది. ఆ మహిళా ట్రైన్లో కూర్చొని ఉండగా.. ఆ వ్యక్తి మహిళల కంపార్ట్మెంట్ ముందుకు వచ్చి అందరు చూస్తుండగానే వికృత చర్యకు పాల్పడ్డాడు. దీంతో ఇబ్బెట్టుగా ఫీలైన ఆ మహిళ ఇతర ప్రయాణీకులను అప్రమత్తం చేసి రైలు దిగి అతన్ని బెదిరించే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన రైల్వే పోలీసుల.. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుంచి పరారయ్యాడు. సాక్ష్యం కోసమే ఫెస్‌బుక్‌లో లైవ్‌లో పెట్టినట్లు ఆ మహిళ తెలిపింది. రైల్వే పోలీస్ ఆఫీస్ ముందే అతను అందరు చూస్తుండగా అసభ్యంగా ప్రవర్తించాడని, తను వీడియో తీయడాన్ని గమనించే పోలీసులు అప్రమత్తమయ్యారని ఆమె వెల్లడించారు. పోలీసులు మాత్రం ఆ వ్యక్తికి మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పడం గమనార్హం. కోల్‌కతాలో కూడా ఓ బస్సులో ఇదే తరహా ఘటన చోటుచేసుకోగా ఓ మహిళ ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. -
లైవ్ వీడియోతో సస్పెండైన ఎమ్మెల్యే
గౌహతి : సోషల్ మీడియాలో అభిమానులకు అసెంబ్లీలో తన ప్రసంగాన్ని లైవ్‌లో చూపించాలనుకున్న ఓ ఎమ్మెల్యే చివరకు మూడు రోజులపాటూ సస్పెండ్ అయ్యారు. ఈ సంఘటన అసోంలోని శాసనసభలో చోటుచేసుకుంది. ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాం ఫిబ్రవరి3న అసెంబ్లీలో అక్రమ వలసల సమస్యపై ప్రసంగిస్తుండగా ఫేస్ బుక్‌లో తన స్పీచ్‌ను లైవ్‌లో పెట్టారు. దీనిపై ఇతర సభ్యలు నుంచి స్పీకర్‌కు ఫిర్యాదులు అందాయి. వారు వీడియో ఫూటేజీని కూడా తమ ఫిర్యాదుతో జత చేశారు. దీంతో వెంటనే ఎథిక్స్ కమిటీని విచారణ చేపట్టి సోమవారం నివేదిక సమర్పించాలని అసోం అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాత్ గోస్వామి ఆదేశించారు. ఇలా చేయడం సభా నియమాలను ఉల్లంగించడమే అవుతుందని, ప్రస్తుత సభ నుంచి అమినుల్‌ను కొద్ది రోజులపాటూ సస్పెండ్ చేయాలని ఎథిక్స్ కమిటీ తన నివేధికలో పేర్కొంది. కమిటీ సిఫార్సులను ఆమెదించి మూడు రోజులపాటూ అమినుల్‌ను సస్పెండ్ చేసినట్టు స్పీకర్ తెలిపారు. 'తన తప్పుపై రాతపూర్వకంగా అమినుల్ క్షమాపణ కోరారు. ఇది అంత చిన్న తప్పు కాదు. అమినుల్ ఓ సీనియర్ సభ్యులు, ఆయన ఇలా చేస్తారని అనుకోలేదు' అని స్పీకర్ పేర్కొన్నారు. ఏఐయూడీఎఫ్ సభ్యుల ఎదుటే అమినుల్‌ను ఫిబ్రవరి 8 వరకు స్పెండ్ చేసినట్టు స్పీకర్ తెలిపారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తూనే..అసెంబ్లీ కార్యకలాపాలు మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయాలని అమినుల్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం మనం సభలో ఏం చేస్తున్నామో ప్రజలు చూడాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.